హైదరాబాద్: భారత్‌కు ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్‌కు టి20 సిరీస్‌కు ముందు మరో ఎదురు దెబ్బ తగిలింది. వెన్ను గాయం కారణంగా భారత్‌తో వన్డే సిరీస్ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్.. టీ20 సిరీస్‌కూ దూరమయ్యాడు.
అగ్రస్థానంలోనే కోహ్లీ, బుమ్రా: మరింత మెరుగైన ధోని ర్యాంకు
గప్తిల్ ఇంకా కోలుకోకపోవడంతో అతడి స్థానంలో ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్‌ను న్యూజిలాండ్ జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన చేసింది. "దురదృష్టవశాత్తు గప్టిల్ నొప్పి నుంచి ఇంకా కోలుకోలేదు. ఐదు రోజుల్లో మూడు మ్యాచ్‌లు ఉండటంతో అతను ఆడటం అసాధ్యం. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో గప్టిల్ పాత్ర వెలకట్టలేనిది. ఏదేమైనా అతను తొందరగా కోలుకుంటాడని ఆశిస్తున్నాం" అని కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ పేర్కొన్నాడు.
భారత్‌తో తొలి మూడు వన్డేల్లో పేలవ ప్రదర్శన చేసిన గుప్తిల్.. గాయంతో చివరి రెండు మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రెండు మ్యాచ్‌లూ ఆడిన నీషమ్ పర్వాలేదనిపించడంతో టీ20ల్లోనూ అతడికే సెలక్టర్లు చోటు కల్పించారు. మరోవైపు వచ్చే వారం బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి.
మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6(బుధవారం) వెలింగ్టన్‌లో జరుగుతుంది. ఆ తర్వాత 8, 10న భారత్, కివీస్ మధ్య మూడు టీ20లు జరుగనున్నాయి.
భారత్‌తో టీ20 సిరిస్‌కు కివీస్ జట్టు:
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), బ్రాస్‌వెల్, గ్రాండ్‌హోమీ, ఫెర్గుసన్, కుగ్గెల్జిన్, డారెల్ మిచెల్, మున్రో, నీషమ్, సాంట్నెర్, సీఫెర్ట్, సోధీ, సౌతీ, టేలర్.