న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హామిల్టన్ వన్డేలో చెత్త రికార్డు: టీమిండియా టాప్-10 అత్యల్ప స్కోర్లివే

India vs New Zealand: A look at Men in Blues top 10 lowest-ever scores in ODIs

హైదరాబాద్: న్యూజిలాండ్ గడ్డపై హ్యాట్రిక్ విజయాలతో జోరుమీద కనిపించిన టీమిండియా హామిల్టన్ వేదికగా గురువారం జరిగిన నాలుగో వన్డేలో మాత్రం ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్ (5/21), గ్రాండ్‌హోమ్ (3/26) ఒక ఆట ఆడుకున్నారు.

బిగ్‌బాష్ లీగ్‌లో కామికల్ రనౌట్: బ్యాట్స్‌మెన్లు ఢీకొంటే లాభం బౌలర్‌కి (వీడియో)బిగ్‌బాష్ లీగ్‌లో కామికల్ రనౌట్: బ్యాట్స్‌మెన్లు ఢీకొంటే లాభం బౌలర్‌కి (వీడియో)

ఈ మ్యాచ్‌లో బౌల్ట్ దెబ్బకు భార‌త్ త్వ‌ర‌త్వ‌ర‌గా వికెట్లను కోల్పోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలిపోయింది. ఫలితంగా తొమ్మిదేళ్ల ఆనంతరం అత్యల్ప స్కోరుకు ఆలౌటై ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

1
44083
2010లో దంబుల్లా వేదికగా

2010లో దంబుల్లా వేదికగా

అది కూడా 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌(88) పైనే ఈ రికార్డు ఉండటం విశేషం. ఇక, ఇప్పటివరకు శ్రీలంక(2000)పై 54 పరుగులే ఇప్పటివరకు అత్యల్ప స్కోరు కావడం విశేషం. భారత జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమవగా.. ఇందులో ఇద్దరు టాప్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ డకౌట్‌‌గా వెనుదిరిగారు.

టాప్ స్కోరర్‌గా యజువేంద్ర చాహల్

టాప్ స్కోరర్‌గా యజువేంద్ర చాహల్

చివర్లో బ్యాట్‌తో రాణించిన చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ (18 నాటౌట్: 37 బంతుల్లో 3 ఫోర్లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినివ్వగా, తొడ కండరాల గాయం కారణంగా ధోని ఈ మ్యాచ్‌కి దూరమైన సంగతి తెలిసిందే. 2010 తర్వాత టీమిండియా 100 పరుగులలోపే వన్డేలో కుప్పకూలడం ఇదే తొలిసారి.

తక్కువ స్కోరుకి ఆలౌటైన మ్యాచ్‌లు

తక్కువ స్కోరుకి ఆలౌటైన మ్యాచ్‌లు

సుదీర్ఘ వన్డే క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు తక్కువ స్కోరుకి ఆలౌటైన మ్యాచ్‌లను ఓసారి పరిశీలిస్తే..!

* 54 vs Sri Lanka in Sharjah (2000)

* 63 vs Australia in Sydney (1981)

* 78 VS Sri Lanka in Kanpu (1986)

* 79 vs Pakistan in Sialkot (1978)

* 88 vs New Zealand Dambulla (2010)

* 91 vs South Africa in Durban (2006)

* 100 vs Australia in Sydney (2000)

* 100 vs West Indies in Ahemedabad (1993)

* 103 vs Sri Lanka in Dambulla (2010)

* 103 vs Sri Lanka in Colombo (2008)

Story first published: Thursday, January 31, 2019, 12:31 [IST]
Other articles published on Jan 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X