న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

1st ODI: విలియమ్సన్ హాఫ్ సెంచరీ, చాహల్ దెబ్బకు కివీస్ కుదేలు

Ind vs New Zealand : Team India Target Is 158 Runs In Napier ODI | Oneindia Telugu
India vs New Zealand, Live Score 1st ODI: Kane Williamson Fifty Keeps New Zealand Afloat In Napier

హైదరాబాద్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా నేపియర్ వేదికగా మెక్‌లీన్ పార్క్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్‌ కష్టాల్లో పడింది. కేదార్‌ జాదవ్‌ బౌలింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ కళ్లు చెదిరేరీతిలో డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకోవడంతో కివీస్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌(12) పెవిలియన్‌ బాట పట్టడంతో ఐదో వికెట్‌ కోల్పోయింది.

India vs New Zealand, 1st ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్India vs New Zealand, 1st ODI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

విలియమ్సన్ హాఫ్ సెంచరీ

మరో ఎండ్‌లో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీని నమోదు చేసుకున్నాడు. 63 బంతుల్లో ఆరు ఫోర్ల సాయంతో కెరీర్‌లో 36వ హాఫ్ సెంచరీని సాధించాడు. అంతకముందు చాహల్ బౌలింగ్‌లో తొలుత రాస్ టేలర్(24), ఆ తర్వాత లాథమ్(11) పెవిలియన్‌కు చేరారు.

రెండు వికెట్లూ రిటర్న్ క్యాచ్‌ల ద్వారానే

ఈ రెండు వికెట్లూ రిటర్న్ క్యాచ్‌ల ద్వారానే వచ్చాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ 29 ఓవర్లకు గాను ఐదు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ కేన్ విలియమ్సన్(57), సాంట్నర్ (14) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

రెండు మార్పులతో బరిలోకి టీమిండియా

అనంతరం విలియమ్సన్ మాట్లాడుతూ స్పిన్నర్ సాంటర్న్‌తో పాటు ఆల్‌రౌండర్ బ్రాస్‌వెల్‌ను తీసుకున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా ఆడిన ఆఖరి వన్డే జట్టులో కెప్టెన్ కోహ్లీ రెండు మార్పులు చేశాడు. దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజాపై వేటు వేసి వారి స్థానంలో అంబటి రాయుడు, కుల్దీప్ యాదవ్‌లను తీసుకున్నాడు.

కివీస్‌కు సొంత గడ్డపై మంచి రికార్డు

కివీస్‌కు సొంత గడ్డపై మంచి రికార్డు ఉంది. దానికి తోడు ఆ జట్టు ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతుంది. బలమైన బ్యాటింగ్ లైనప్‌నకు తోడు, ప్రపంచ స్థాయి బౌలర్లతో కివీస్ సమతూకంగా ఉంది. గతంలో భారత్ ఇక్కడ 35 వన్డేలు ఆడి, 10 మ్యాచ్‌ల్లోనే గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును తిరగరాయాలని భావిస్తోంది.

1
44080
Story first published: Wednesday, January 23, 2019, 10:14 [IST]
Other articles published on Jan 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X