న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హర్మన్ సెంచరీతో విజయంతో బోణీ కొట్టిన భారత్..

ICC Women's T20 World Cup : India vs New Zealand Match Highlights | Oneindia Telugu
India vs New Zealand, ICC Womens World T20 Highlights - As It Happened

హైదరాబాద్: వెస్టిండీస్ వేదికగా శుక్రవారం ఆరంభమైన మహిళల టీ20 ప్రపంచకప్‌ని భారత్ ఘనంగా ఆరంభించింది. గ్రూప్ బిలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 34 పరుగుల తేడాతో భారత మహిళలు విజయం సాధించారు. భారత్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 160 పరుగులు చేసింది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హర్మన్ ప్రీత్

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా హర్మన్ ప్రీత్

భారత ఇన్నింగ్స్‌లో మెరుపు సెంచరీ చేసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' సొంతం చేసుకుంది. టీ20 కెరీర్‌లో తనకిదే తొలి శతకం కావడం వేశేషం. అత్యంత వేగంగా 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో మైదానంలో పరుగుల వరద పారించింది. బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన న్యూజిలాండ్ బౌలర్లను మైదానం నలువైపులా ఉతికారేసింది.

అంతకుముందు టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. కెప్టెన్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (103: 51 బంతుల్లో 7ఫోర్లు, 8సిక్సులు) మెరుపు సెంచరీకి, జెమిమా రోడ్రిగ్స్‌ (59: 45 బంతుల్లో 7ఫోర్లు) కీలక హాఫ్ సెంచరీ జత కావడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.

తొలి ఓవర్లలో మాత్రమే కట్టడి చేసిన కివీస్

తొలి ఓవర్లలో మాత్రమే కట్టడి చేసిన కివీస్

భారత్‌ ఇన్నింగ్స్ తొలి ఓవర్లలో కట్టడి చేసిన కివీస్ బౌలర్లు మధ్య ఓవర్లలో తేలిపోయారు. ఆఖరి ఓవర్ వరకు హర్మన్ చితక్కొట్టడంతో 20 ఓవర్లలో భారత్ 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. ప్రపంచ మహిళల టీ20 చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఓపెనర్లు తనియా (9), స్మృతి మంథాన (2)‌తో పాటు హేమలత (15) తక్కువ స్కోరుకే ఔటైనా.. నాలుగో వికెట్‌కి హర్మన్, రోడ్రిగ్స్ సెంచరీ భాగస్వామ్యం (134 పరుగులు) భాగస్వామ్యం నెలకొల్పారు.

 కివీస్‌కు శుభారంభం లభించినా..

కివీస్‌కు శుభారంభం లభించినా..

కివీస్ బౌలర్లలో తుహుహు 2 వికెట్లు తీసింది. వాట్కిన్, కాస్పెరెక్, సోఫీ డివైన్ తలో వికెట్ తీశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు శుభారంభం లభించినా జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్ సుజీ బేట్స్‌ 67 టాప్ స్కోరర్. కాగా మరో ఓపెనర్ అనా పీటర్‌సన్‌ 14 పరుగులు చేసింది. వరుస బంతుల్లో సోఫీ డివైన్(9), జెస్ వాట్కిన్‌లను భారత బౌలర్ పూనమ్ పెవిలియన్ బాట పట్టిందిచింది.

కివీస్ నిర్ణీత ఓవర్లలో 160/9

కివీస్ నిర్ణీత ఓవర్లలో 160/9

కివీస్ కీపర్ మార్టిన్‌ 39 (25 బంతుల్లో 8ఫోర్లు) పోరాడినా.. ఆమెకు సహకారం అందలేదు. రాధా యాదవ్ ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు కాస్పరెక్ (19), జెన్సెన్(1) లను ఔట్ చేసింది. దీంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 160 పరుగులకు పరిమితమైంది. భారత బౌలర్లలో హేమలత, పూనమ్‌ యాదవ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. రాధా యాదవ్‌ 2 వికెట్లు, అరుంధతి రెడ్డి ఒక వికెట్‌ తీశారు.

Story first published: Saturday, November 10, 2018, 9:23 [IST]
Other articles published on Nov 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X