న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2nd ODIలో భారత్ ఘన విజయం, 2-0కు పెరిగిన సిరిస్ ఆధిక్యం

India vs New Zealand, Highlights 2nd ODI: India Thrash New Zealand By 90 Runs To Take 2-0 Series Lead

హైదరాబాద్: మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవ‌ల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో వ‌న్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 325 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తాజా విజయంతో ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ క్రికెట్ జట్టు 2-0ఆధిక్యంలో నిలిచింది. బ్యాటింగ్‌లో భారత్ బ్యాట్స్‌మెన్‌ రాణించడం, ఆ తర్వాత బౌలింగ్‌లో బౌలర్లు రాణించడంతో కోహ్లీసేనకు అలవోకగా విజయాన్ని సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో కుల్పీప్ నాలుగు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్, చాహల్ చెరో రెండు వికెట్లు... కేదార్ జాదవ్, షమీ చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకముందు టాస్ గెలిచి తొలుతు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ (87), శిఖర్ ధావన్ (66), మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (48 నాటౌట్) రాణించడంతో 324 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. సిరిస్‌లో మూడో వన్డే సోమవారం ఉదయం 7.30 గంటల ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.

1
44081
325 పరుగుల లక్ష్యంతో బరిలోకి

325 పరుగుల లక్ష్యంతో బరిలోకి

టీమిండియా నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ జట్టుని భారత బౌలర్లు వరుస వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బకొట్టారు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (15), కొలిన్ మున్రో (31) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (20) జట్టుని ఆదుకునే ప్రయత్నం చేశాడు. క్రీజులోకి వ‌చ్చి వ‌రుస బౌండ‌రీల‌తో చెల‌రేగిన విలియ‌మ్స‌న్ (20)ను మ‌హ్మ‌ద్ ష‌మీ బౌల్డ్‌ చేశాడు.

వికెట్ల ముందు దొర‌క‌బుచ్చుకున్న చాహల్

వికెట్ల ముందు దొర‌క‌బుచ్చుకున్న చాహల్

అనంత‌రం మ‌రో ఓపెన‌ర్ మ‌న్రో (31)ను చాహ‌ల్ వికెట్ల ముందు దొర‌క‌బుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రాస్ టేలర్ (22)ను ధోని మెరుపు స్టంపింగ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్ వేసిన కేదార్ జాదవ్ బౌలింగ్‌లో న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్‌ టేలర్ బంతిని డిఫెన్స్ చేస్తూ కొద్దిగా ముందుకు కాలు కదిపాడు.

ధోని మెరుపు స్టంపింగ్‌

బ్యాట్‌కి అందని బంతి నేరుగా ధోని చేతుల్లోకి వెళ్లిపోగా.. స్టంపౌట్ ప్రమాదాన్ని పసిగట్టిన రాస్‌ టేలర్ వేగంగా క్రీజులో పాదం ఉంచేందుకు ప్రయత్నించాడు. అయితే, అప్పటికే బంతిని అందుకున్న ధోనీ.. క్షణాల వ్యవధిలోనే వికెట్లను గీరాటేశాడు. ఔట్ కోసం ధోనీ అప్పీల్ చేయగా.. బ్యాట్స్‌మెన్ క్రీజు వదిలి ఎక్కువ దూరం వెళ్లకపోవడం‌తో ఫీల్డ్ అంపైర్‌... థర్డ్ అంపైర్‌కి నివేదించాడు. రిప్లైని పరిశీలించిన థర్డ్ అంపైర్‌ ధోనీ బెయిల్స్‌ను పడగొట్టిన సమయంలో రాస్ టేలర్ పాదం గాల్లో ఉన్నట్లు తేలడంతో ఔట్‌గా ప్రకటించాడు.

ఎల్‌బీగా వెనుదిరిగిన లాథమ్‌

ఆ తర్వాత కుల్దీప్‌ యాదవ్‌ వేసిన మూడో బంతికి లాథమ్‌ ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరగా... అనంతరం క్రీజులోకి వచ్చిన గ్రాండ్‌హోం(3)ను కూడా కుల్దీప్‌ పెవిలియన్‌కు చేర్చాడు. హెన్రీ నికోలస్ (28) స్పిన్నర్లని ఎదుర్కోవడంలో తడబడి వికెట్ చేజార్చుకున్నాడు. చివర్లో బ్రాస్‌వెల్ (57) మాత్రం మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

చివరి వికెట్‌ తీసిన చాహల్

బ్రాస్‌వెల్ జట్టు స్కోరు 224 పరుగుల వద్ద ఔటవగానే చివరి వికెట్‌ను చాహల్ పడగొట్టడంతో 40.2 ఓవర్లలోనే 234 పరుగులకే కివీస్ కుప్పకూలిపోయింది. దీంతో టీమిండియా రెండో వన్డేలో 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజా విజయంతో ఐదు వన్డేల సిరిస్‌లో భారత్ క్రికెట్ జట్టు 2-0ఆధిక్యంలో నిలిచింది.

భారత్ 324/4

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 324 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(87), శిఖర్ ధావన్(66) అర్ధశతకాలతో చెలరేగారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(43), అంబటి రాయుడు(47), ధోనీ(48 నాటౌట్), కేదార్ జాదవ్(22 నాటౌట్) రాణించారు. టీమిండియాలో ఐదుగురు బ్యాట్స్‌మెన్ అందరూ 40కి పైగా స్కోరు సాధించడం భారత క్రికెట్లో ఇదే తొలిసారి. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, ఫర్గుసన్ చెరో రెండు వికెట్లు తీశారు.

Story first published: Saturday, January 26, 2019, 15:37 [IST]
Other articles published on Jan 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X