న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3rd T20I: టీమిండియా ఫీల్డింగ్, చాహల్ స్థానంలో కుల్దీప్ యాదవ్

 India vs New Zealand 3rd T20I: Rohit elects to chase in decider; Kuldeep replaces Chahal

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20 ప్రారంభమైంది. హామిల్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది.

India vs New Zealand: మరో ప్రపంచ రికార్డుకి చేరువలో రోహిత్‌ శర్మIndia vs New Zealand: మరో ప్రపంచ రికార్డుకి చేరువలో రోహిత్‌ శర్మ

భారత్ తుది జట్టులో మణికట్టు స్పిన్నర్ చాహల్‌ని తప్పించి.. ఎడమ చేతి వాటం స్పిన్నర్ కుల్దీప్‌ని తుది జట్టులోకి తీసుకున్నారు. మూడు టీ20ల సిరీస్‌‌లో ఇరు జట్లు ఇప్పటికే 1-1తో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఈ సిరీస్‌‌పై కన్నేసింది.

న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్ గెలవాలని భారత్ జట్టు ఉవ్విళ్లూరుతుండగా.. సొంతగడ్డపై ఇటీవల 1-4 తేడాతో వన్డే సిరీస్‌ని చేజార్చుకున్న న్యూజిలాండ్ పరువు దక్కించుకోవాలని ఆశిస్తోంది.

జట్ల వివరాలు
భారత్ జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య‌, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్

న్యూజిలాండ్‌ జట్టు:
టిమ్‌ సీఫెర్ట్‌, కొలిన్‌ మన్రో, కేన్‌ విలియమ్సన్‌, డేరిల్‌ మిచెల్‌, రాస్‌ టేలర్‌, గ్రాండ్‌హోమ్‌, మిచెల్‌ శాంట్నర్‌, స్కోట్‌ కుగ్గెలిన్‌, టిమ్‌ సౌథీ, ఇష్‌ సోధీ, బ్లెయిర్‌ టిక్నెర్‌.

Story first published: Sunday, February 10, 2019, 12:36 [IST]
Other articles published on Feb 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X