న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvIRE: తొలి టీ 20లో ఘన విజయం సాధించిన టీమిండియా

India VS Ireland Match Highlights
India vs Ireland, Ist T20I: Live: Ireland choose bowling against India

హైదరాబాద్: షార్ట్ ఫార్మాట్‌లో కచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశ్యంలో.. సమాయత్తమైన టీమిండియా.. ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా తలపడింది. ఏకపక్షంగా సాగిన పోరులో అనుకున్నట్లుగానే విజేతగా టీమిండియానే నిలిచింది. ముందుగానే ఊహించినా.. సునాయాసంగా జట్టును అప్పగించేసి ఊరకుండిపోయింది ఐర్లాండ్.

208 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్.. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ను 132/9కే పరిమితం చేసింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/21), చాహల్ (3/38) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న ఆ జట్టు ఏ దశలోనూ భారత్‌కి పోటీనివ్వలేకపోయింది. ఓపెనర్ జేమ్స్ (60: 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులు. కాసేపు క్రీజులో నిలిచి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. కుల్దీప్ అతడ్ని బోల్తా కొట్టించడంతో ఐర్లాండ్‌ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం రాత్రి 8.30 గంటలకి జరగనుంది.


అదిరిపోయే ఆరంభాన్నిచ్చిన టీమిండియా బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్ ముగింపునిచ్చే విషయంలో.. తడబడ్డారు. సెంచరీకి ముందు తడబడి వికెట్ సమర్పించుకున్నాడు రోహిత్ శర్మ(97). ఓపెనర్లు రోహిత్, ధావన్‌లు దూకుడుగా ఆడి 15వ ఓవర్లో ధావన్ వికెట్ పడటంతో పతనం మొదలైంది.


ఇన్నింగ్స్ కొనసాగిందిలా:
భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆరో స్థానంలో దిగినా డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ఓపెనర్ల రోహిత్( 97)‌, శిఖర్‌ ధావన్‌(74) ధాటిగా బ్యాటింగ్‌ చేశారు. తొలి వికెట్‌కు 16 ఓవర్లలో 160 పరుగుల భారీ భాగస్యామ్యాన్ని అందించి.. చివరి వరకూ అదే వూపును కొనసాగించలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్‌ 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐర్లాండ్‌కు 209 పరుగుల స్కోరును లక్ష్యంగా నిర్దేశించింది.

భారత్‌ బ్యాట్స్‌మెన్లలో సురేశ్‌ రైనా (10), ధోని (11), హార్దిక్‌ పాండ్య(6 నాటౌట్‌) పరుగులు చేశారు. ఐర్లాండ్‌ బౌలర్లలో పీటర్‌ చేజ్‌ 4, కెవిన్‌ ఓబ్రైన్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు. పీటర్‌ చేజ్‌ ఆఖరి ఓవర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో కేవలం7 పరుగుల మాత్రమే వచ్చాయి. ఆ ఓవర్‌లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్లు ఔటవ్వడం విశేషం.


తృటిలో సెంచరీ చేజార్చుకున్న రోహిత్‌

తొలుత శిఖర్‌ ధావన్‌తో కలిసి అద్భుత భాగస్వామ్యం(160 పరుగులు) నిర్మించినా రోహిత్‌ శర్మ ఆఖర్లో భారీషాట్‌కు యత్నించి 97 పరుగుల వద్ద పీటర్‌ బౌలింగ్‌ బౌల్డయ్యాడు. అంతకుముందు అలానే శిఖర్‌ వేగంగా ఆడే క్రమంలో 74 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

తొలి వికెట్‌గా ధావన్‌ను కోల్పోయిన టీమిండియా:

భారీ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా 15 ఓవర్లు వరకూ నిలకడగా ఆడింది. దూకుడు ఆరంభించిన ధావన్ 16వ ఓవర్ పూర్తయ్యేసరికి స్టువర్ట్ థామ్సన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 45 బంతుల్లోనే 74 పరుగులు చేసిన ధావన్, మరో ఓపెనర్ రోహిత్‌(80)తో కలిసి 160 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.


మొదటి పది ఓవర్లు పూర్తయ్యేసరికి: 94/0

ఐర్లాండ్ బౌలర్లపై టీమిండియా ఓపెనర్లు విరుచుకుపడుతున్నారు. శిఖర్ ధావన్ 26 బంతుల్లో 44, రోహిత్ శర్మ 34 బంతుల్లో 45తో రెచ్చిపోయి ఆడుతున్నారు. ఐపీఎల్ తర్వాత రోహిత్ ఆడుతోన్న తొలి టీ20 కావడంతో అతనిపై పెట్టుకున్న అంచనాలను సాకారం చేసే దిశగా ఆడుతున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కోహ్లీ సేన ఓపెనర్లతోనే భారీ స్కోరు నమోదు చేస్తోంది.


టాస్ రిపోర్టు:

ఈ నేపథ్యంలో ఐర్లాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఇది భారత్‌కు వందో టీ 20 కావడం విశేషం. పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగుతోన్న కోహ్లీ సేన విజయంపై ప్రగాడ నమ్మకంతో ఉంది.

India vs Ireland, Ist T20I: Live: Ireland choose bowling against India

ఇప్పటివరకు ఐర్లాండ్‌తో టీమిండియా మూడు వన్డేలు, ఒక టీ20 ఆడగా అన్నింట్లోనూ టీమిండియాదే విజయం. ఐర్లాండ్‌తో జరిగే ఈ సిరీస్‌ను గెలుచుకుని ఇంగ్లాండ్‌ పర్యటనను ఘనంగా ఆరంభించాలని కోహ్లీసేన చూస్తోంది. ఇంగ్లాండ్‌ సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌ సిరీస్‌ను భారత్‌ చిన్నపాటి సన్నాహకంగా భావిస్తోంది.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన టీ20ల్లో కూడా నంబర్‌వన్‌ స్థానంపై కన్నేసింది. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ల్లో కోహ్లీసేన విజయం సాధిస్తే దాయాది దేశమైన పాకిస్థాన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఐర్లాండ్‌తో సిరీస్‌ను భారత్‌ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.

Story first published: Thursday, June 28, 2018, 0:41 [IST]
Other articles published on Jun 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X