న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షోయబ్‌ను వెనక్కి నెట్టిన కోహ్లీ

India vs Ireland, 1st T20I: Virat Kohli has 3rd-most T20I runs, goes past Shoaib Malik

హైదరాబాద్: భారత్ పాక్ ఆటగాళ్ల మధ్య పోటీ లేకపోయినా అభిమానాల్లో మాత్రం ఎప్పుడూ.. నువ్వెంతా అనుకునేలా ఉంటాయి. ఈ క్రమంలోనే భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ అత్యధిక పరుగుల ఆటగాళ్ల జాబితాలో పాక్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ను వెనక్కినెట్టాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌ బాట పట్టాడు కోహ్లీ. శుక్రవారం జరిగిన రెండో టీ20లో కోహ్లీ 9 పరుగులు మాత్రమే చేశాడు. జట్టులో తక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నమోదైనప్పటికీ.. ఈ స్కోరుతోనే షోయబ్ మాలిక్ ను దాటేశాడు కోహ్లీ.

దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు పాక్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ మూడో స్థానంలో ఉన్నాడు. ఐర్లాండ్‌ పర్యటన ప్రారంభానికి ముందు కోహ్లీ టీ20ల్లో 2 వేల పరుగుల క్లబ్‌లో చేరేందుకు 17 పరుగులు వెనుక ఉన్నాడు. కానీ, ఇప్పుడు కేవలం 8 పరుగుల వెనుకంజలో మాత్రమే ఉన్నాడు. ఇప్పటి వరకు ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే టీ20ల్లో 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.

వారే మార్టిన్‌ గప్తిల్‌ (2,271), బ్రెండన్‌ మెక్‌కలమ్‌(2,140). ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ(1,992), షోయబ్‌ మాలిక్‌ (1,989)ఉన్నారు. ఐర్లాండ్‌ పర్యటనలోనే కోహ్లీ 2వేల క్లబ్‌లో చేరతాడని అభిమానులు ఆశించారు. కానీ, ఈ పర్యటనలో కోహ్లీ పూర్తిగా విఫలమైయ్యాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి కోహ్లీ ఇంగ్లాండ్‌ పర్యటనలో ఎలా రాణిస్తాడనే దానిపైనే ఉంది.

జులై 3 నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఆ తర్వాత వన్డే, టెస్టు సిరీస్‌లు జరగనున్నాయి. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌ గడ్డపై భారత్‌ టెస్టు సిరీస్‌ గెలవలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన కోహ్లీ సేన తప్పక సిరీస్‌ గెలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సీనియర్ క్రికెటర్లు సైతం జట్టు కూర్పుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Saturday, June 30, 2018, 15:09 [IST]
Other articles published on Jun 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X