న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఇక.. మీ కోహ్లీ పని అయిపోయింది'

India vs England: Watch- England fans mock Indian team, sing where is your Virat Kohli gone

హైదరాబాద్: ఆంగ్లేయులు భారత జట్టు క్రికెటర్లపై ఆందోళనకు దిగబోయారు. భద్రతా బలగాలపై అడ్డుకోగా కాస్తలో పెను అల్లరి మూకలు వెనుదిరిగాయి. తొలి టెస్టు అనంతరం టీమిండియాకు ఈ పరాభవం ఎదురైంది. 'ఎక్కడ మీ విరాట్ కోహ్లీ? మాకు జేమ్స్‌ అండర్సన్‌ ఉన్నాడు.. ఎక్కడ మీ కెప్టెన్‌?' అంటూ ఇంగ్లాండ్‌ అభిమానులు మైదానం వెలుపల ఎగతాళి చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఐదు టెస్టు మ్యాచ్‌ల సందర్భంగా భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య తొలి టెస్టు ముగిసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్‌ అనంతరం టీమిండియా ఆటగాళ్లు మైదానం నుంచి తిరిగి హోటల్‌కు చేరుకునేందుకు బస్సు ఎక్కారు. ఆ సమయంలో ఇంగ్లాండ్‌ అభిమానులు బస్సును అడ్డుకున్నారు.

అంతేకాదు, కోహ్లీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్సును చుట్టుముట్టారు. 'ఎక్కడ మీ విరాట్‌ కోహ్లీ? మాకు అండర్సన్‌ ఉన్నాడు. ఇక కోహ్లీ పని అయిపోయినట్లే..' అంటూ అంటూ ఎద్దేవా చేస్తూ సంబరాలు చేసుకున్నారు. వెంటనే భద్రతా సిబ్బంది కలగజేసుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేసి బస్సును ముందుకు పంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లో కలిపి కోహ్లీ 200 పరుగులు చేశాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ నంబర్‌ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రెండో స్థానంలో ఉండగా అతనికంటే ముందు స్టీవ్ స్మిత్ ఉన్నాడు. బాల్ టాంపరింగ్ కారణంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి ఏడాది పాటు నిషేదానికి గురైయ్యాడు.

Story first published: Monday, August 6, 2018, 12:12 [IST]
Other articles published on Aug 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X