న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6000 పరుగులు: కోహ్లీకి హోటల్ సిబ్బంది సర్‌ప్రైజ్‌ (ట్వీట్)

By Nageshwara Rao
India vs England 4 Test Highlights: Virat Kohli Gets Surprise Gift From Hotel People
India vs England: Virat Kohli touched by hotel staffs sweet gesture on reaching 6000-run milestone

హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో 6వేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సౌతాంప్టన్‌లో టీమిండియా బస చేస్తోన్న హోటల్ సిబ్బంది కోహ్లీకి చిన్నపాటి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆండర్సన్ బౌలింగ్‌లో ఫోర్‌ కొట్టిన కోహ్లీ.. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 6,000 పరుగులు చేసిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్‌ (120 ఇన్నింగ్స్‌ల) రికార్డును సైతం బద్దలు కొట్టాడు.

1
42377
 6 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న కోహ్లీ

6 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న కోహ్లీ

117 ఇన్నింగ్స్‌లలోనే 6 వేల పరుగుల మైలు రాయిని చేరుకున్న సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో ముందుండగా, కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. 120 ఇన్నింగ్స్‌లలో 6 వేల పరుగులు చేసిన టెండూల్కర్ మూడో స్థానానికి దిగజారాడు. ఆ తర్వాతి స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్ (121), రాహుల్ ద్రవిడ్ (125) ఉన్నారు.

హోటల్‌కు చేరుకున్న టీమిండియా

హోటల్‌కు చేరుకున్న టీమిండియా

అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 6వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడి రికార్డు ఆస్ట్రేలియా ఆల్‌టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ పేరున ఉంది. బ్రాడ్‌మన్ కేవలం 68 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. రెండో రోజు శుక్రవారం ఆట ముగించుకుని టీమిండియా ఆటగాళ్లు యథావిధిగా తాము బస చేసే హోటల్‌కు వచ్చారు.

కోహ్లీకి హోటల్‌ సిబ్బంది చిన్న సర్‌ప్రైజ్‌

టెస్టుల్లో 6వేల పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీకి ఆ హోటల్‌ సిబ్బంది చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఒక ప్లేటులో ఆరు వేల పరుగుల అంకె వేసి నాలుగు స్ట్రాబెర్రిస్‌తో పాటు రెండు పేస్ట్రీలు ఉంచి అందంగా అలంకరించి కోహ్లీకి అందించారు. దీనికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌ ద్వారా అభిమానులతో కోహ్లీ పంచుకున్నాడు.

ఈ కానుక ఎంతో నచ్చింది

ఈ కానుక ఎంతో నచ్చింది

అంతేకాదు "సౌతాంప్టన్‌లోని హార్బర్‌ హోటల్‌ సిబ్బంది అందించిన ఈ కానుక ఎంతో నచ్చింది" అని కోహ్లీ కామెంట్ కూడా పెట్టాడు. ఇప్పటివరకూ 70 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 119 ఇన్నింగ్స్‌ల్లో 54.61 సగటుతో 6వేల పైచిలుకు పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

21 పరుగుల ఆధిక్యంలో భారత్‌

21 పరుగుల ఆధిక్యంలో భారత్‌

2017లో శ్రీలంకతో ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో అత్యధికంగా 243 పరుగులు చేశాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులు చేసింది. రెండో రోజైన శుక్రవారం ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్‌ కంటే ఇంకా 21 పరుగుల ఆధిక్యంలో భారత్‌ కొనసాగుతోంది.

Story first published: Saturday, September 1, 2018, 12:23 [IST]
Other articles published on Sep 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X