న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నిశ్శబ్దంగా ఉండండి.. మేము ప్రాక్టీస్ చేస్తున్నాం'

India vs England: In the nets, skipper Virat Kohli sets batting template

హైదరాబాద్: 'మీరు కాస్త నిశ్శబ్దంగా ఉండగలరా?' టీమిండియా నెట్ ప్రాక్టీసు చేస్తుండగా మురళీ విజయ్ నుంచి వచ్చిన మాటలివి. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న భారత బ్యాట్స్‌మెన్‌ను వీక్షించేందుకు ఆవరణ బయట వేచి ఉన్న అభిమానులనుద్దేశించి అన్నాడు. ఇప్పటికే తొలి టెస్టు వైఫల్యం తర్వాత రెండో టెస్టు లో కచ్చితంగా విజయం సాధించాల్సిందేననే నేపథ్యంలో తీవ్రమైన కసరత్తులు చేస్తుంది.

ఇప్పటికే అండర్సన్‌తో సహా మిగిలిన బౌలర్లు టీమిండియాను చిత్తు చేస్తాం. కోహ్లీని అవుట్ చేస్తామంటూ ప్రగల్బాలు పలకడంతో వారి ఎత్తుల్ని చిత్తు చేయాలని టీమిండియా కెప్టెన్ ప్రాక్టీసుని ముమ్మరం చేశాడు. విరాట్ ఆజ్ఞలు తూచా తప్పకుండా పాటిస్తున్న అజింకా రహానె, చతేశ్వర్ పూజారాలు స్వింగ్ ఎదుర్కొనేందుకు ప్రాక్టీసు చేస్తున్నారు.

{cricket_250_42375}

1
42375

వీరితో పాటుగా టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఫేసర్లకు అరుస్తూ సూచనలిస్తున్నాడు. లార్డ్స్ స్టేడియంలో భారత్ అదరగొట్టాలంటే బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు కూడా పటిష్టంగా ఉండాలనే నేపథ్యంలో
బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఫేసర్లకు విలువైన సూచనలిస్తూ.. బ్యాట్స్‌మెన్‌ను ఎలా తికమకపెట్టాలా అనే కోణంలో శిక్షణ కొనసాగిస్తున్నాడు.

కెప్టెన్ కోహ్లీ విషయానికొస్తే తొలి టెస్టులో తానొక్కడే 200పరుగులు బాదేసి.. రెండో టెస్టులోనూ అదే స్థాయిలో రాణించగలననే ధీమాని వ్యక్తం చేస్తున్నాడు. ఈ మధ్యనే కోహ్లీ తర్వాత జట్టులో కీలకంగా మారిన హార్దిక్ పాండ్యాపై కోచ్ ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు కనిపిస్తోంది. ఆల్ రౌండర్‌గా మంచి భవిష్యత్ ఉందంటూ పలువురు సీనియర్లు ఇప్పటికే అతనికి సూచించడంతో భరత్ అరుణ్.. అతనికి మెలకువలు నేర్పిస్తున్నారు.

Story first published: Wednesday, August 8, 2018, 13:38 [IST]
Other articles published on Aug 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X