న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్.. స్పెషల్ ప్లేయర్, స్పెషల్ సెంచరీ..!!

India vs England: KL Rahul, Kuldeep Yadav score Perfect Ten in report card; Joe Root, Shikhar Dhawan flop

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు కుల్‌దీప్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌. ఈ మ్యాచ్‌లో మణికట్టు మాంత్రికుడు కుల్‌దీప్‌ ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. మరోపక్క బ్యాటింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ సెంచరీతో చెలరేగి ఆడాడు. మంగళవారం ముగిసన ఈ మ్యాచ్ గురించి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంతేకాదు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సైతం వీరిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

1
42368

ఏం కొట్టావ్. గురూ.. ఇరగదీసేశావ్

'ఏం కొట్టావ్. గురూ.. ఇరగదీసేశావ్' అని విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్‌కు స్పందించిన రాహుల్ థాంక్యూ బాస్ అంటూ బదులిచ్చాడు.

ప్రదర్శన ఆకట్టుకుంది.

కేఎల్‌ రాహుల్‌ ప్రదర్శన ఆకట్టుకుంది. ఎంతో సులువుగా బ్యాటింగ్‌ చేసినట్లు అనిపించింది. పరిస్థితులను అర్థం చేసుకుంటూ చాలా బాగా ఆడాడు.

అన్ని ఫార్మాట్లలో అతన్ని తీసుకోండి

భారత జట్టులో రాహుల్‌ను చూడటం సంతోషంగా ఉంది. అన్ని ఫార్మాట్లలో అతన్ని తీసుకోండి. సూపర్బ్‌ ఇన్నింగ్స్‌

సగం విజయం సాధించినట్లే

మంచి ఆరంభం దక్కితే సగం విజయం సాధించినట్లే. కుల్‌దీప్‌, రాహుల్‌ అద్భుత ప్రదర్శన చేశారు.

కుల్‌దీప్‌ మంచి బౌలింగ్‌

కుల్‌దీప్‌ బాగా బౌలింగ్‌ చేశావు. 5 వికెట్లు దక్కించుకున్నావు. అలాగే రాహుల్‌ నువ్వు కూడా బాగా ఆడావు. 100 పరుగులతో నాటౌట్‌గా నిలిచావు. మీ ఇద్దరికీ నా శుభాకాంక్షలు.

అతడి ఇన్నింగ్స్‌ కంటికి ఎంతో ఇంపుగా

'కేఎల్‌ రాహుల్‌ నుంచి బ్రిలియంట్‌ ఇన్నింగ్స్‌. కంగ్రాట్స్‌ టీమిండియా'... సాహా, 'కేఎల్‌ రాహుల్‌ అసాధారణ ప్రతిభ కనబరిచాడు. అతడి ఇన్నింగ్స్‌ కంటికి ఎంతో ఇంపుగా ఉంది. ఆల్‌ క్లాస్‌'...మొహమ్మద్‌ కైఫ్‌. 'వెరీ స్పెషల్‌ ప్లేయర్‌ రాహుల్‌ నుంచి స్పెషల్‌ సెంచరీ. కుల్‌దీప్‌ కూడా చాలా బాగా ఆడాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో టీమిండియాకు గొప్ప ఆరంభం దక్కింది. మరిన్ని విజయాలు చూద్దాం'.. ఇర్ఫాన్‌ పఠాన్‌

భారత్‌కు భలే ఆరంభం

'ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో భారత్‌కు భలే ఆరంభం దక్కింది. కుల్‌దీప్‌ నుంచి మంచి బౌలింగ్‌ స్పెల్‌, ఆ తర్వాత రాహుల్‌ నుంచి సెంచరీ. మంచి ఆరంభం'.. వీవీఎస్‌ లక్ష్మణ్‌, 'జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసింది. ముందుగా కుల్‌దీప్‌.. ఆ తర్వాత కేఎల్‌ రాహుల్‌. సుదీర్ఘ ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత్‌కు మంచి ఆరంభం;...ఆర్పీ సింగ్‌

భారత్‌ తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రెండు సెంచరీలు నమోదు చేసిన రెండో ఆటగాడిగా కేఎల్‌ రాహుల్‌ నిలిచాడు. రోహిత్‌ శర్మ మాత్రమే ఇప్పటి వరకు రెండు సెంచరీలు సాధించాడు. తాజా సెంచరీతో కేఎల్‌ రాహుల్‌... రోహిత్‌ సరసన నిలిచాడు.

Story first published: Tuesday, July 17, 2018, 16:53 [IST]
Other articles published on Jul 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X