న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'స్పెషల్‌గా ఎలాంటి జెర్సీని ధరించలేదు.. మిస్‌ కమ్యూనికేషన్‌‌‌ వల్ల అలా జరిగింది'

India vs England: Jonny Bairstow has opened up about his different jersey in the first ODI

పూణే: మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో వేసుకున్న జెర్సీ అందరికంటే బిన్నంగా ఉంది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అందరూ వేసుకున్న జెర్సీపై పేరు, నెంబర్లు బ్లూ కలర్‌లో ఉండగా.. బెయిర్‌స్టో వేసుకున్న జెర్సీపై మాత్రం అతని పేరు, నెంబర్‌ తెలుపు రంగులో ఉంది. టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు బెయిర్‌స్టో వేసుకున్న జెర్సీలను ధరించింది. అదే జెర్సీని బెయిర్‌స్టో తొలి వన్డేలో వేసుకున్నాడు. అయితే అందుకు గల కారణాన్ని అతడు వివరించాడు.

అరంగేట్రంలో అదరగొట్టిన సర్‌ప్రైజ్ స్టార్ ప్రసిధ్ కృష్ణ.. మేడిన్ ఆస్ట్రేలియా!అరంగేట్రంలో అదరగొట్టిన సర్‌ప్రైజ్ స్టార్ ప్రసిధ్ కృష్ణ.. మేడిన్ ఆస్ట్రేలియా!

చిన్న మిస్‌ కమ్మునికేషన్‌:

చిన్న మిస్‌ కమ్మునికేషన్‌:

వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జానీ బెయిర్‌స్టో మాట్లాడుతూ తను వేసుకున్న జెర్సీపై స్పందించాడు. 'తొలి వన్డేలో నేను వేసుకున్న జెర్సీ నా సహచరులు వేసుకున్న దాని కంటే కాస్త భిన్నంగా ఉంది. అయితే చిన్న మిస్‌ కమ్మునికేషన్‌ వల్ల ఈ పొరపాటు జరిగింది. టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు మేం వేసుకోబోయే జెర్సీలు ఇంగ్లండ్‌ నుంచి వచ్చాయి. అన్ని ప్యాక్‌ చేసి ఉండడంతో.. మ్యాచ్​ సమయానికి ప్యాక్‌ విప్పి జెర్సీ వేసుకున్నా. కానీ పొరపాటున టీ20 జెర్సీకి ఉపయోగించిన కలర్‌నే నా వన్డే జెర్సీకి వాడినట్లున్నారు. నేను స్పెషల్‌గా ఎలాంటి జెర్సీని ధరించలేదు. అసలు విషయం ఇది' అని తెలిపాడు.

బెయిర్‌స్టో విధ్వంసం:

బెయిర్‌స్టో విధ్వంసం:

ఇక తొలి వన్డేలో భారత్ గెలిచినా.. జానీ బెయిర్‌స్టో విధ్వంసం ఓ దశలో కోహ్లీసేనను కంగారుపెట్టింది. కేవలం 66 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 94 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అతని దాటికి ఇంగ్లండ్‌ ఒక దశలో వికెట్లేమి కోల్పోకుండా 135 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ అనూహ్యంగా బెయిర్‌స్టో అవుట్‌ కావడం.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ ఎవరు రాణించకపోవడంతో ఇంగ్లండ్‌ 66 పరుగులతో పరాజయం చవిచూసింది. ఇక ఇరుజట్ల మధ్య రెండో వన్డే పుణే వేదికగా శుక్రవారం జరగనుంది.

తప్పుపట్టడం లేదు:

తప్పుపట్టడం లేదు:

తొలి వన్డేలో ఓటమికి జట్టును తప్పుపట్టడం లేదని ఇంగ్లండ్ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. 'మాది ప్రమాదకరమైన జట్టని నా నమ్మకం. మ్యాచులో మేం బాగా ఆడాం. అలాగే బ్యాటింగ్‌ కొనసాగించి ఉంటే లక్ష్యాన్ని త్వరగా ఛేదించేవాళ్లం. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో భారత్ ఒకటి. చాలాసార్లు వారితో కఠిన సవాళ్లే ఎదురవుతాయి. అయితే నేను మా జట్టును తప్పుపట్టను. టీమిండియా చక్కగా బౌలింగ్‌ చేసింది. మేం పొరపాట్లు చేశాం. మధ్యలో భాగస్వామ్యాలు నెలకొల్పలేదు. మేం నంబర్‌వన్‌గా ఉండటమే ముఖ్యం కాదు. నాణ్యమైన జట్టును నిర్మించుకోవడం మా లక్ష్యం' అని మోర్గాన్‌ అన్నాడు.

Story first published: Thursday, March 25, 2021, 13:43 [IST]
Other articles published on Mar 25, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X