న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: టీ20 సిరీస్ ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. స్టార్ పేసర్ ఔట్! ఐపీఎల్ 2021కు డౌటే!

India vs England: Jofra Archer doubt for T20I series with elbow injury

అహ్మదాబాద్: ఇటీవల టీమిండియాతో ముగిసిన టెస్ట్ సిరీస్‌ను 3-1 కోల్పోయిన ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగలనుంది. శుక్రవారం నుంచి మొతేరా వేదికగా ఇరు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోప్రా ఆర్చర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశం ఉంది. మోచేతి గాయం కారణంగా ఆర్చర్ టీ20లకు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఆరంభం నుంచి ఆర్చర్‌ని మోచేతి గాయం వేధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌ని 1-3తో చేజార్చుకున్న ఇంగ్లండ్ టీమ్‌కి టీ20 సిరీస్‌లో ఆర్చర్ లేకపోవడం ఎదురుదెబ్బే అని చెప్పాలి.

India vs England: నా పేరు చెప్పుకొని.. హాయిగా డ్రింక్‌ తాగండి: నెటిజన్లకు రవిశాస్త్రి పంచ్India vs England: నా పేరు చెప్పుకొని.. హాయిగా డ్రింక్‌ తాగండి: నెటిజన్లకు రవిశాస్త్రి పంచ్

మోచేతి గాయంతో:

మోచేతి గాయంతో:

టీమిండియాతో అహ్మదాబాద్ వేదికగా గత శనివారం ముగిసిన చివరిదైన నాలుగో టెస్టుకీ మోచేతి గాయంతోనే జోప్రా ఆర్చర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రెండో టెస్ట్ కూడా ఆడలేదు. గాయం ఇంకా తగ్గకపోవడంతో టీ20 సిరీస్‌లోనూ అతను ఆడటంపై పలు సందేహాలు నెలకొన్నాయి. గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే.. ఐపీఎల్ 2021లో కూడా ఆర్చర్ ఆడడం అనుమానమే. రాజస్థాన్ జట్టుకు ఆర్చర్ ఆడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లండ్ టీమ్ మెడికల్ స్టాఫ్ ఆర్చర్ గాయాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చీఫ్ కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ ఓ ప్రకటనలో తెలిపాడు. త్వరలోనే ఆర్చర్ గాయం విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు.

సర్జరీ వాయిదా:

సర్జరీ వాయిదా:

నిజానికి జోప్రా ఆర్చర్ తన మోచేతి గాయానికి సర్జరీ చేయించుకోవాలని ఆశించాడు. కానీ ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరగనుండగా.. ఆ తర్వాత అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఆ వెంటనే ఇంగ్లీష్ జట్టుకు కీలకమైన యాషెస్ సిరీస్ జరగనుండటంతో సర్జరీని వాయిదా వేసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే.. ఓ ఫాస్ట్ బౌలర్ సర్జరీ తర్వాత కొన్ని నెలలు ఆటకి అతను దూరంగా ఉండాల్సి ఉంటుంది. మార్చి 12 నుంచి 20 వరకూ ఐదు టీ20లు, మార్చి 26 నుంచి మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌తో ఇంగ్లండ్ తలపడనుంది.

బౌలింగ్‌తోనే కాదు:

బౌలింగ్‌తోనే కాదు:

ఇంగ్లండ్ స్టార్ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తన బౌలింగ్‌తోనే కాదు ట్వీట్ల ద్వారా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆర్చర్‌ ఎప్పుడో చెప్పింది వాస్తవ రూపం దాల్చడంతో అతని ట్వీట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రధానంగా క్రికెట్‌లో ఏది జరిగినా.. ఆర్చర్‌ ముందే చెప్పాడనే ట్వీట్‌ మన ముందు నిలుస్తూ ఉంటుంది. అయితే అందులో వాస్తవం ఎంతనేది మాత్రం ఆర్చర్‌కే తెలియాలి. నిజంగానే ఆర్చర్‌ వద్ద టైమ్‌ మిషీన్‌ ఉందా అని ప్రశ్న కూడా అభిమానులు మనసుల్లో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. గతేడాది చివరలో అతనికి సంబందించిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆర్చర్ ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు, 17 వన్డేలు, 7 టీ20లు ఆడాడు.

Story first published: Monday, March 8, 2021, 13:20 [IST]
Other articles published on Mar 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X