న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England: 66 ఏళ్ల భారత రికార్డును బ్రేక్ చేసిన ఇంగ్లండ్!

India vs England: England break 66-year-old record in Test cricket

చెన్నై: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఒక ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రా రన్‌ ఇవ్వకుండా అత్యధిక స్కోర్‌ 329 అందించిన తొలి జట్టుగా నిలిచింది. భారత్‌ను ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు కట్టడి చేసిన ఇంగ్లండ్.. ఈ ఇన్నింగ్స్‌ మొత్తంలో ఒక్క ఎక్స్‌ట్రా రన్ కూడా ఇవ్వలేదు. దాంతో భారత్‌ పేరిట ఉన్న 66 ఏళ్ల రికార్డును ఇంగ్లండ్‌ అధిగమించింది. 66 ఏళ్ల క్రితం(1955) లాహోర్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క ఎక్స్‌ట్రా ఇవ్వకుండా 328 పరుగులిచ్చింది. ఇప్పుడదే రికార్డును ఇంగ్లండ్‌ బద్దలుకొట్టింది.

రిషభ్ పంత్ మెరిసినా..

రిషభ్ పంత్ మెరిసినా..

300/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో భారత్ రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 7.5 ఓవర్లలో మరో 29 పరుగులు జోడించి ఫస్ట్ ఇన్నింగ్స్‌‌ను ముగించింది. ఓ వైపు డాషింగ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్(77 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్స్‌లతో 58 నాటౌట్) ధాటిగా ఆడినా.. మరోవైపు ఓలిస్టోన్(3/47) దెబ్బకు టెయిలండర్లు నిలబడలేకపోయారు. దాంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 329 పరుగులుకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ(4/128) నాలుగు వికెట్లు తీయగా.. ఓలీ స్టోన్ మూడు, జాక్ లీచ్(2/78) రెండు వికెట్లు తీశారు. జోరూట్‌కు ఓ వికెట్ దక్కింది. ఇక ఇంగ్లండ్ బౌలర్లు ఒక్క ఎక్స్‌ట్రా కూడా ఇవ్వలేదు. కాగా భారత ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్లయ్యారు.

కష్టాల్లో ఇంగ్లండ్..

కష్టాల్లో ఇంగ్లండ్..

అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. భారత్ స్పిన్ ధాటికి విలవిలలాడుతోంది. 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ రోరీ బర్న్స్‌(0)ను పెవిలియన్ చేర్చి ఇషాంత్ శర్మ శుభారంభం అందించగా.. మరో ఓపెనర్ డామ్ సిబ్లీ(16)ని పెవిలియన్ చేర్చి అశ్విన్ దెబ్బతీశాడు. అశ్విన్ వేసిన 8 ఓవర్ రెండో బంతి సిబ్లీ బ్యాట్‌ను తాకుతూ షార్ట్ లెగ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ చేతిలో పడగా.. అంపైర్ నాటౌటిచ్చాడు. దాంతో భారత్ రివ్యూతో ఫలితం రాబట్టింది.

అదరగొట్టిన అక్షర్

అదరగొట్టిన అక్షర్

కొద్ది సేపటికే ఇంగ్లండ్ కెప్టెన్, ఫస్ట్ టెస్ట్ హీరో జోరూట్‌(6)ను అరంగేట్ర ఆటగాడు అక్షర్ ఔట్ చేశాడు. సూపర్ బౌలింగ్‌తో ఈ ఇన్‌ఫార్మ్ బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. స్వీప్ షాట్లు అలవోకగా ఆడే జోరూట్‌ను ఆ ఉచ్చులోనే బిగించాడు. 10 ఓవర్‌లో అతను వేసిన డ్రై‌ లెంగ్త్ బాల్‌ను స్వీప్ షాట్ ఆడిన జోరూట్(6).. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న అశ్విన్‌కు చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్, డాన్ లారెన్స్ నిదానంగా ఆడే ప్రయత్నం చేశారు. కానీ చాకచక్యంగా బౌలింగ్ చేసిన అశ్విన్ తన వ్యూహంతో డాన్ లారెన్స్‌(9)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ 39/4తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

స్టోక్స్ బౌల్డ్..

స్టోక్స్ బౌల్డ్..

లంచ్ విరామం అనంతరం అశ్విన్ తనదైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌పై మరింత ఒత్తిడి పెంచాడు. ఓ దశలో అతని బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు తీవ్రంగా కష్టాపడ్డాడు. పదే పదే బంతులను గాల్లోకి లేపుతూ ఔటయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిన స్టోక్స్.. అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఫోక్స్ క్రీజులోకి రాగా.. ఓలిపోప్(21) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం 38 ఓవర్లలో 5 వికెట్లకు ఇంగ్లండ్ 86 పరుగులు చేసింది.

Story first published: Sunday, February 14, 2021, 13:32 [IST]
Other articles published on Feb 14, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X