న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంతితోనూ అదరగొట్టిన విహారీ.. వరుస బంతుల్లో 2 వికెట్లు

 India vs England, 5th Test: Debutant Hanuma Vihari leaves indelible mark in Alastair Cooks magnificent career

హైదరాబాద్: ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య స్థానంలో జట్టులోకి వచ్చిన తెలుగు కుర్రాడు హనుమ విహారి అనూహ్యంగా బంతితో మాయాజాలం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన విహారి.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో తన ఆఫ్‌ స్పిన్‌తో మూడు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తొలి రెండు వికెట్లూ సెంచరీ వీరులు అలిస్టర్‌ కుక్‌, కెప్టెన్‌ జో రూట్‌వి కావడం విశేషం.

 వరుస బంతుల్లో వికెట్లను సాధించడం:

వరుస బంతుల్లో వికెట్లను సాధించడం:

అంతేకాదు ఈ రెండు వికెట్లను వరుస బంతుల్లో సాధించడం. విహారి బంతిని స్వీప్‌ చేసే ప్రయత్నంలో రూట్‌ ఔట్‌ అయితే.. బంతిని కట్‌ చేసే ప్రయత్నంలో కుక్‌.. వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌కు చిక్కాడు. అతను హ్యాట్రిక్‌ సాధిస్తాడా అనిపించినా.. బెయిర్‌స్టో ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు.

లక్ష్య ఛేదనలో కుప్పకూలిన భారత టాపార్డర్‌ :

లక్ష్య ఛేదనలో కుప్పకూలిన భారత టాపార్డర్‌ :

ఆ తర్వాత లక్ష్య ఛేదనలో భారత టాపార్డర్‌ కుప్పకూలింది. అండర్సన్‌ పదునైన ఇన్‌ స్వింగర్లకు ధావన్, పుజారా వద్ద సమాధానమే లేకపోయింది. దీంతో ఒక్క పరుగుకే భారత్‌ రెండు వికెట్లు నష్టపోయింది. అతి పెద్ద దెబ్బ మాత్రం కోహ్లి ఔటే. సిరీస్‌ మొత్తం భారత బ్యాటింగ్‌ భారం మోసి, 500పైగా పరుగులు సాధించిన కెప్టెన్‌... అత్యంత కీలక సందర్భంలో తొలి బంతికే వెనుదిరిగాడు.

అత్యధిక క్యాచ్‌ల భారత ఫీల్డర్‌గా లోకేశ్‌ రాహుల్‌ :

అత్యధిక క్యాచ్‌ల భారత ఫీల్డర్‌గా లోకేశ్‌ రాహుల్‌ :

కోహ్లీ.. దూరంగా వెళ్తున్న బ్రాడ్‌ స్వింగింగ్‌ డెలివరీని వెంటాడి మూల్యం చెల్లించుకున్నాడు. రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పో యిన స్థితిలో రాహుల్, రహానే ఆదుకున్నారు. ఒకే సిరీస్‌లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న భారత ఫీల్డర్‌గా లోకేశ్‌ రాహుల్‌ (14) గుర్తింపు పొందాడు. రాహుల్‌ ద్రవిడ్‌ (13; 2004లో ఆస్ట్రేలియాపై) పేరిట ఉన్న రికార్డును లోకేశ్‌ రాహుల్‌ అధిగమించాడు.

రెండో భారతీయ బౌలర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో బౌలర్‌గా:

రెండో భారతీయ బౌలర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో బౌలర్‌గా:

సెంచరీలు చేసిన ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ను అరంగేట్రం టెస్టులోనే ఔట్‌ చేసిన రెండో భారతీయ బౌలర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో బౌలర్‌గా హనుమ విహారి నిలిచాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా (2014లో ఆస్ట్రేలియాపై) కరణ్‌ శర్మ గుర్తింపు పొందాడు.

Story first published: Tuesday, September 11, 2018, 10:40 [IST]
Other articles published on Sep 11, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X