న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు: రెండో వన్డేలో భారత్ ఓటమి

By Nageshwara Rao
India

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్ 86 పరుగుల తేడాతో టీమిండియాను మట్టికరిపించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ సరిగ్గా 50 ఓవర్లలో 236 పరుగులే చేసి ఆలౌటైంది. కోహ్లి (56 బంతుల్లో 45; 2 ఫోర్లు), రైనా (63 బంతుల్లో 46; 1 ఫోర్‌) ఫరవాలేదనిపించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ప్లంకెట్‌కు 4 వికెట్లు దక్కాయి. రూట్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు లభించింది.

సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే చివరి వన్డే 17న లీడ్స్‌లో జరగనుంది.


భారత్ బ్యాటింగ్ తీరు సాగిందిలా:
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (15), ధావన్‌ (36) తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. 8 ఓవర్ల దాకా బాగానే ఆడిన ఓపెనర్లిద్దరూ వరుస ఓవర్లలో నిష్క్రమించడం ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది. మార్క్‌వుడ్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొమ్మిదో ఓవర్లో రోహిత్‌ భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో క్లీన్‌బౌల్డయ్యాడు.

దీంతో 49 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. విల్లే వేసిన మరుసటి ఓవర్లోనే ధావన్‌ కూడా పెవిలియన్‌ బాట పట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో లోకేశ్‌ రాహుల్‌ ఖాతా తెరువకుండానే వెనుదిరిగాడు. ప్లంకెట్‌ బౌలింగ్‌లో బట్లర్‌ క్యాచ్‌ పట్టడంతో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. జట్టు స్కోరు 60 పరుగుల వద్ద రాహుల్‌ ఔటయ్యాడు.

దీంతో కేవలం 11 పరుగుల వ్యవధిలో ఈ మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లీ, రైనాలు దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్‌కు 80 పరుగులు జతయ్యాక కోహ్లీ... మొయిన్‌ అలీ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంరం క్రీజులోకి ధోని వచ్చాడు. 31వ ఓవర్లో జట్టు స్కోరు 150 పరుగులకు చేరింది.

ఆ తర్వాత రైనాను రషీద్‌ బౌల్డ్‌ చేశాడు. 154 పరుగుల వద్ద సగం వికెట్లు కోల్పోయింది. 21 పరుగులు చేసిన హార్దిక్‌ పాండ్యాను ప్లంకెట్‌ ఔట్‌ చేయగా, ఉమేశ్‌యాదవ్‌ (0) రషీద్‌ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. ధోని (59 బంతుల్లో 37; 2 ఫోర్లు ) చివరి వరుస బ్యాట్స్‌మెన్‌తో కలిసి జట్టు స్కోరును 200 పరుగులు దాటించాడు.

ఈ క్రమంలో ధోని వన్డేల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ధోని ఔటయ్యాక కుల్దీప్‌ (8 నాటౌట్‌), చాహల్‌ (12) కాసేపు ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను ఎదుర్కొన్నారు. చాహల్‌ ఆఖరి ఓవర్‌ ఆఖరి బంతికి ఔట్‌ కావడంతో భారత్‌ 236 పరుగుల వద్ద ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో రషీద్, విల్లే చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు.


జో రూట్ సెంచరీ, భారత్ టార్గెట్ 323

లార్డ్స్‌ క్రికెట్ గ్రౌండ్‌లో భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆతిథ్య ఇంగ్లాండ్‌ భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. జో రూట్‌(113నాటౌట్‌) అజేయ సెంచరీతో రాణించగా... కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(53), చివర్లో ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ విల్లే(50) దూకుడుగా ఆడటంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ ఓపెనర్లు జాసన్‌ రాయ్‌, బెయిర్‌ స్టోలు ఆరంభం నుంచే దాటిగా ఆడటంతో స్కోర్‌ 10 ఓవర్లలోనే 68 పరుగులకు చేరింది. వీరిద్దరూ మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. అయితే 11ఓవర్‌లో బంతి అందుకున్న కుల్‌దీప్‌ యాదవ్‌ వీరి జోరుకు అడ్డుకట్ట వేశాడు.

ఆ ఓవర్‌లో రెండో బంతికే బెయిర్‌స్టో(38) క్లీన్‌బౌల్డ్‌ చేసి ఇంగ్లాండ్‌ పతనాన్ని ఆరంభించాడు. ఆ తర్వాత 15ఓవర్‌ తొలి బంతికి మరో ఓపెనర్‌ జేసన్‌రాయ్‌(40)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. అనంతరం కెప్టెన్‌ మోర్గాన్‌తో జత కలిసిన రూట్‌ నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డును ముందుండి నడిపించాడు.

ఈ క్రమంలోనే కుల్దీప్ వేసిన 30.1 బంతికి రెండు పరుగులు రాబట్టి మోర్గాన్‌ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత అదే ఓవర్‌లో మూడో బంతిని షాట్‌ ఆడిన మోర్గాన్‌(53) ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఇంగ్లండ్‌ 189 పరుగుల వద్ద మోర్గాన్‌ వికెట్‌ను కోల్పోయింది.

1
42369

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన బెన్‌ స్టోక్స్(5)‌, జాస్‌ బట్లర్(4), మొయిన్‌ ఆలీ(13) ఒక్కరి తర్వాత ఒక్కరు వరుసగా ఫెవిలియన్‌ బాట పట్టారు. దీంతో 239 పరుగులకు ఇంగ్లండ్‌ ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ విల్లే (30బంతుల్లో 50) పరుగులతో స్కోరుబోర్డు ఒక్కసారిగా పరుగులు పెట్టించాడు.

సిద్ధార్ధ్‌ కౌల్‌ వేసిన 46ఓవర్‌లో రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌ బాదిన విల్లే.. ఆ తర్వాత ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లోనూ రెండు బౌండరీలు బాదాడు. మరోవైపు హర్ధిక్‌ పాండ్యా వేసిన 47.4బంతికి పరుగు రాబట్టి జో రూట్‌ కెరీర్‌లో 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చివర్లో వీరిద్దరూ రాణించడంతో ఇంగ్లాండ్‌ 300 పరుగుల మార్క్‌ని దాటింది.




రెండో వన్డేలో రూట్, మోర్గన్ హాఫ్ సెంచరీలు
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు రూట్, మోర్గన్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్. పవర్‌ప్లేలో దూకుడుగా ఆడి ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. కుల్దీప్ వేసిన 11వ ఓవర్‌లో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఓవర్ రెండో బంతికి బెయిర్‌స్టో(38) క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత కుల్దీప్ వేసిన 15వ ఓవర్‌లో మరో ఓపెనర్ జేసన్‌రాయ్‌(40) కూడా ఉమేశ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కష్టాల్లోపడిన జట్టుకి రూట్, మోర్గన్‌ల జోడీ అండగా నిలిచింది. నిలకడగా ఆడతూ స్కోరు బోర్డుని పెంచుతున్నారు. ఈ క్రమంలో రూట్, మోర్గన్‌లు హాఫ్ సెంచరీలు నమోదు చేశారు.

హాఫ్ సెంచరీ అనంతరం మోర్గాన్(53).... 31వ ఓవర్‌‌లో ధావన్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 31 ఓవర్లు ముగిసేసరికి ఇగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(54), బెన్ స్టోక్స్(0) పరుగులతో ఉన్నారు.


నిలకడగా ఆడుతోన్న జో రూట్‌, మోర్గాన్‌
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్‌ నిలకడగా ఆడుతోంది. 25 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ (29), జోరూట్‌ (41) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. భారీ షాట్లకు పోకుండా సింగిల్స్‌తో స్కోరు బోర్డుని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఆచితూచి ఆడుతున్న ఇంగ్లాండ్‌
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు ఇద్దరూ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం 20 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 121/2తో ఉంది.


కుల్దీప్‌ రాకతో ఇంగ్లాండ్ ఓపెనర్లు పెవిలియన్‌కు
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో కుల్దీప్ విజృంభిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో కుల్దీప్ వేసిన రెండో బంతికే వికెట్‌ తీశాడు. దూకుడుగా ఆడుతున్న ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (38)ను పెవిలియన్‌‌కు చేర్చిన కుల్దీప్ ఆ తర్వాత మరో ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (40)ను 14.1 వ బంతికి ఔట్‌ చేశాడు. భారీ షాట్‌ ఆడబోయిన అతడు ఫీల్డర్‌ ఉమేశ్‌ చేతికి చిక్కాడు. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్‌ 88/2తో నిలిచింది. జో రూట్‌ (8) , మోర్గాన్‌ (1) క్రీజలో ఉన్నారు.


తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
లార్డ్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులో కుదురుకుంటున్న జానీ బెయిర్‌స్టో-జాసన్ రాయ్ భాగస్వామ్యాన్ని కుల్దీప్ యాదవ్ విడదీశాడు. 11వ ఓవర్ రెండో బంతికి కుల్దీప్ బౌలింగ్‌లో బెయిర్‌స్టో (38) క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో 69 పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం 12 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. జాసన్ రాయ్ (33), జో రూట్ (2) క్రీజులో ఉన్నారు.


India Vs England, 2nd ODI, Live Cricket Updates: Team India look to claim series at Lords

టాస్ గెలిచిన ఇంగ్లాండ్, కోహ్లీసేన బౌలింగ్
మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయోన్ మోర్గాన్ వన్డేలో చేసిన పొరపాట్లకు తావివ్వకుండా కుదురుగా ఆడాలని నిర్ణయించినట్టు తెలిపాడు.

భారీ స్కోరు సాధించి ప్రత్యర్థికి సవాలు విసరనున్నట్టు చెప్పాడు. టీమిండియా సారథి కోహ్లీ మాట్లాడుతూ తాను టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలని అనుకున్నానని, ఇప్పుడు అదే దక్కినందుకు సంతోషంగా ఉందన్నాడు. లార్డ్స్ మైదానం ఎప్పుడూ సీమర్లకు అనుకూలిస్తుందని పేర్కొన్నాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నాడు.

మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా ఆరో వన్డే సిరిస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లాండ్ మాత్రం ఎలాగైనే గెలవాలని పట్టుదలతో ఉంది. 2016, జనవరిలో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటి నుంచి కోహ్లీ సేన వరుసగా వన్డే సిరిస్‌లను గెలుచుకుంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. తొలి వన్డేలో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఎదుర్కోవడంలో ఇంగ్లాండ్ తీవ్రంగా ఇబ్బంది పడింది.

తొలి వన్డేలో బరిలో దిగిన ఆటగాళ్లతోనే ఇరు జట్లు రెండో వన్డేలో ఆడుతున్నాయి. లార్డ్స్ పిచ్ కొద్దిగా పచ్చికతో కూడి ఉంది. దీంతో తొలి పది ఓవర్లో పిచ్ నుంచి సీమర్లకు సహకారం లభించే అవకాశం ఉంది. గాయం కారణంగా అలెక్స్ హేల్స్ వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడి స్ధానంలో బెన్ స్టోక్స్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు.

జట్ల వివరాలు:
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, రాహుల్, రైనా, ధోనీ, పాండ్యా, చాహల్, కుల్దీప్, కౌల్, ఉమేశ్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, బట్లర్, అలీ, విల్లే, రషీద్, ఫ్లంకెట్, వుడ్.

Story first published: Sunday, July 15, 2018, 7:45 [IST]
Other articles published on Jul 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X