న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వర్షం కారణంగా టీమిండియా తొలి రోజు ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు

India vs Cricket Australia XI: Virat Kohli and Co spend time in gym as rain spoils Day 1 of practice Test

సిడ్నీ: టీ20 సిరీస్‌ ముగిసిన వెంటనే టీమిండియా ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియా ఎలెవన్‌ జట్టుతో ఓ సన్నాహాక మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌ 3 రోజులు మాత్రమే జరగాలి. దానిని బట్టి నవంబర్‌ 29న మొదలై.. డిసెంబర్‌ 1న ముగుస్తుందని ముందుగా నిర్ణయించారు. ఆస్ట్రేలియా వంటి జట్టుతో తలపడే ముందు ప్రాక్టీస్‌ సెషన్‌కు ఇంకాస్త ఎక్కువ సమయం ఉండాలని బీసీసీఐ భావించింది.

4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు మ్యాచ్ రద్దు:

దీంతో 3 రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌కు మరో రోజును అదనంగా కేటాయించాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాను కోరినట్లు తెలిసింది. దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్ట్ సిరీస్‌కు ముందు ఏర్పాటు చేసిన 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలి రోజు వర్షం కారణంగా రద్దయింది. సిడ్నీలో భారీ వర్షం కురుస్తుండటంతో కనీసం టాస్ వేసే అవకాశం కూడా లేకుండాపోయింది. దీంతో టీమిండియా ప్లేయర్స్ జిమ్‌కే పరిమితమయ్యారు.

కోహ్లితోపాటు జిమ్‌లో దిగిన ఫొటోను

కెప్టెన్ కోహ్లితోపాటు ఇషాంత్ శర్మ, మురళీ విజయ్ జిమ్‌లో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. వర్షం ఆగేలా లేదు.. దీంతో ఇలా జిమ్‌కు వచ్చామంటూ విరాట్ ఈ ఫొటోను షేర్ చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో టీమిండియా నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ తర్వాత తొలి టెస్ట్ కోసం అడిలైడ్‌కు వెళ్తుంది. డిసెంబర్ 6 నుంచి తొలి టెస్ట్ మొదలవుతుంది.

ఇషాంత్, విజయ్‌లాంటి ప్లేయర్స్ జట్టుతో

ఇషాంత్, విజయ్‌లాంటి ప్లేయర్స్ జట్టుతో

ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైన విషయం తెలిసిందే. టెస్ట్ సిరీస్ కోసం పటిష్ఠమైన ఫేస్ బలగంతో సిద్ధమైంది. ఇషాంత్, విజయ్‌లాంటి ప్లేయర్స్ జట్టుతో కలిశారు. ఓవైపు టీ20 సిరీస్ జరుగుతున్న సమయంలోనే మరోవైపు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ సిడ్నీ వెళ్లి టెస్టు స్పెషలిస్టులను ముందునుంచే మురళీ విజయ్, పృథ్వీ షా, రహానేతోపాటు పేస్ బౌలర్లు ఇషాంత్‌శర్మ, మహ్మద్ షమిలతో ప్రాక్టీస్ చేయించాడు.

ఆడనున్న ఇరు జట్లు:

టీమిండియా:

Lokesh Rahul, Prithvi Shaw, Cheteshwar Pujara, Virat Kohli(c), Ajinkya Rahane, Rishabh Pant(w), Ravindra Jadeja, Ravichandran Ashwin, Kuldeep Yadav, Umesh Yadav, Mohammed Shami, Rohit Sharma, Murali Vijay, Hanuma Vihari, Parthiv Patel, Ishant Sharma, Bhuvneshwar Kumar, Jasprit Bumrah

ఆస్ట్రేలియా 11:

D Arcy Short, Max Bryant, Sam Whiteman(c), Jake Carder, Harry Nielsen(w), Param Uppal, Jonathan Merlo, Jackson Coleman, Harry Conway, Daniel Fallins, David Grant, Aaron Hardie

Story first published: Wednesday, November 28, 2018, 13:29 [IST]
Other articles published on Nov 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X