న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోల్‌కతా స్టేడియం అభిమానులతో కిక్కిరిపోనుంది.. వారిని చూసి కోహ్లీ ఆశ్చర్యపోతాడు'

India vs Bangladesh: Sourav Ganguly said Virat Kohli would be happy to see full house when he walks out to bat

కోల్‌కతా: సాంప్రదాయ టెస్టు క్రికెట్‌పై ఆసక్తి పెంచడానికి కొత్త పద్ధతులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఈనెల 22న చారిత్రక డే/నైట్‌ టెస్టు ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఆడబోతున్న తొలి డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈడెన్‌పైనే ఉంది.

కోల్‌కతాలో గులాబీమయం.. ఈడెన్‌ గార్డెన్స్‌లో మస్కట్‌ను ఆవిష్కరించిన గంగూలీ!!కోల్‌కతాలో గులాబీమయం.. ఈడెన్‌ గార్డెన్స్‌లో మస్కట్‌ను ఆవిష్కరించిన గంగూలీ!!

నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలి:

నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలి:

డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌కు సంబంధించిన మస్కట్స్‌ను సౌరవ్ గంగూలీ ఆదివారం మైదానంలో ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ... 'టెస్టు క్రికెట్‌లో కొత్త పద్ధతులను తీసుకురావాలి. కొన్ని సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఇది జరుగుతుంది. ఎక్కడో ఒకచోట ప్రారంభం కావాల్సిందే. క్రికెట్‌ పరంగా భారత్‌ చాలా పెద్ద దేశం. నూతన పద్ధతులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది' అని గంగూలీ అన్నాడు.

అభిమానులను తీసుకురావడం తేలిక కాదు:

అభిమానులను తీసుకురావడం తేలిక కాదు:

'భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచంలో ఎక్కడైనా అభిమానులు వస్తారు. ఆ మ్యాచ్‌ గురించి ప్రకటిస్తే చాలు.. స్టేడియం నిండిపోతుంది. అయితే అసలైన పరీక్ష ఇప్పుడుంది. టెస్టు క్రికెట్‌కు అభిమానులను తీసుకురావడం అంత సులువైన విషయం కాదు. అయినా.. తొలి మూడు రోజుల్లో ఒక్కో రోజు 65 వేల మంది చొప్పున అభిమానులు డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌కు వస్తున్నారు. ఇది చాలా ఆనందంగా ఉంది' అని దాదా చెప్పాడు.

 కోహ్లీ ఆశ్చర్యపోతాడు:

కోహ్లీ ఆశ్చర్యపోతాడు:

'టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. విరాట్ తొలి రోజు మైదానంలోకి వచ్చినప్పుడు స్టేడియం మొత్తం అభిమానులతో నిండి ఉండటం చూసి సంతోషిస్తాడు. అదే సమయంలో ఆశ్చర్యపోతాడు కూడా. తొలి మూడు రోజులు అభిమానులతో ఈడెన్‌గార్డెన్స్‌ కిక్కిరిసిపోతుంది. ఇక్కడి ఏర్పాట్లు అందరిని మైమరిపిస్తాయి. కోల్‌కతా మొత్తం గులాబీమయం చేస్తాం' అని గంగూలీ తెలిపాడు.

గంట కొట్టనున్న హసీనా:

గంట కొట్టనున్న హసీనా:

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఉదయం గంట కొట్టి డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత విరామంలో ఫాబ్యూలస్ ఫైవ్ పేరుతో జరిగే టాక్‌షోలో దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ టెస్టు అనుభవాలను పంచుకోనున్నారు.

Story first published: Monday, November 18, 2019, 10:44 [IST]
Other articles published on Nov 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X