న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'జట్టు కూర్పుపై కసరత్తులు చేయాలి.. మూడేళ్లలో మంచి జట్టుగా తయారవుతాం'

India vs Bangladesh: Mominul Haque said Bangladesh Pacers Can Learn Everything From Indian Bowlers

ఇండోర్: జట్టు కూర్పుపై కసరత్తులు చేయాలి. ఫలితాలు వెంటనే లభించవు. కానీ.. వచ్చే మూడేళ్లలో మంచి జట్టుగా తయారవుతాం అని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌ ధీమా వ్యక్తం చేసాడు. భారత్‌ చేతిలో ఇన్నింగ్స్‌ పరాజయానికి బ్యాటింగ్‌ వైఫల్యమే ప్రధాన కారణమన్నాడు. ఇండోర్‌ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. కనీసం పోటీ ఇవ్వకుండా బంగ్లా ఆటగాళ్లు భారత బౌలర్ల ముందు తలొంచారు.

<strong>క్రికెట్‌లో రీఎంట్రీ: పృథ్వీ షా మెరుపులు.. ముంబై భారీ విజయం</strong>క్రికెట్‌లో రీఎంట్రీ: పృథ్వీ షా మెరుపులు.. ముంబై భారీ విజయం

జట్టు కూర్పుపై కసరత్తులు చేయాలి:

జట్టు కూర్పుపై కసరత్తులు చేయాలి:

మ్యాచ్ అనంతరం మోమినుల్‌ హక్‌ మాట్లాడుతూ... 'భారత్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత కోచ్‌తో కలిసి టెస్టు ప్రణాళికను సిద్ధం చేస్తాం. జట్టు కూర్పుపై తీవ్ర కసరత్తులు చేయాల్సి ఉంది. అయితే ఫలితాలు వెంటనే లభించవు. కానీ.. వచ్చే మూడేళ్లలో మంచి జట్టుగా తయారవుతాం' అని ధీమా వ్యక్తం చేసాడు.

రెండు టెస్టులే ఆడాం:

రెండు టెస్టులే ఆడాం:

'మనం మానసికంగా సిద్ధమైతే సానుకూలంగా ఆలోచిస్తాం. ఎప్పుడైతే టెస్టు క్రికెట్‌ ఆడుతున్నామో అందుకు మైండ్‌సెట్‌ను కూడా మార్చుకోవాలి. అప్పుడే ఇది టెస్టు క్రికెట్‌ అనే విషయం గురించి ఆలోచిస్తాం. గత ఏడు నెలల కాలంలో మేము రెండు టెస్టులే ఆడాం. ఇతర జట్టులతో పోలిస్తే.. ఇది చాలా చాలా తక్కువ. టెస్ట్ ఫార్మాట్‌లో చెత్త ప్రదర్శనకు ఇది కూడా ఒక కారణం. మేం ఇంకా మెరుగుపడాలి' అని మోమినుల్‌ పేర్కొన్నాడు.

భారత్‌ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు:

భారత్‌ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు:

ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఛాంపియన్‌షిప్‌ ద్వారా టెస్టులు ఆడటానికి మాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. భారత బౌలింగ్‌ దళం నుంచి మా పేసర్లు ఎంతో నేర్చుకోవచ్చు. పాత బంతి, కొత్త బంతితో ఎలా రాణించాలో తెలుసుకోవచ్చు. భారత్ అద్భుతంగా ఆడింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడం సాహసోపేత నిర్ణయమే. ఆటలో ఇదో భాగం. శ్రమిస్తే విజయం తప్పకుండా దక్కుతుంది. గులాబీ బంతితో ఆడటానికి ఉత్సాహంగా ఉన్నాం' అని మోమినుల్‌ తెలిపాడు.

కోల్‌కతాలో డే/నైట్‌ టెస్టు:

కోల్‌కతాలో డే/నైట్‌ టెస్టు:

తొలి టెస్టులో బంగ్లా ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకు ఆలౌటై ఇన్నింగ్స్‌ పరాజయాన్ని చవిచూసింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా శుక‍్రవారం కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్‌లో భారత్‌-బంగ్లాల మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇది డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌గా నిర్వహిస్తున్నారు.

Story first published: Sunday, November 17, 2019, 18:41 [IST]
Other articles published on Nov 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X