న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇండోర్ టెస్టులో మయాంక్ సెంచరీ: సమం చేసిన రికార్డులివే, స్మిత్‌కు చేరువలో!

India vs Bangladesh: Mayank Agarwal hits third Test ton; equals Merchat, Sobers, closes in on Steve Smith

హైదరాబాద్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 184 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో మయాంక్ సెంచరీని సాధించాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్‌కు ఇది 3వ సెంచరీ.

ఇటీవల విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ బాదిన మయాంక్‌ ఈ మ్యాచ్‌లో సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. స్వదేశంలో నాలుగో టెస్టు ఆడుతోన్న మయాంక్ అగర్వాల్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో మయాంక్ పలు రికార్డులకు చేరువయ్యాడు.

30 years of Sachin Tendulkar: మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలివే!30 years of Sachin Tendulkar: మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలివే!

విజమ్ మర్చంట్ రికార్డుని సమం చేసిన మయాంక్ అగర్వాల్

విజమ్ మర్చంట్ రికార్డుని సమం చేసిన మయాంక్ అగర్వాల్

12 ఇన్నింగ్స్‌ల్లోనే మయాంక్ అగర్వాల్ టెస్టుల్లో మూడో సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించిన విజయ్ మర్చంట్ రికార్డుని మయాంక్ అగర్వాల్ సమం చేశాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(4 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు) అగ్రస్థానంలో ఉండగా... సునీల్ గవాస్కర్(7 ఇన్నింగ్స్‌ల్లో 3 సెంచరీలు) రెండో స్థానంలో ఉండగా... కేఎల్ రాహుల్ 9 ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు సాధించాడు.

గ్యారీ సోబెర్స్ రికార్డుని సమం చేసన మయాంక్

గ్యారీ సోబెర్స్ రికార్డుని సమం చేసన మయాంక్

మయాంక్ అగర్వాల్ ఇప్పటివరకు స్వదేశంలో నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు. ఈ నాలుగు టెస్టుల్లోనే మయాంక్ అగర్వాల్ మూడు సెంచరీలు నమోదు చేశాడు. స్వదేశంలో మొదటి నాలుగు టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం గ్యారీ సోబెర్స్, టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్, ఇంగ్లాండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెన్ బారింగ్టన్, జింబాబ్వే బ్యాట్స్‌మన్ ఆండీ ప్లవర్ రికార్డుని సమం చేశాడు.

స్టీవ్ స్మిత్ రికార్డుకి చేరువలో

స్టీవ్ స్మిత్ రికార్డుకి చేరువలో

బాల్ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ తన పునరగామనంలో ఇంగ్లాండ్‌తో జరిగిన యాషెస్ సిరిస్‌లో 774 పరుగులు చేశాడు. ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మయాంక్ అగర్వాల్ తొమ్మిది నెలల కాలంలో 700 పరుగులు చేశాడు. ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మయాంక్ అగర్వాల్ తర్వాత రోహిత్ శర్మ(630), క్వింటన్ డీకాక్(629), బెన్ స్టోక్స్(627) ఉన్నారు.

మయాంక్ మిగతా సెంచరీలు

మయాంక్ మిగతా సెంచరీలు

సఫారీలతో మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టెస్టులో డబుల్ సెంచరీ బాదిన మయాంక్‌ ఈ మ్యాచ్‌లో సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత పూణె వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా, ఇప్పుడు బంగ్లాతో ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో మెరిశాడు.

Story first published: Friday, November 15, 2019, 15:03 [IST]
Other articles published on Nov 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X