న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అచ్చం ధోనిలాగే.. మహ్మదుల్లా గొప్ప నాయకత్వ లక్షణాలు చూపిస్తున్నాడు'

 India vs Bangladesh: Mahmudullahs captaincy is bit similar to that of MS Dhoni, says Irfan Pathan

హైదరాబాద్: బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా రియాద్‌‌పై టీమిండియా వెటరన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతడిలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ లక్షణాలు కనిపించాయని చెప్పాడు. ఆల్ రౌండర్ షకీబ్ ఉల్ హాసన్‌పై ఐసీసీ నిషేధం విధించడంతో అనూహ్యంగా మహ్మదుల్లాకు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి.

ప్రస్తుతం టీమిండియాతో జరుగుతున్న మూడు టీ20ల సిరిస్‌లో మహ్మదుల్లా జట్టును బాగా నడిపిస్తున్నాడని ఇర్పాన్ పఠాన్ తెలిపాడు. ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో మహ్మదుల్లా నాయకత్వంలోని బంగ్లాదేశ్ టీమిండియాపై విజయం సాధించింది. టీ20ల్లో భారత్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.

ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్: మేరీ‌కోమ్‌తో ఫైట్, పంతం నెగ్గంచుకున్న నిఖత్ జరీన్?ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్: మేరీ‌కోమ్‌తో ఫైట్, పంతం నెగ్గంచుకున్న నిఖత్ జరీన్?

అయితే, రాజ్‌కోట్ వేదికగా గురువారం జరిగిన రెండో టీ20లో బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ "ప్రపంచంలోని అత్యుత్తమ జట్టుపై గెలిస్తే ఆ తర్వాత వచ్చే ఆత్మవిశ్వాసమే వేరు. మ్యాచ్‌లో పరిస్థితులకు అనుగుణంగా మైదానంలో మార్పులు చేస్తూ మహ్మదుల్లా గొప్ప నాయకత్వ లక్షణాలు చూపించాడు" అని అన్నాడు.

"ఈ మ్యాచ్‌లో మహ్మదుల్లా... ధోని సూచనను ఫాలో అయ్యాడు. టీ20ల్లో పవర్‌ప్లే తర్వాత పార్ట్‌టైం బౌలర్లను ఉపయోగించుకోవడం మహేంద్రసింగ్‌ ధోనీ వ్యూహం. మహ్మదుల్లా సైతం అలాగే చేస్తున్నాడు" అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. మరోవైపు సీనియర్‌ ఆటగాడు ముష్పికర్‌ రహీమ్‌పై హర్భజన్‌ సింగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఆ అంఫైర్ పోర్న్ స్టార్ అని తేలియడంతో అవాక్కైన ఇంగ్లాండ్ క్రికెటర్లు!ఆ అంఫైర్ పోర్న్ స్టార్ అని తేలియడంతో అవాక్కైన ఇంగ్లాండ్ క్రికెటర్లు!

"ముష్ఫికర్ రహీమ్ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడు. స్పిన్ మరియు పేస్ బౌలింగ్ రెండింటినీ ఆడగల అతని సామర్థ్యం చాలా బాగుంది. బ్యాటింగ్‌ పరంగా జట్టులో అతడికే ఎక్కువ బాధ్యత ఉంది. ఇది బంగ్లాదేశ్ జట్టుతో పాటు కెప్టెన్ మహ్మదుల్లాకు ఎంతో ఉపయోగం" అని భజ్జీ వెల్లడించాడు.

Story first published: Saturday, November 9, 2019, 18:31 [IST]
Other articles published on Nov 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X