న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గెలిస్తే క్రెడిట్ అతడిదే!: ఓటమికి కారణాన్ని వెల్లడించిన బంగ్లా కెప్టెన్

India vs Bangladesh 2019,3rd T20I : Bangladesh Captain Mahmudullah About Match Loss Against India
 India vs Bangladesh: Losing wickets in a cluster cost us 3rd T20I, says Mahmudullah

హైదరాబాద్: మూడో టీ20లో నయీమ్‌(81; 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతంగా రాణించినప్పటికీ బంగ్లాదేశ్ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆ జట్టు కెప్టెన్ మహ్మదుల్లా వెల్లడించాడు. ఆదివారం నాగ్‌పూర్‌ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 30 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

ఈ ఓటమితో టీమిండియాపై టీ20 నెగ్గే సువర్ణావకాశాన్ని బంగ్లాదేశ్ చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం మహ్మదుల్లా మాట్లాడుతూ "30 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో గెలిచే అవకాశం మావైపే ఉంది. చివర్లో వెంట వెంటనే వికెట్లు కోల్పోవడం మా ఓటమికి కారణం" అని చెప్పుకొచ్చాడు.

<strong>6 వికెట్లతో దీపక్ చాహర్ విజృంభణ.. మూడో టీ20లో బంగ్లాపై భారత్ విజయం.. సిరీస్ కైవసం!!</strong>6 వికెట్లతో దీపక్ చాహర్ విజృంభణ.. మూడో టీ20లో బంగ్లాపై భారత్ విజయం.. సిరీస్ కైవసం!!

మ్యాచ్‌ గెలవలేకపోయాం

మ్యాచ్‌ గెలవలేకపోయాం

"నయీమ్‌(81; 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతంగా బ్యాటింగ్‌ చేసినా మ్యాచ్‌ గెలవలేకపోయాం. ఈ విషయంలో నిరాశ చెందా. మేము గెలిచి ఉంటే, ఆ క్రెడిట్ అంతా నయీమ్‌‌కు దక్కేది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయాం. కానీ నయీమ్‌, మిథున్‌(27)లు బాగా అద్భుతంగా ఆడారు. వీరిద్దరూ 98 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు" అని ప్రశంసల వర్షం కురిపించాడు.

175 పరుగుల విజయ లక్ష్యంతో

175 పరుగుల విజయ లక్ష్యంతో

175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు లిటన్ దాస్, సౌమ్య సర్కార్‌లను దీపక్ చాహర్ వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నయీమ్‌, మిథున్‌ నిలకడగా ఆడుతూ మూడో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇలాంటి తప్పులే చేశాం

ఇలాంటి తప్పులే చేశాం

"గత మ్యాచ్‌లను పరిశీలిస్తే మేం ఇలాంటి తప్పులే చేశాం. పెద్ద జట్లన్నీ ఈ విభాగంలో చాలా పటిష్టంగా ఉంటాయి. నాగ్‌పూర్‌లో టార్గెట్‌ను ఛేదించడానికి వికెట్‌ చాలా బాగుంది. టీమిండియాను 174 పరుగులకు కట్టడి చేసి, మా బౌలర్లు మంచి పనిచేశారు. ఏదేమైనా, మేం చేసిన తప్పిదాలే మా ఓటమికి కారణం" అని మహ్మదుల్లా వివరించాడు.

2-1తో సిరిస్ కైవసం

2-1తో సిరిస్ కైవసం

పేసర్ దీపక్ చాహర్ 6 వికెట్లతో చెలరేగడంతో 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆఖరి టీ20లో 30 పరుగులతో గెలిచిన టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ హ్యాట్రిక్ కూడా నమోదు చేయడం విశేషం.

Story first published: Monday, November 11, 2019, 12:14 [IST]
Other articles published on Nov 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X