న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈజీ క్యాచ్‌ని మిస్ చేసిన తమీమ్ ఇక్బాల్: రోహిత్ శర్మకు లైఫ్

ICC Cricket World Cup 2019 : Tamim Iqbal Missed The Easy Catch, Rohit Sharma Got Life ! || Oneindia
India vs Bangladesh Live Score, Rohit Sharma dropped at 9. This is going to hurt Bangladesh. Massive mistake by Tamim Iqbal

హైదరాబాద్: బర్మింగ్ హామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు లైఫ్ లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

జట్టు స్కోరు 19 పరుగుల వద్ద ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ నాలుగో బంతికి మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అదే సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న తమీమ్ ఇక్బాల్ పరిగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించాడు.

అయితే ఒక్కసారిగా కంట్రోల్ తప్పడంతో బంతి అతడి చేతుల్లో నుంచి చేజారింది. దీంతో మ్యాచ్ చూస్తోన్న అభిమానులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ సిక్స్, ఫోర్‌తో చెలరేగాడు. ప్రస్తుతం టీమిండియా 6 ఓవర్లకు గాను వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(18), కేఎల్ రాహుల్(10) పరుగులతో ఉన్నారు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కేదార్ స్ధానంలో దినేశ్ కార్తీక్, కుల్దీప్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ కుమార్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ కూడా రెండు మార్పులు చేసింది. మహ్మదుల్లా, మిర్జ్ స్థానాల్లో రూబెల్ హుస్సేన్, షబ్బీర్ రెహ్మాన్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

బంగ్లాదేశ్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌కు ఇది 200వ వన్డే కావడం విశేషం. టీమిండియా ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయం సాధించి ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దు అయింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే 13 పాయింట్లతో భారత్ సెమీస్‌ చేరుతుంది.

1
43683

{headtohead_cricket_3_10}

Story first published: Tuesday, July 2, 2019, 15:45 [IST]
Other articles published on Jul 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X