న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ 347/9 డిక్లేర్‌: ముష్ఫికర్ హాఫ్ సెంచరీ... పింక్ బాల్ టెస్ట్, డే2 హైలెట్స్ ఇవే!

India Vs Bangladesh,Day-Night Test : Ishant Sharma On Fire, India 6 Wickets away From Win

India vs Bangladesh Live Score, Pink Ball Test Day 2: Ishant strikes twice after India declare with 241-run lead


హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో టీమిండియా 347/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో బంగ్లాదేశ్‌పై 241 పరుగుల ఆధిక్యం లభించింది.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 174/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన టీమిండియా భారత్ దూకుడుగా ఆడింది.ఈ క్రమంలో వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే(51; 69 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో రహానేకి ఇది 22వ హాఫ్ సెంచరీ. హాఫ్‌సెంచరీ అనంతరం రహానే(51) తైజుల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

దీంతో కోహ్లీ, రహానే 99 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. తైజుల్‌ ఇస్లామ్‌ వేసిన 68 ఓవర్‌ మూడో బంతికి రెండు పరుగులు తీయడం ద్వారా కోహ్లీ 159 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 101 పరుగులతో సెంచరీ సాధించాడు.

టెస్టుల్లో కోహ్లీకి ఇది 27వ సెంచరీ కాగా మొత్తంగా 70వ సెంచరీ. ఇప్పటి వరకు తెలుపు, ఎర్ర బంతులతో జరిగిన మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించిన కోహ్లీ పింక్‌ బాల్ టెస్టులో సైతం సెంచరీ సాధించాడు.

ఫలితంగా భారత్‌లో జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అయితే, 136 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఆరో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ ఔటైన తర్వాత టీమిండియా వరుసగా వికెట్లను కోల్పోయింది. వరుస ఓవర్లలో అశ్విన్ (9), ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలు డకౌటయ్యారు.

1
46120

అనంతరం క్రీజులోకి వచ్చిన షమీ సిక్సర్, ఫోర్‌తో పది పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే సమయానికి వృద్ధిమాన్‌ సాహా (17), మహ్మద్‌ షమి (10) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో అల్ అమీన్ హొసైన్, ఇబాదత్ హొసైన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, అబు జాయెద్ రెండు, తైజుల్ ఇస్లాంకు ఒక వికెట్ లభించింది.

Nov 23, 2019, 8:03 pm IST

ఐదో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఐదో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 26వ ఓవర్ ఆఖరి బంతికి మెహదీ హాసన్(15) పరుగుల వద్ద కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 27 ఓవర్లకు గాను బంగ్లా 134/5 స్థితిలో ఉంది.

Nov 23, 2019, 7:58 pm IST

ముష్ఫికర్ హాఫ్ సెంచరీ

భారత్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ రహీమ్ 54 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో ముష్ఫికర్‌కు ఇది 21వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 25.5 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫికర్(51), మెహదీ హాసన్(15) పరుగులతో ఉన్నారు. బంగ్లాదేశ్ ఇంకా 108 పరుగుల వెనుకంజలో ఉంది.

Nov 23, 2019, 7:53 pm IST

మెహదీ హాసన్ క్యాచ్‌ని మిస్ చేసిన రహానే

క్రీజులో కుదురుకున్న బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ విడదీసేందుకు కెప్టెన్ కోహ్లీ అశ్విన్‌ను ప్రయోగించాడు. అశ్విన్ వేసిన వేసిన తొలి బంతిని ముష్ఫికర్ బౌండరీగా మలిచాడు. ఇదే ఓవర్ నాలుగో బంతి మెహదీ హాసన్ బ్యాట్‌కు తగిలి స్లిప్‌లో ఉన్న రహానే చేతిలో పడింది. అయితే, రహానే కాస్త ఆలస్యంగా స్పందించడంతో క్యాచ్ మిస్ అయింది.

Nov 23, 2019, 7:31 pm IST

మహ్మదుల్లా రిటైర్డ్ హర్ట్

బంగ్లా బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో కుదురుకుని ముప్ఫికర్‌తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మహ్మదుల్లా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగడం బంగ్లాదేశ్‌కు గట్టి ఎదురుదెబ్బే. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన మహ్మదుల్లా స్థానంలో మెహదీ హసన్ క్రీజులోకి వచ్చాడు.

Nov 23, 2019, 7:18 pm IST

రనౌట్ నుంచి తప్పించుకున్న ముష్ఫికర్

తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో ముష్ఫికర్ రనౌట్ నుంచి తప్పించుకున్నాడు. అంఫైర్ ఎరాస్మస్ ఇచ్చిన ఎల్బీపై ముష్ఫికర్ రివ్యూ కోరాడు. అయితే, రివ్యూలో బంతి ఆల్ట్రా ఎడ్జ్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపించడంతో థర్డ్ అంఫైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. ప్రస్తుతం 18 ఓవర్లకు గాను బంగ్లా 4 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫికర్(23), మహ్మదుల్లా(34) పరుగులతో ఉన్నారు.

Nov 23, 2019, 7:07 pm IST

పోరాడుతున్న ముష్ఫికర్-మహ్మదుల్లా

347/9 వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 44 పరుగులకే 4 వికెట్లు కోల్పోయ కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్, మహ్మదుల్లా ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డుని నడిపిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం 17 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. బంగ్లా ఇంకా 168 పరుగుల వెనుకంజలో ఉంది.

Nov 23, 2019, 6:56 pm IST

ముష్ఫికర్ తలను తాకిన ఉమేశ్ బౌన్సర్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న డే నైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ బ్యాట్స్‌మన్ తడబడుతున్నారు. బంగ్లా ఇన్నింగ్స్‌‌లో భారత పేసర్ ఉమేశ్ యాదవ్ వేసిన 15వ ఓవర్ మూడో బంతి ముష్ఫికర్ తలను తాకింది. దీంతో అంఫైర్ డ్రింక్స్ విరామం ప్రకటించాడు. అదే సమయంలో బంగ్లా ఫిజియో మైదానంలోకి వచ్చి ముష్పికర్‌ను పరిశీలించాడు. దీంతో అతడికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ప్రస్తుతం 14.3 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. బంగ్లా ఇంకా 178 పరుగుల వెనుకంజలో ఉంది.

Nov 23, 2019, 6:17 pm IST

17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బంగ్లా

347/9 వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ 17 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత పేసర్లు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. పదునైన బౌన్సర్లతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నారు.

Nov 23, 2019, 6:11 pm IST

ఇషాంత్ శర్మపై కోప్పడ్డ మిథున్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో మహ్మద్ మిథున్ సీరియస్ అయ్యాడు. టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ విసిరిన బౌన్సర్ మహ్మద్ మిధున్ హెల్మెట్‌ను బలంగా తాకింది. దీంతో అతడికి ఏమైందోనంటూ భారత క్రికెటర్లు అతడి వద్దకు వెళ్లారు. అయితే, అతడికి ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Nov 23, 2019, 6:02 pm IST

డే 2: టీ విరామానికి బంగ్లాదేశ్ 7/2

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీ విరామానికి బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి 7 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 234 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Nov 23, 2019, 5:56 pm IST

4 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా

ఇషాంత్ శర్మ మరోసారి చెలరేగాడు. జట్టు స్కోరు 2 పరుగుల వద్ద బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హాక్ ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో 4 పరుగులకే బంగ్లాదేశ్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

Nov 23, 2019, 5:51 pm IST

తొలి ఓవర్‌లోనే వికెట్ తీసిన ఇషాంత్

రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టుని తొలి ఓవర్‌లోనే టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ దెబ్బకొట్టాడు. 347/9 వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్‌ను తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (0)ను పెవిలియన్ పంపాడు. దీంతో బంగ్లాదేశ్ ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది.

Story first published: Saturday, November 23, 2019, 20:14 [IST]
Other articles published on Nov 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X