న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: ఇండోర్ టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం

IND vs BAN,1st Test Highlights, India Won By An Innings And 130 Runs || Oneindia Telugu
India vs Bangladesh Live Score 1st Test Day 3: India take 1-0 lead with innings win

హైదరాబాద్: ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ 69.2 ఓవర్లకు 213 పరుగులకే కుప్పకూలింది.

భారత బౌలర్లలో మహమ్మద్ షమీ నాలుగు వికెట్ల తీయగా, రవిచంద్రన్ అశ్విన్ మూడు, ఉమేశ్ యాదవ్ రెండు, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ లభించింది. ఇండోర్ వేదికగా గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ

తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ డ‌బుల్ సెంచ‌రీ చేయ‌డంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 493/6 పటిష్ట స్థితిలో నిలిచింది. మూడో రోజైన శనివారం టీమిండియా అదే పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగుల ఆధిక్యం లభించింది.

తొలి ఇన్నింగ్స్‌ను 493/6 వద్ద డిక్లేర్‌ చేసిన భారత్

తొలి ఇన్నింగ్స్‌ను 493/6 వద్ద డిక్లేర్‌ చేసిన భారత్

శనివారం ఉదయం మ‌రికొన్ని ప‌రుగులు చేసి బంగ్లాని బ్యాటింగ్‌కి ఆహ్వానిస్తుంద‌ని అంతా భావించారు. అయితే, అందుకు భిన్నంగా బ్యాటింగ్‌కు రాకుండానే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 493/6 వద్ద డిక్లేర్‌ చేసింది. దీంతో బంగ్లాదేశ్ తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు చెలరేగడంతో బంగ్లా ఆలౌటైంది.

18 పరుగులకే రెండు వికెట్లు

మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే బంగ్లాదేశ్ ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఆరో ఓవర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఇమ్రుల్‌ కెయెస్‌(6) బౌల్డయ్యాడు. ఆ త‌ర్వాత ఇషాంత్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ షాద్‌మాన్ ఇస్లామ్‌(6)ని బౌల్డ్ కావడంతో బంగ్లాదేశ్ 18 ప‌రుగుల‌కి రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత మహ్మద్ షమీ బౌలింగ్‌లో మొమినుల్‌ హక్‌(7), మిథున్‌(18)లు పెవిలియన్‌కు చేరారు.

ముష్ఫికర్ ఒంటరి పోరాటం

ఈ దశలో క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్ ఎంతో బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకుపోతున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న నిలకడగా ఆడుతూ ముప్పికర్ హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో ముప్పికర్‌కు ఇది 20వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

భారత్‌పై అత్యధిక పరుగుల రికార్డు

భారత్‌పై అత్యధిక పరుగుల రికార్డు

ఈ క్రమంలో టెస్టుల్లో భారత్‌పై బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మహ్మద్‌ అష్రాఫుల్‌ పేరిట ఉన్న రికార్డును ముష్పికర్‌ బద్దలు కొట్టాడు. భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అయితే 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అశ్విన్‌ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

కోహ్లీ నాయకత్వంలో భారత్‌కు 10వ ఇన్నింగ్స్ విజయం

ముష్ఫికర్ ఔటైన తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్లు పెవిలిన్‌కు క్యూ కట్టారు. దీంతో బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియాకిది 10వ ఇన్నింగ్స్ విజయం కావడం విశేషం. అన్ని రంగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా బంగ్లాను చిత్తుగా ఓడించింది.

స్కోరు వివరాలు:

భారత్ తొలి ఇన్నింగ్స్: 493/6 డిక్లేర్డ్

బంగ్లా తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్

బంగ్లా రెండో ఇన్నింగ్స్: 213 ఆలౌట్

Story first published: Saturday, November 16, 2019, 16:07 [IST]
Other articles published on Nov 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X