న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌‌లో తొలి డే నైట్ టెస్ట్: పుజారా ఔట్, కోహ్లీ 23వ హాఫ్ సెంచరీ

IND vs BAN,2nd Test : Bangladesh All-Out For 106 In 1st Innings, Ishant Sharma Took 5-wickets !
Mayank

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌటైంది. భారత్‌ పేసర్లు చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్‌ వంద పరుగుల మార్కును అతి కష్టం మీద చేరింది. టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, షమీలు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించారు.

పదునైన బంతులతో వణికించారు. భారత పేసర్ల దెబ్బకు ఇద్దరు బంగ్లా బ్యాట్స్‌మన్‌కు గాయాలు కూడా అయ్యాయి. బంగ్లాదేశ్ ఆటగాళ్లలో ఓపెనర్ ఇస్లామ్ చేసిన 29 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. బంగ్లా జట్టులో నలుగురు ఆటగాళ్లు డకౌట్ కాగా, ఇద్దరు ఒక్కో పరుగు చేశారు.

తొలి డే నైట్ టెస్ట్: బంగ్లాదేశ్ 106 ఆలౌట్, 5 వికెట్లతో చరిత్ర సృష్టించిన ఇషాంత్ శర్మతొలి డే నైట్ టెస్ట్: బంగ్లాదేశ్ 106 ఆలౌట్, 5 వికెట్లతో చరిత్ర సృష్టించిన ఇషాంత్ శర్మ

భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ 5 వికెట్లతో చెలరేగగా... ఉమేశ్ యాదవ్‌ 3, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టారు. ఇషాంత్‌కు టెస్టుల్లో 10వ సారి ఐదు వికెట్ల మైలురాయిని అందుకోగా.. భారత్‌లో ఇది రెండోసారి కావడం విశేషం.

Nov 22, 2019, 8:12 pm IST

టెస్టుల్లో 23వ హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో 77 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ(50) హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీకి ఇది 23వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ప్రస్తుతం 41 ఓవర్లకు గాను టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ(50), రహానే(5) పరుగులతో ఉన్నారు.

Nov 22, 2019, 8:09 pm IST

పుజారా ఔట్: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 137 పరుగుల వద్ద పుజారా(55) హొస్సేన్ బౌలింగ్‌లో ఇస్లామ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Nov 22, 2019, 8:02 pm IST

పుజారా హాఫ్ సెంచరీ

బంగ్లాతో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పుజారాకిది 24వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మరోవైపు కోహ్లీ సైతం హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.ప్రస్తుతం 38 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ (43), పుజారా(52) పరుగులతో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 25 పరుగుల ముందంజలో ఉంది.

Nov 22, 2019, 7:47 pm IST

కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత

బంగ్లాదేశ్‌తో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరుపున ఐదువేల పరుగు మైలురాయిని అందుకున్న తొలి కెప్టెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. పింక్ బాల్ టెస్టులో కోహ్లీ 32 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కి ముందు కెప్టెన్‌గా టెస్టుల్లో ఐదువేల పరుగుల మైలురాయిని అందుకోవడానికి 32 పరుగులు దూరంలో ఉన్నాడు. భారత్ తరుపున ఇప్పటివరకు 52 టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కోహ్లీ 4,968 పరుగులు చేశాడు. తాజాగా, పింక్ బాల్ టెస్టులో కోహ్లీ 32 పరుగులు చేయడంతో టెస్టుల్లో ఐదు వేల పరుగుల మైలురాయిని అందుకున్న కెప్టెన్ల జాబితాలో చేరాడు. అంతేకాదు భారత్ తరుపున ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు

Nov 22, 2019, 6:59 pm IST

50 పరుగుల భాగస్వామ్యం

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి డే నైట్ టెస్టు మ్యాచ్‌లో 50 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. టీమిండియా బ్యాట్స్‌మన్ కోహ్లీ-పుజారాలు నిలకడగా ఆడుతూ 60 బంతుల్లో ఈ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చెత్త బంతులను వదిలివేస్తూ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి కొన్ని అద్భుతమైన షాట్లు వెలువడ్డాయి. హొస్సేన్ బౌలింగ్‌లో కోహ్లీ ఆడిన స్ట్రయిట్ డ్రైవ్ చూసేందుకు రెండు కళ్లు చాలవు.

Nov 22, 2019, 6:48 pm IST

నిలకడగా ఆడుతోన్న కోహ్లీ, పుజారా

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పుజారా నిలదొక్కుకున్నట్లే కనిపిస్తున్నారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతున్నారు. ఇద్దరూ కలిసి నలభైకి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం 22 ఓవర్లకు గాను టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ (24), పుజారా(28) పరుగులతో ఉన్నారు.

Nov 22, 2019, 6:15 pm IST

రోహిత్ శర్మ ఔట్

భారత్‌తో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో టీ విరామం అనంతరం బంగ్లా బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 43 పరుగుల వద్ద రోహిత్ శర్మ(14) అమిన్ హుస్సేన్ బౌలింగ్‌లో మెహదీ హాసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం 15 ఓవర్లకు టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంకా 50 పరుగుల వెనుకంజలో ఉంది.

Nov 22, 2019, 6:12 pm IST

మాజీ దిగ్గజాలతో ఈడెన్ గార్డెన్స్‌లో గౌరవ పరేడ్

20 నిమిషాల టీ విరామం టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గగాలు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే జులాన్ గోస్వామిలతో ఇతర విభాగాలకు చెందిన క్రీడాకారులతో ఈడెన్ గార్డెన్స్‌లో గౌరవ పరేడ్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా బౌండరీ లైన్ చుట్టూ బండ్లపై వీళ్లను తిప్పారు.

Nov 22, 2019, 5:46 pm IST

టీ విరామానికి టీమిండియా 35/1

టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఔట్ కావడంతో తొలి డే నైట్ టెస్టులో టీమిండియా స్కోరు నెమ్మదించింది. రోహిత్ శర్మ, పుజారాలు ఆచితూచి ఆడుతున్నారు. ప్రస్తుతం 12 ఓవర్లకు గాను టీ విరామానికి వికెట్ నష్టానికి టీమిండియా 35 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(13), పుజారా(7) పరుగులతో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా 71 పరుగుల వెనుకంజలో ఉంది.

Nov 22, 2019, 5:43 pm IST

రెండో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ని తీసుకున్న బంగ్లాదేశ్

తొలి డే నైట్ టెస్టులో బంగ్లాదేశ్ రెండో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ని ఉపయోగించుకుంది. నయీమ్ హసన్ స్థానంలో తైజుల్ ఇస్లాంను తీసుకుంది. మహ్మద్ షమీ వేసిన బంతి నయీమ్ హసన్ హెల్మెట్‌ను బలంగా తాకడంతో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నయీమ్ హసన్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత అతడు మైదానంలోకి తిరిగి రాలేదు. దీంతో బంగ్లాదేశ్ తప్పనిసరి పరిస్థితుల్లో రెండో రెండో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ని ఉపయోగించుకుంది. అంతకముందు రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన లిట్టన్ దాస్ స్థానంలో మెహదీ హాసన్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. మెహదీ ఆఫ్ స్పిన్నర్ కావడంతో ఈ టెస్టులో బౌలింగ్ చేయలేడు. దీనికి తోడు అతడు వికెట్ కీపర్‌కు కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చాడు.

Nov 22, 2019, 5:30 pm IST

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి పింక్ బాల్ టెస్ట్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (14) పరుగుల వద్ద అల్ అమీన్ బౌలింగ్‌లో మెహిదీ హసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఏడు ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది.

Story first published: Friday, November 22, 2019, 20:13 [IST]
Other articles published on Nov 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X