న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Day-Night Test: పారాట్రూపర్లు చేతుల మీదుగా పింక్ బాల్స్ అందుకోనున్న కెప్టెన్లు

India vs Bangladesh Day-Night Test: Captains to receive pink balls from paratroopers

హైదరాబాద్: నవంబర్ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే డే/నైట్ టెస్టులో ఇరు జట్ల కెప్టెన్లకు ఆర్మీ పారాట్రూపర్లు చేతుల మీదగా పింక్ బాల్‌ను అందజేయనున్నారు. ఈడెన్‌ గార్డెన్స్‌లో లో జరిగే చారిత్రక ఘట్టాన్ని మరింత అపురూపంగా మలచడానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్‌) కృషి చేస్తోంది.

టాస్ వేయడానికి ముందు ఈ కార్యక్రమం జరుగుతుందని క్యాబ్ కార్యదర్శి అవిశేక్ దాల్మియా వెల్లడించారు. భారత్‌లో తొలిసారి జరగనున్న పింక్ బాల్ టెస్ట్ కోసం ఎటువంటి ప్రణాళికలను తీసుకున్నామనే దానిపై అవిశేక్ దాల్మియా మాట్లాడుతూ "రెండు పింక్ బంతులతో పిచ్‌పై నుంచి పారాట్రూపర్లు గాల్లోకి ఎగిరిపోతారు. ఈ విషయంపై మేము ఆర్మీ(ఈస్టర్న్ కమాండ్)తో చర్చించాము" అని తెలిపారు.

India vs Bangladesh, 1st Test Day 3: లంచ్ విరామానికి బంగ్లాదేశ్ 60/4India vs Bangladesh, 1st Test Day 3: లంచ్ విరామానికి బంగ్లాదేశ్ 60/4

జాతీయ గీతాన్ని ఆలపించనున్న భారత ఆర్మీ

జాతీయ గీతాన్ని ఆలపించనున్న భారత ఆర్మీ

మ్యాచ్ జరగడానికి ముందు భారత ఆర్మీ ఇరు దేశాలకు చెందిన జాతీయ గీతాన్ని తమ బ్యాండ్స్‌తో ఆలపిస్తాయని కూడా తెలిపారు. అంతకముందు ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేస్ ప్రధాని షేక్ హసీనా, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంయుక్తంగా గంట మోగించనున్నారు.

బౌండరీ లైన్ చుట్టూ బండ్లపై

బౌండరీ లైన్ చుట్టూ బండ్లపై

ఆట ప్రారంభమైన తర్వాత 20 నిమిషాల టీ విరామంలో మాజీ కెప్టెన్లు మరియు ఇతర విభాగాలకు చెందిన క్రీడాకారులను బౌండరీ లైన్ చుట్టూ బండ్లపై తిప్పనున్నారు. ఇక, లంచ్ విరామ సమయంలో 'ఫ్యాబులెస్ ఫైవ్'తో ఓ టాక్ షో కూడా ప్లాన్ చేసినట్లు అవిశేక్ దాల్మియా వివరించారు.

'ఫ్యాబులెస్ ఫైవ్'తో చాట్ షో

'ఫ్యాబులెస్ ఫైవ్'తో చాట్ షో

సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్‌లను అభిమానులు ముద్దుగా 'ఫ్యాబులెస్ ఫైవ్' అని పిలుచుకునే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 'ఫ్యాబులెస్ ఫైవ్' క్రికెటర్లు 2001లో ఇదే మైదానంలో ఆస్ట్రేలియాపై సాధించిన చారిత్రక విజయంపై మాట్లాడనున్నారు.

భారత్-బంగ్లా తొలి టెస్టు క్రికెటర్లకు సన్మానం

భారత్-బంగ్లా తొలి టెస్టు క్రికెటర్లకు సన్మానం

'ఫ్యాబులెస్ ఫైవ్' చాట్ షోను మైదానంలో ఏర్పాటు చేసిన పెద్ద స్క్రీన్లపై ప్రత్యేకంగా ప్రదర్శిస్తారు. ఆడియన్స్‌కు వీరి మాటలు స్పష్టంగా వినపడేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అవిశేక్ దాల్మియా తెలిపారు. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఆడిన క్రికెటర్లను సన్మానించనున్నారు.

ఇప్పటికే అమ్ముడుపోయిన మొదటి మూడు రోజుల టికెట్లు

ఇప్పటికే అమ్ముడుపోయిన మొదటి మూడు రోజుల టికెట్లు

ఇదిలా ఉంటే, డే/నైట్ టెస్టుకు సంబంధించిన మొదటి మూడు టికెట్లు ఇప్పటికే అమ్ముడైనట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వెల్లడించిన సంగతి తెలిసిందే. టెస్టు మ్యాచ్‌కు టికెట్లు అమ్ముడు పోవడంతో హ్యాపీగా ఉన్నామని అన్నాడు. "ఆన్‌లైన్‌లో పెట్టిన టికెట్లన్నీ సేల్‌ అయిపోయాయ్‌. కేవలం కోటా టికెట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. దాంతో మేమంతా సంతోషంగా ఉన్నాం" అని దాదా అన్నాడు.

Story first published: Saturday, November 16, 2019, 13:14 [IST]
Other articles published on Nov 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X