న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

6 బంతుల్లో 6 సిక్సర్లు కొడదామనుకున్నా!: చాహల్ టీవీ ఇంటర్యూలో రోహిత్ శర్మ

India vs Bangladesh 2019 : Rohit Sharma Reveals The Secret Of His Ability To Hit Sixes At Will
India vs Bangladesh, 2nd T20I: Rohit Sharma reveals the secret of his ability to hit sixes at will


హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో ఆఫ్ స్పిన్నర్ మొసాదెక్‌ హుస్సేన్‌ ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదాలని తాను అనుకున్నట్లు టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. 154 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చక్కటి శుభారంభాన్నిచ్చారు.

బంగ్లా బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డ రోహిత్‌ శర్మ ఒకానొక దశలో కేవలం సిక్స్‌ల కోసమే ఆడుతున్నట్లు కనిపించాడు. మొసాదెక్‌ హుస్సేన్‌ వేసిన ఇన్నింగ్స్‌ పదో ఓవర్లో తొలి మూడు బంతులను మూడు సిక్సర్లుగా మలిచిన రోహిత్ శర్మ... యువరాజ్‌ ఆరు సిక్సర్లను గుర్తుకు తెచ్చాడు. అయితే, మొసాదెక్‌ దీని నుంచి తప్పించుకున్నాడు.

టీ20ల్లో ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియాటీ20ల్లో ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా

చివరి మూడు బంతుల్లో మూడు పరుగులే

చివరి మూడు బంతుల్లో మూడు పరుగులే

ఆ తర్వాత వేసిన మూడు బంతుల్లో మూడు పరుగులే ఇచ్చాడు. చేధనలో భారత ఓపెనర్లు మరింత దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో పవర్ ప్లేలో 60కిపైగా పరుగులు సాధించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లు ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ20ల్లో నాలుగో సారి ధావన్‌తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

10వ ఓవర్‌లో 21 పరుగులు రాబట్టిన రోహిత్ శర్మ

10వ ఓవర్‌లో 21 పరుగులు రాబట్టిన రోహిత్ శర్మ

రెండో టీ20లో బంగ్లా ఆఫ్ స్పిన్నర్ మొసాదెక్‌ హుస్సేన్‌ వేసిన ఒక ఓవర్‌లోనే రోహిత్ శర్మ 21 పరుగులు రాబట్టాడు. మొదటి ముూడు బంతులను మూడు సిక్సర్లుగా మలిచిన రోహిత్ శర్మ... ఆ తర్వాత మూడు బంతులను సిక్సర్లుగా మలచడంలో విఫలమయ్యాడు. అయితే, మ్యాచ్ అనంతరం చాహల్ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో సిక్సర్లపై రోహిత్ శర్మ స్పందించాడు.

వరుసగా మూడు సిక్సర్లు కొట్టినప్పుడు

"నేను వరుసగా మూడు సిక్సర్లు కొట్టినప్పుడు, నేను ఆరు సిక్సులు బాదడానికి ప్రయత్నించాను. నేను నాలుగో బంతిని మిస్సయినప్పుడు, సింగిల్స్ తీద్దామని నిర్ణయించుకున్నాను. ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ టర్న్ అవడం లేదని నాకు తెలుసు. దీంతో క్రీజులోనే వేచి ఉన్నాను, వాటిని స్టాండ్స్‌లోకి తరలించడానికి ప్రయత్నించాను" అని రోహిత్ శర్మ తెలిపాడు.

వన్డేల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు

వన్డేల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు

దక్షిణాప్రికా మాజీ క్రికెటర్ హర్షలే గిబ్స్ వన్డేల్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సులు బాదిన ఏకైక క్రికెటర్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. అయితే, టీ20ల్లో మాత్రం టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఈ ఘనత సాధించాడు.

సిక్సర్లు బాదాలంటే పెద్ద కండలు అవసరం లేదు

సిక్సర్లు బాదాలంటే పెద్ద కండలు అవసరం లేదు

సిక్సర్లు బాదడానికి శక్తి లేదా పెద్ద కండల కంటే సమయం మరియు ఖచ్చితత్వం ఎంతో ముఖ్యమని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. "భారీ సిక్సర్లు బాదడానికి భారీ శరీరం మరియు పెద్ద పెద్ద కండలు అవసరం లేదు. నువ్వు(చాహల్) కూడా సిక్సర్లు కొట్టవచ్చు. నువ్వు సిక్సర్లు కొట్టడానికి కావాల్సింది శక్తి మాత్రమే కాదు, అలాగే టైమింగ్ కూడా అవసరం. బంతి బ్యాట్‌కు మధ్యలో తగలాలి. అదేవిధంగా మీ తల స్థిరంగా ఉండాలి. మీరు మంచి వికెట్‌పై ఆడుతున్నప్పుడు, మీరు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, సిక్సర్లు సులభంగా కొట్టవచ్చు" అని రోహిత్ తెలిపాడు.

టీ20ల్లో 5వ సెంచరీ మిస్ అయినందుకు నిరాశ

టీ20ల్లో 5వ సెంచరీ మిస్ అయినందుకు నిరాశ

అయితే, రాజ్‌కోట్ మ్యాచ్‌లో తృటిలో తన 5వ సెంచరీ మిస్సైనందుకు చాలా నిరాశ చెందానని రోహిత్ శర్మ ఒప్పుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు సాయంతో 85 పరుగుల వ్యక్తిగత స్కోరు ఔటయ్యాడు. దీనిపై రోహిత్ మాట్లాడుతూ "జట్టుకు మంచి ఆరంభం ముఖ్యం. ఒక బ్యాట్స్ మాన్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం కూడా ముఖ్యం" అని అన్నాడు.

జట్టు ప్రదర్శనపై సంతోషంగా ఉన్నా

జట్టు ప్రదర్శనపై సంతోషంగా ఉన్నా

"ఒక బ్యాట్స్ మాన్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే, జట్టు గెలుస్తుంది, చాలా తరచుగా కాదు. చెత్త షాట్‌తో పెవిలియన్‌కు చేరడంపై నిరాశ చెందాను. అయితే, రాజ్‌కోట్ మ్యాచ్‌లో మేము కొంచెం ఒత్తిడిలో ఉన్నందున జట్టు ప్రదర్శనపై మాత్రం నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని రోహిత్ శర్మ వెల్లడించాడు.

Story first published: Friday, November 8, 2019, 12:52 [IST]
Other articles published on Nov 8, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X