న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ ఓ అద్భుతమైన కెప్టెన్: మిచెల్ స్టార్క్

India vs Australia: Virat Kohli is a fantastic captain, says fast bowler and former IPL teammate Mitchell Starc

మెల్‌బోర్న్‌: టీమిండియా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడి ఓటమికి గురైంది. ఇదిలా ఉంచితే పెర్త్ వేదికగా కోహ్లీని మినహాయించి మిగిలిన బ్యాట్స్‌మెన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో 146పరుగుల తేడాతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. కానీ, రెండో టెస్టులోని తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 123పరుగులు సాధించాడు. ఈ పర్యటనలో కోహ్లీకి ఇదే తొలి సెంచరీ. జట్టు ఫలితాన్ని పట్టించుకోకుండా సర్వత్రా కోహ్లీ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏకంగా ప్రత్యర్థి జట్టు బౌలర్ కూడా కోహ్లీని పొగిడేస్తుండటం విశేషం.

సెంచరీ బాదిన తీరును ప్రశంసిస్తూ

సెంచరీ బాదిన తీరును ప్రశంసిస్తూ

ఈ క్రమంలోనే భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గొప్ప కెప్టెన్ అంటూ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కితాబిచ్చాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో గత వారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో పేస్, బౌన్స్‌కి అతిగా అనుకూలించిన పిచ్‌పై వీరోచిత సెంచరీ బాదిన విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులను గుర్తు చేసుకున్నాడు. ముఖ్యంగా.. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లు హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ వరుసగా కవ్విస్తూ బౌన్సర్లతో పరీక్షించినా కోహ్లీ సహనంతో క్రీజులో నిలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.

చాలా అద్భుతమైన కెప్టెన్

చాలా అద్భుతమైన కెప్టెన్

‘విరాట్ కోహ్లీ చాలా అద్భుతమైన కెప్టెన్. టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు అంచనాలకి తగ్గట్టుగానే ఆడుతోంది. ఇక విరాట్ కోహ్లీతో కలిసి రెండు ఐపీఎల్ సీజన్లు ఆడాను. అతని కెప్టెన్సీ ఆడటంతో ఓ మంచి అనుభూతి' అని మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు.

ముందు బెంగళూరు జట్టుకు ఆడి..

ముందు బెంగళూరు జట్టుకు ఆడి..

2014 ఐపీఎల్‌ సీజన్‌‌లో మిచెల్ స్టార్క్‌ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. ఆ తర్వాత అతను కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి మారాడు. కానీ.. గాయం కారణంగా.. గత ఏడాది ఐపీఎల్‌కి దూరమైన ఈ ఫాస్ట్ బౌలర్.. వచ్చే ఏడాది ప్రపంచకప్‌ కోసం 2019 ఐపీఎల్ సీజన్‌కి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దీంతో.. అతను వేలంలోకి రాలేదు.

సిరీస్ 1-1తో సమమవగా.. బాక్సింగ్ డే టెస్టు

సిరీస్ 1-1తో సమమవగా.. బాక్సింగ్ డే టెస్టు

అయితే.. రెండో టెస్టులో భారత్ జట్టు ఓడటంతో.. నాలుగు టెస్టుల సిరీస్ 1-1తో సమమవగా.. మూడో టెస్టు మ్యాచ్‌ బుధవారం నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగనుంది. ఈ టెస్టులో భారత జట్టు కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. పెర్త్ పిచ్‌ను తయారుచేసిన విధంగానే మెల్‌బౌర్న్ మైదానాన్ని పచ్చికతో సిద్ధం చేసినట్లు క్యూరేటర్ వెల్లడించారు.

Story first published: Monday, December 24, 2018, 15:36 [IST]
Other articles published on Dec 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X