న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ vs డివిలియర్స్: ఒకటే మైదానం.. ఒకేలా షాట్ (వీడియో)

India vs Australia: Virat Kohli and AB de Villiers played same shot in the Sydney cricket ground

సిడ్నీ: ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. మాథ్యూ వెడ్‌ (32 బంతుల్లో 58; 10 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధ శతకంతో చెలరేగగా.. స్టీవ్ స్మిత్‌ (38 బంతుల్లో 46; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో భారత్ 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్ (36 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ చేయగా.. హార్దిక్‌ పాండ్యా (22 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ శుభారంభం ఇచ్చారు. రాహుల్ 30 రన్స్ వద్ద ఔటవగా.. మూడో స్థానంలో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ 24 బంతుల్లోనే 40 పరుగులు చేశాడు. ఆండ్రూ టై వేసిన 15వ ఓవర్లో విరాట్ తన శైలికి భిన్నంమైన షాట్ ఆడాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌ తరచూ ఆడే స్కూప్ షాట్ ఆడాడు. ఆ షాట్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. మోకాలిపై కూర్చొని ఫైన్ లెగ్ దిశగా కోహ్లీ కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. విరాట్ ఆడిన ఈ షాట్ కామెంటేటర్లను ఆశ్చర్యపరిచింది.

అయితే ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లీలు ఇద్దరూ ఒకేలా షాట్ ఆడడమే కాకుండా.. ఒకే మైదానంలో ఆడడం ఇక్కడ విశేషం. ఇదివరకు సిడ్నీ క్రికెట్ మైదానంలోనే వెస్టిండీస్ జట్టుపై డివిలియర్స్ ఫైన్ లెగ్ దిశగా స్కూప్ షాట్ ఆడగా.. తాజాగా ఆస్ట్రేలియాపై విరాట్ అదే షాట్ ఆడాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్, ఏబీ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా.

ఇక మ్యాచ్ అనంతరం ఈ షాట్ గురించి మాట్లాడిన విరాట్ కోహ్లీ.. ఈ రాత్రికి ఏబీ డివిలియర్స్‌కు మేసేజ్ చేసి, అతని రియాక్షన్ ఏంటో తెలుసుకుంటానన్నాడు. 'ఏబీడీలా స్కూప్ షాట్ ఆడిన తర్వాత నేను అలా ఆడుతానని ఆండ్రూ టై ఏమాత్రం ఊహించి ఉండడని హార్దిక్‌తో చెప్పా. అతను కూడా ఏమాత్రం ఊహించలేదని చెప్పాడు. ఈ నైట్ ఈ షాట్ గురించి ఏబీడీకి మెసేజ్ చేస్తా. అతనేం అంటాడో చూస్తా' అని అన్నాడు. ఈ షాట్ ఆడిన విరాట్ కోహ్లీని స్వయంగా ఏబీ డివిలియర్సే మెచ్చుకున్నాడు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సూపర్ ఎమోజీలతో కోహ్లీ సిక్స్ కొట్టిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

India vs Australia: ధోనీ, రైనాను వెనక్కినెట్టిన ధావన్.. మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు!!India vs Australia: ధోనీ, రైనాను వెనక్కినెట్టిన ధావన్.. మూడో బ్యాట్స్‌మన్‌గా రికార్డు!!

Story first published: Monday, December 7, 2020, 11:16 [IST]
Other articles published on Dec 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X