న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నా కోసం వ్యూహాలు రచిస్తున్నందుకు సంతోషం.. ఆసీస్ ప్రణాళికలను తిప్పికొడతా'

 India vs Australia: Shreyas Iyer said Iam happy that Australia coming up with a plan against me

కాన్‌బెర్రా: నా కోసం ఆస్ట్రేలియా వ్యూహాలతో బరిలోకి దిగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు. షార్ట్‌ బాల్స్‌తో ఔట్‌ చేయాలని భావిస్తున్న ఆస్ట్రేలియా ప్రణాళిక తనకి లాభమని చెప్పాడు. ఫీల్డర్లను దగ్గరగా ఉంచి సంధించే బౌన్సర్లకు ఎదురుదాడికి దిగితే పరుగులు సాధించవచ్చని చెప్పుకొచ్చాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ ఓటిమిపాలైన భారత్‌.. మరో మ్యాచ్‌ మిగిలుండగానే వన్డే సిరీస్‌ను 2-0తో కోల్పోయింది. ఇక నామమాత్రమైన చివరి వన్డే బుధవారం ఉదయం 9:10 గంటలకు ప్రారంభం కానుంది.

 సవాలుగా తీసుకుంటున్నా:

సవాలుగా తీసుకుంటున్నా:

మూడో వన్డేకు ముందు శ్రేయస్‌ అయ్యర్‌ మీడియాతో మాట్లాడుతూ... 'ఆస్ట్రేలియా నా కోసం వ్యూహాలతో బరిలోకి దిగుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే వారి ప్రణాళికలను సవాలుగా తీసుకుంటున్నా. ఒత్తిడిలో మరింత ప్రేరణతో గొప్పగా ఆడటానికి ప్రయత్నిస్తా. షార్ట్‌ లెగ్‌, గల్లీలో ఫీల్డర్లు ఉండటం ఎక్కువ పరుగులు సాధించడానికి వీలు ఉంటుంది. అయితే క్రీజులోకి వచ్చిన తర్వాత మొదట కుదురుకోవడానికి ప్రయత్నిస్తా. షార్ట్‌ బాల్స్‌ వేస్తే దూకుడుగా ఆడాలనుకుంటా. ఎందుకంటే ఆ సమయంలో ఉన్న ఫీల్డింగ్..‌ షాట్లకు అనుకూలంగా ఉంటుంది' అని తెలిపాడు.

 షాట్‌ను ఎంచుకునే సరికి ఆలస్యమైంది:

షాట్‌ను ఎంచుకునే సరికి ఆలస్యమైంది:

తొలి మ్యాచ్‌లో జోష్ హేజిల్‌వుడ్ వేసిన బౌన్సర్‌ను పేలవమైన షాట్‌ ఆడి ఔటవ్వడంపై శ్రేయస్‌ అయ్యర్ స్పందించాడు. 'నాకు షార్ట్ ‌బాల్‌ వేస్తారని తెలుసు. అయితే ఆ సమయంలో నా మదిలో రెండు రకాల ఆలోచనలు ఉన్నాయి. పుల్‌ షాట్‌ లేదా అప్పర్‌ కట్ ఆడాలనుకున్నా. కానీ ఓ షాట్‌ను ఎంచుకునే సరికి ఆలస్యమైంది. దాంతో సమర్థవంతంగా ఆడలేకపోయా' అని అన్నాడు. రెండు వన్డేలలో శ్రేయస్‌ 40 పరుగులే చేశాడు. తొలి వన్డేలో పేలవమైన షాట్ ఆడి రెండు పరుగులకే పెవిలియన్‌ చేరగా,.. రెండో మ్యాచ్‌లో స్మిత్ అద్భుతమైన క్యాచ్‌ అందుకోవడంతో 38 రన్స్ వద్ద వెనుదిరిగాడు.

 ఇబ్బందులు తలెత్తాయి:

ఇబ్బందులు తలెత్తాయి:

సిడ్నీ పిచ్‌తో పోలిస్తే ప్రాక్టీస్‌ చేసిన పిచ్‌ల బౌన్స్‌ వేరుగా ఉండటంతో పరిస్థితులకు అలవాటు పడటానికి సమయం పట్టిందని టీమిండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్ తెలిపాడు. గత రెండు నెలలు ఐపీఎల్‌ 2020 ఆడటంతో టీ20 ఫార్మాట్‌ నుంచి వన్డేల‌కు తగ్గట్లుగా మారడానికి కాస్త ఇబ్బందులు తలెత్తాయని చెప్పాడు. ఇక మూడో వన్డే మ్యాచ్‌లో బలంగా పుంజుకుని బరిలోకి దిగుతామని శ్రేయస్‌ చెప్పాడు. ఐపీఎల్‌ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున శ్రేయస్‌ కెప్టెన్, బ్యాట్స్‌మన్‌గా రాణించిన విషయం తెలిసిందే. తన అద్భుత సారథ్యంతో ఢిల్లీని ఫైనల్స్ చేర్చాడు.

ISL 2020-21: ముంబై సిటీ vs ఎస్సీ ఈస్ట్ బెంగాల్.. తుది జట్లు ఇవే!!

Story first published: Tuesday, December 1, 2020, 19:53 [IST]
Other articles published on Dec 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X