న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పంత్, శంకర్ ప్రదర్శన నన్ను నిరాశపరిచింది'

India vs Australia 2019 : Sanjay Manjrekar Disappointed With Vjay Shankar,Rishabh Pant | Oneindia
India vs Australia: Sanjay Manjrekar slams Vijay Shankar, warns Virat Kohli & Co about World Cup chances

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో బుధవారం ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో భారత యువ క్రికెటర్లు రిషభ్‌ పంత్‌, విజయ్‌ శంకర్‌లు చాలా నిరాశపరిచారని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. వరల్డ్‌కప్ ముంగిట సత్తా నిరూపించుకునే అవకాశం లభించినా ఈ ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారని విమర్శించాడు.

ఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా సౌరవ్ గంగూలీఐపీఎల్ 2019: ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా సౌరవ్ గంగూలీ

విజయ్ శంకర్ ఒక వన్డే మినహా బౌలింగ్, బ్యాటింగ్‌లో తేలిపోగా.. చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్‌గా ధోని స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ అనవసర తప్పిదాలతో భారత ఓటమికే కారణమయ్యాడు. వీరిద్దరూ ఘోరంగా వైఫల్యం కారణంగానే మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కూడా కోల్పోయింది.

రిషబ్ పంత్, విజయ్ శంకర్ ప్రదర్శనపై

ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ "రిషబ్ పంత్, విజయ్ శంకర్ ప్రదర్శన నన్ను నిరాశపరిచింది. సత్తా నిరూపించుకునేందుకు వారికి అద్భుతమైన అవకాశం దక్కింది. అయినా దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. కనీసం విజయ్ శంకర్ బ్యాట్‌తోనైనా ఫర్వాలేదనిపించాడు. పంత్‌ అది కూడా లేదు" అని అన్నాడు.

గాల్లోకి భారీ షాట్లు కొట్టాల్సిన అవసరం లేదు

"విజయ్‌ శంకర్‌, పంత్‌లు భారీ షాట్లు ఆడవచ్చు. అందుకు గాల్లోకి భారీ షాట్లు కొట్టాల్సిన అవసరం లేదు. హిట్టింగ్‌నే ఎక్కువగా ఆశ్రయించకుండా.. మైదానం నలువైపులా బంతిని తరలిస్తూ పరుగులు రాబట్టడమెలాగో? కెప్టెన్ విరాట్ కోహ్లీని చూసి వారు నేర్చుకోవాలి. వరల్డ్ కప్‌లో మిడిలార్డర్ ఎంతో కీలకం" అని చెప్పుకొచ్చాడు.

సమస్య ఏదైనా ఉంటే అది మిడిలార్డర్

"వరల్డ్‌కప్‌ ముందు భారత జట్టులో కొట్టిచ్చినట్లు కనబడిన సమస్య ఏదైనా ఉంటే అది మిడిలార్డర్. టీమిండియా అక్కడ ఎక్కువ దృష్టి సారించాలి. మరోవైపు ఈ సిరీస్‌లో ఆద్యంతం ఆకట్టుకున్న ఆసీస్‌కు సిరీస్‌ గెలవడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. వారు భారత్‌కు ఎందుకొచ్చారో అది చేసి చూపించారు" అని మంజ్రేకర్ అన్నాడు.

Story first published: Thursday, March 14, 2019, 15:20 [IST]
Other articles published on Mar 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X