న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్ కోహ్లీపై విమర్శలు: షోయబ్ అక్తర్ ఏమన్నాడంటే!

Shoaib Akhtar Defends Virat Kohli For On-Field ‘Aggression’ | Oneindia Telugu
India vs Australia: ‘Please cut him some slack’ - Shoaib Akhtar defends Virat Kohli

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తపై ఇప్పటికే పలువురు ఆసీస్ మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలవగా, మరికొందరు విమర్శించిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం రెండో టెస్టులో కోహ్లీ, పైన్‌ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకోవడమే.

ఈడెన్‌లో లక్ష్మణ్‌ చేసిన 281 ఇన్నింగ్స్‌ అత్యుత్తమ ఇన్నింగ్స్: ద్రవిడ్ఈడెన్‌లో లక్ష్మణ్‌ చేసిన 281 ఇన్నింగ్స్‌ అత్యుత్తమ ఇన్నింగ్స్: ద్రవిడ్

ఈ మాటల యుద్ధంపై ఆసీస్‌ మాజీ క్రికెటర్లు కోహ్లీ తీరుని తప్పుబట్టారు. దీనిపై తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ట్విట్టర్‌లో "విరాట్‌ కోహ్లీ ఈ తరం క్రికెట్‌లో దిగ్గజం. హోరాహోరీ పోటీ ఉన్న క్రికెట్‌లో దూకుడనేది ఒక భాగం. పరిమితుల్లో ఉన్నంత వరకు ఏం చేసినా ఫర్వాలేదు. దయచేసి కోహ్లీని వదిలేయండి" అని అక్తర్‌ ట్వీట్‌ చేశాడు.

ప్రతి మ్యాచ్‌ గెలవాలనుకునే టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ 'ఉద్రేకపూర్వక వైఖరి' మంచిదేనని ఆస్ట్రేలియా మాజీ కోచ్‌ డారెన్‌ లెమన్‌ అన్నారు. మైదానంలో అతడి ప్రవర్తన తప్పుగా లేదని పేర్కొన్నాడు. "కోహ్లీ అభిరుచి గల క్రికెటర్‌. మైదానంలో అతడి నుంచి బహిర్గతమయ్యేది అదే. అతడిది ఉద్రేక వైఖరి. సవాళ్లు విసిరేవారిని విరాట్‌ ఆస్వాదిస్తాడు. గెలవాలని తపనపడతాడు. కేవలం అతడి కోసమే కాదు దేశం కోసం విజయం సాధించాలని గాఢంగా కోరుకుంటాడు. పైన్‌, కోహ్లీ ఘర్షణ బాగుంది. ఇది క్రీడా స్ఫూర్తితోనే జరిగింది. వీరిద్దరిలో ఎవరూ గీత దాటలేదు. వీరి మాటలు స్టంప్‌మైక్‌ల ద్వారా నవ్వు తెప్పించాయి" అని అన్నాడు.

ఆస్ట్రేలియా ప్రస్తుత కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ సైతం కోహ్లీ సైతం ఇలాగే వ్యాఖ్యానించాడు. ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ దిగ్గజం డెన్నిస్‌ లిల్లీ సైతం మోడ్రన్ డే దిగ్గజాల్లో విరాట్‌ కోహ్లీ ఒకడని, అతని గురించి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరమేమీ లేదని అన్నాడు. లిల్లీ మాట్లాడుతూ ''విరాట్‌ కోహ్లీ గొప్ప ఆటగాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇది అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు" అని అన్నాడు.

"మ్యాచ్‌లో అతడు అనుసరించే వ్యూహాలు ఎంతో బాగుంటాయి. నేను చూసిన వాళ్లలో కోహ్లీ ఓ గొప్ప క్రికెటర్‌. ఎటువంటి బౌలింగ్‌నైనా అతడు సమర్థంగా ఎదుర్కోగలడు. కోహ్లీ టెక్నిక్‌, నియంత్రణ, డెలివరీలను ఎదుర్కోవడానికి పొందే సమయం అతణ్ని గొప్ప ఆటగాణ్ని చేస్తున్నాయి" అని డెన్నిస్ లిల్లీ చెప్పాడు. ఇక, టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా సైతం ఆసీస్‌ మీడియా కోహ్లీని విలన్‌గా చిత్రీకరించేందకు ప్రయత్నిస్తోందని విమర్శించాడు.

మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్‌ బోర్డర్‌ మాట్లాడుతూ "ప్రస్తుతం క్రికెట్‌లో కోహ్లీ లాంటి వ్యక్తిత్వం ఉన్న ఆటగాళ్లు కనిపించడం లేదు. వృత్తిపరంగా ఉన్నత స్థానంలో ఉండాలనే పట్టుదలతో అలా అనిపిస్తోంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ వికెట్‌ తీసినపుడు కోహ్లీలా సంబరాలు చేసుకునే కెప్టెన్‌ను ఇంతవరకూ చూడలేదు. చూడడానికి అతిగా అనిపించినా అది చాలా మంచి విషయం. అలా చేయడం ఆటపై అతనికి ఉన్న అంకితభావం కనిపిస్తోంది. విదేశీ సిరీస్‌ సొంతం చేసుకొని టెస్టుల్లో నంబర్‌వన్‌ ర్యాంకుకు పూర్తి న్యాయం చేయాలని కోహ్లీ గట్టి పట్టుదలతో ఉన్నాడు" అని అన్న సంగతి తెలిసిందే.

Story first published: Friday, December 21, 2018, 20:55 [IST]
Other articles published on Dec 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X