న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాఫ్ సెంచరీతో సిడ్నీ టెస్టులో మయాంక్ అరుదైన ఘనత

India vs Australia: Mayank Agarwal joins Sunil Gavaskar, Prithvi Shaw in elite list

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి టెస్టులో యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరిస్‌లో మెల్ బోర్న్‌లో జరిగిన మూడో టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన మయాంక్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి (76,42) 118 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

జట్టులోకి రాకుండా అఫ్రీదినే ఆపేశాడంటున్న పాక్ మాజీ కెప్టెన్జట్టులోకి రాకుండా అఫ్రీదినే ఆపేశాడంటున్న పాక్ మాజీ కెప్టెన్

దీంతో విదేశీ గడ్డపై అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత్‌ ఆటగాడిగా నిలిచాడు. గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మాయంక్‌ అగర్వాల్‌(77; 112 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కటి ఆరంభాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్ విఫలమయ్యాడు.

1
43626
మయాంక్ హాఫ్ సెంచరీ

మయాంక్ హాఫ్ సెంచరీ

సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించడంతో... తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన మూడో భారత ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు ఈ జాబితాలో సునీల్‌ గావస్కర్‌, పృథ్వీషాలు ఉండగా, ఇప్పుడు వారి సరసన మయాంక్‌ నిలిచాడు.

ఎనిమిదో భారత ఓపెనర్‌గా

మరొవైపు ఆస్ట్రేలియాలో కనీసం రెండు హాఫ్‌ సెంచరీలు నమోదు చేసిన ఎనిమిదో భారత ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ అరుదైన గుర్తింపుని సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగగా ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాలు క్రీజులోకి వచ్చారు. కేఎల్ రాహుల్‌(9) పరుగుల వద్ద హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో షాన్‌ మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

క్రీజులోకి వచ్చిన పుజారాతో

క్రీజులోకి వచ్చిన పుజారాతో

అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత నాథన్ లియాన్ బౌలింగ్‌లో మయాంక్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ, పుజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కబెట్టాడు.

టెస్టుల్లో పుజారాకు 18వ సెంచరీ

ఈ సిరిస్‌లో పుజారా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొంటూ సెంచరీ పూర్తి సాధించాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 18వ సెంచరీ కాగా ఈ సిరిస్‌లో మూడోది. స్టార్క్‌ బౌలింగ్‌లో బంతిని బౌండరీకి పంపడంతో పుజారా 100 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం భారత్‌ 76 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది.

Story first published: Thursday, January 3, 2019, 12:27 [IST]
Other articles published on Jan 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X