న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నాలుగేళ్లలో కోహ్లీ చాలా మారాడు'

 India vs Australia: Coach Ravi Shastri says critics should stop picking on Virat Kohli and Co for poor overseas record

హైదరాబాద్: నాలుగేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీతో పోలిస్తే.. ప్రస్తుతం అతనిలో ఎంతో పరిణతి కనిపిస్తోందని భారత్‌ క్రికెట్‌ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. దాదాపు రెండు నెలల సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా, నవంబరు 21 నుంచి ఆ గడ్డపై 3 టీ20లు, 4 టెస్టులు, 3 వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని ఆడనుంది. ఈ నేపథ్యంలో.. కోహ్లీ ఆట, వ్యవహారశైలి గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

ఈ క్రమంలో ఆసీస్‌ పర్యటనకు వెళ్లే ముందు కోహ్లీ.. విలేకర్ల సమావేశంలో 'కెరీర్‌ ఆరంభంతో పోల్చుకుంటే ఒక క్రికెటర్‌గా తాను ఎంతో పరిణతి సాధించానని.. ఉద్వేగం తెచ్చుకోకుండా ఆడగలను' అని పేర్కొన్నాడు. తాజాగా గబ్బాలో టీమిండియా తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా కోచ్‌ రవిశాస్త్రి ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.

నాలుగేళ్ల క్రితం‌తో పోలిస్తే కోహ్లీలో పరిణతి

నాలుగేళ్ల క్రితం‌తో పోలిస్తే కోహ్లీలో పరిణతి

‘నాలుగేళ్ల క్రితం‌ ఆస్ట్రేలియా పర్యటనతో పోలిస్తే కోహ్లీలో ఇప్పుడు పరిణతి కనిపిస్తోంది. అతను పూర్తిగా ప్రొఫెషనల్ అయిపోయాడు. ముఖ్యంగా.. జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న తర్వాత.. సైలెంట్‌‌గా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. విరాట్ కోహ్లీ ఆటకి ఆసీస్ పిచ్‌లు బాగా నప్పుతాయి. అందుకే.. ఆస్ట్రేలియా పర్యటనని అతను ఎక్కువగా ఇష్టపడతాడు. అయితే.. ఇక్కడి అభిమానుల్ని మెప్పించడం చాలా కష్టం. కాబట్టి.. భారత్ జట్టుకి ఇదో సవాల్' అని రవిశాస్త్రి వెల్లడించాడు.

కోహ్లీ బ్యాటింగ్‌ శైలికి ఆసీస్ పిచ్‌లు సరిగ్గా

కోహ్లీ బ్యాటింగ్‌ శైలికి ఆసీస్ పిచ్‌లు సరిగ్గా

మరోవైపు ఆస్ట్రేలియాలో ఆడటానికే కోహ్లీ ఎక్కువగా ఇష్టపడతాడని ఆయన‌ పేర్కొన్నాడు. దీని గురించి మాట్లాడుతూ.. ‘అతని బ్యాటింగ్‌ శైలికి ఇక్కడి పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. అందుకే ఇక్కడ ఆడటానికే అమితంగా ఆసక్తి చూపుతాడు. కానీ, ఈ పిచ్‌లపై ఎంత బాగా ఆడినా.. ఇక్కడి అభిమానుల్ని అంత తొందరగా మెప్పించడమనేది సవాలుతో కూడుకున్న పనే' అని భారత కోచ్‌ తెలిపాడు.

సిరీస్‌లో మాకు బాగా కలిసొచ్చే అంశం.

సిరీస్‌లో మాకు బాగా కలిసొచ్చే అంశం.

‘ఈ ఏడాదిలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ పర్యటనతో పాటు నాలుగేళ్ల క్రితం ఆసీస్‌ పర్యటనలో ఎదురైన ఓటముల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. దీనికితోడు కోహ్లీ, రహానె, మురళీ విజయ్‌, అశ్విన్‌కు ఇక్కడ ఆడిన అనుభవం ఉండటం సిరీస్‌లో మాకు బాగా కలిసొచ్చే అంశం. గతంలో చేసిన తప్పులను అధిగమించిన వీరు.. చక్కటి ప్రదర్శనతో ఆసీస్‌ గడ్డపై టెస్టుల్లో తొలి సిరీస్‌ విజయాన్ని నమోదుచేస్తారు' అని రవిశాస్త్రి విశ్వాసం వ్యక్తం చేశాడు.

బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని

బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని

2012 ఆస్ట్రేలియా పర్యటనలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీని ఆసీస్ ఫ్యాన్స్ గేలిచేయగా.. అతను అసభ్యకరంగా మధ్య వేలు చూపించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 2014 పర్యటనలోనూ మిచెల్ జాన్సన్‌ కవ్వింపులకి బ్యాట్‌తో సమాధానం చెప్పిన విరాట్ కోహ్లీ.. టెస్టు సిరీస్‌లో ఏకంగా నాలుగు శతకాలు, ఒక హాఫ్ సెంచరీ బాది మొత్తం 692 పరుగులు సాధించాడు. ఈ పర్యటనలోనే మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్సీతో పాటు టెస్టు జట్టు పగ్గాలనీ వదిలేసిన విషయం తెలిసిందే.

Story first published: Sunday, November 18, 2018, 15:47 [IST]
Other articles published on Nov 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X