న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ చేతిలో రో'హిట్'.. మరోసారి హాంఫట్!!

India vs Australia: Careless Rohit Sharma fails the test, yet again

న్యూ ఢిల్లీ: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో పరవాలేదనిపిస్తున్న రోహిత్ టెస్టుల్లో మరోసారి ఫెయిలైయ్యాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచ్‌లో వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ పేలవ షాట్‌ సెలక్షన్‌తో ఔటయ్యాడు. దాదాపు 10 నెలల తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు రోహిత్. ఈ హిట్టర్‌ను తీసుకునే యోచనలో ఫామ్‌లో ఉన్న హనుమ విహారిని సైతం పక్కన పెట్టి ఈ టెస్టులోకి అవకాశమిచ్చారు.

 రోహిత్ కంటే మెరుగ్గా పూజారా మాత్రమే

రోహిత్ కంటే మెరుగ్గా పూజారా మాత్రమే

కానీ, రోహిత్ పేలవంగా ప్రదర్శన చేస్తూ జట్టులో స్థానాన్ని మళ్లీ ప్రశ్నార్థకం చేసుకున్నాడు. గురువారం ఆరంభమైన తొలి టెస్టు.. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రోహిత్ శర్మ 61 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 37 పరుగులు చేశాడు. వాస్తవానికి రాహుల్ (2), మురళీ విజయ్ (11), విరాట్ కోహ్లి (3), అజింక్య రహానె (13)తో పోలిస్తే ఇది మెరుగైన స్కోరే. జట్టులో రోహిత్ కంటే మెరుగ్గా పూజారా మాత్రమే మెరుగైన స్కోరు చేశాడు.

ఔటైన తీరుపై విమర్శల అసహనం

ఔటైన తీరుపై విమర్శల అసహనం

కానీ, చాలా కాలం తర్వాత టెస్టుల్లోకి రావడం పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మెరుగ్గా రాణిస్తుండటంతో రోహిత్‌నే టార్గెట్ చేశారు విమర్శకులు. శర్మ ఔటైన తీరు తీవ్ర విమర్శలు తావిస్తోంది. సహనంతో క్రీజులో పరుగుల వేట ఆరంభించి కాసేపట్లోనే పూర్తిగా వన్డే ఫార్మాట్‌లోకి మారిపోయిన రోహిత్ శర్మ.. వరుస సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నిస్తూ ఔటవుతున్నాడు.

రోహిత్.. సిక్స్ కోసం ప్రయత్నించి ఔటవడం

గురువారం ఇన్నింగ్స్‌లో బంతి పాతబడి.. పరుగులకి అవకాశం ఉన్న దశలో స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టేందుకు రోహిత్ ప్రయత్నించగా.. అది బౌండరీ లైన్‌కి సమీపంలోని ఫీల్డర్ చేతుల్లో పడింది. కానీ.. క్యాచ్ అందుకున్న ఫీల్డర్ తనని తాను నియంత్రించుకోలేక బౌండరీ లైన్‌‌లోకి వెళ్లిపోయాడు. కానీ.. తర్వాత బంతికే మళ్లీ రోహిత్ సిక్స్ కోసం ప్రయత్నించి ఔటవడం అతడి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.

ఈ సారి 6 బంతుల్లో 1 పరుగుకే

మరోసారి స్పిన్నర్ నాథన్ లయన్ బౌలింగ్‌లోనే రెండో ఇన్నింగ్స్‌లోనూ రోహిత్ శర్మ పేలవ షాట్ సెలక్షన్‌తో ఔటయ్యాడు. అప్పటికే భారత్ జట్టు 249 పరుగుల ఆధిక్యంతో మెరుగైన స్థితిలో ఉన్నా ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మరీ రక్షణాత్మకంగా డిఫెన్స్ చేస్తూ ఔటయ్యాడు. దీంతో.. 6 బంతుల్లో 1 పరుగుకే పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.

Story first published: Sunday, December 9, 2018, 10:54 [IST]
Other articles published on Dec 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X