న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోని ఎలా చాచాడబ్బా!: సోషల్ మీడియాలో వైరల్ అయిన బీసీసీఐ ట్వీట్

MS Dhoni Stretches 2.14 Metres To Foil Handscomb Stumping Attempt | Oneindia Telugu
India Vs Australia: BCCI hails flexible MS Dhoni for his 2.14m long stretch on the pitch - Watch

హైదరాబాద్: 37 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌ విషయంలో యువ ఆటగాళ్లతో పోటీ పడుతుంటాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో రెండు టీ20ల సిరిస్‌ను 0-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

స్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్‌: రెండో టీ20 ఓటమిపై విరాట్ కోహ్లీస్వదేశంలో ఓడిపోయిన తొలి సిరీస్‌: రెండో టీ20 ఓటమిపై విరాట్ కోహ్లీ

అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించి బీసీసీఐ చేసిన ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. అది కూడా ధోనిది కావడంతో అభిమానులు ఆ వీడియో తెగ షేర్ చేసుకుంటున్నారు. భారత ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ బౌలర్‌ ఆడమ్ జంపా వేసిన 11వ ఓవర్‌లో ధోని ముందుకొచ్చి భారీ షాట్‌ ఆడబోయాడు. వెంటనే కీపర్‌ పీటర్‌ హ్యాండ్స్‌ కోంబ్‌ బంతిని అందుకొని వికెట్లను కొట్టేశాడు.

ఆసీస్ వికెట్ కీపర్ తనను స్టంపౌట్ చేయబోతున్నాడని

ఆసీస్ వికెట్ కీపర్ తనను స్టంపౌట్ చేయబోతున్నాడని

అయితే, ఆసీస్ వికెట్ కీపర్ తనను స్టంపౌట్ చేయబోతున్నాడని గమనించిన ధోని ఏకంగా 2.4 మీటర్లు కాలు చాచి పిచ్‌లో పెట్టాడు. దీంతో ఫీల్డ్ అంఫైర్ థర్డ్ అంఫైర్‌కు నివేదించినప్పటికీ... రివ్యూలో నాటౌట్‌గా తేలింది. ఇందుకు సంబంధించిన ఫోటోని ధోని తన ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ "ధోని ఎలా చాచాడబ్బా!" అంటూ కామెంట్ పెట్టింది.

కోహ్లీతో కలిసి 100 పరుగుల భాగస్వామ్యం

దీంతో "అతని కాళ్లు ఎలాస్టిక్‌ ఏమో!.. ఏం ఫిట్‌నెస్‌ అయ్యా ధోని" అంటూ అభిమానులు ఆ ఫోటో కింద కామెంట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ధోని దాటిగా ఆడి 23 బంతుల్లో 40 పరుగులు చేశాడు. కోహ్లీతో కలిసి నాలుగో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ధోని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.

మూడు ఫార్మాట్లలో 350 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా

మూడు ఫార్మాట్లలో 350 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా

భారత్ తరుపున మూడు ఫార్మాట్లలో 350 సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా ధోని అరుదైన గుర్తింపు పొందాడు. ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధోనీ ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. డీ ఆర్సీ షార్ట్ వేసిన తర్వాతి ఓవర్లో మోకాళ్ల మీద నిలబడి మరీ ధోని భారీ సిక్స్ బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్స్‌లు కొట్టిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు.

పవర్‌ప్లేలో 53 పరుగులు రాబట్టిన టీమిండియా

పవర్‌ప్లేలో 53 పరుగులు రాబట్టిన టీమిండియా

తొలి నాలుగు ఓవర్లలో మూడు ఫోర్లే వచ్చినా.. ఐదో ఓవర్‌లో రాహుల్ జోరు చూపెట్టాడు. రిచర్డ్‌సన్ వరుస బంతులను రెండు సిక్సర్లుగా మిలిచాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కమిన్స్‌ను కూడా మిడ్‌వికెట్, బ్యాక్‌వర్డ్ స్కేర్ లెగ్‌లో రెండు సిక్సర్లు బాదాడు. దీంతో పవర్‌ప్లేలో టీమిండియా 53 పరుగులు చేసింది. ఆ తర్వాత కౌల్టర్-నైల్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన రాహుల్ నేరుగా థర్డ్‌మ్యాన్‌లో రిచర్డ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఫలితంగా తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.

మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచిన ధోని

మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచిన ధోని

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ.... మరో ఓపెనర్ ధావన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, 10వ ఓవర్‌లో ధావన్... 11వ ఓవర్‌లో రిషబ్ (1) చెత్త షాట్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. కేవలం 10 బంతుల తేడాలో ఈ ఇద్దరూ ఔట్‌కావడంతో భారత్ 74 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనితో కలిసి కోహ్లీ ఆసీస్ బౌలర్లను చితక్కొట్టారు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి టీ20లో నెమ్మదిగా ఆడాడని విమర్శలు ఎదుర్కొంటున్న ధోని షార్ట్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్‌తో ఖాతా తెరిచాడు.

29 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ

29 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ

వేగంగా స్ట్రయిక్‌ను రొటేట్ చేసిన కోహ్లీ 16వ ఓవర్లో వరుసగా 6, 6, 6తో 22 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో 20వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. 18వ ఓవర్‌లో ధోనీ.. 6, 6, 4తో 19 పరుగులు రాబట్టాడు. 19వ ఓవర్‌లో కోహ్లీ సిక్స్, ఫోర్ బాదినా.. ఆఖరి ఓవర్‌లో ధోని ఔటయ్యాడు. ఈ ఇద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 50 బంతుల్లోనే 100 పరుగులు జతయ్యాయి. తర్వాత కార్తీక్ (8 నాటౌట్) రెండు ఫోర్లు బాదగా.. ఆఖరి బంతిని కోహ్లీ సూపర్ సిక్స్‌తో ముగించాడు. దీంతో చివరి 9 ఓవర్లలో 116 పరుగులు వచ్చాయి.

Story first published: Friday, March 1, 2019, 9:47 [IST]
Other articles published on Mar 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X