న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఏడేళ్ల చిన్నారితో బాక్సింగ్ డే టెస్టుకు సిద్ధమైన క్రికెట్ ఆస్ట్రేలియా

India Vs Australia: 7-year-old Archie Schiller to co-captain Australia in Boxing Day Test at MCG

మెల్‌బోర్న్‌: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న 'బాక్సింగ్‌ డే' టెస్టుకు ముందు క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ఓ భావోద్వేగ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్‌ కోసం ఆసీస్‌ జట్టులో 7 ఏళ్ల చిన్నారిని ఎంపిక చేసింది. డిసెంబరు 26 నుంచి మెల్‌బోర్న్‌లో భారత్‌తో జరిగే బాక్సింగ్‌ డే టెస్ట్‌లో తలపడే ఆసీస్‌ జట్టులో ఆర్చికి 15వ ఆటగాడిగా స్థానం కల్పించారు. జట్టులో అతడికి చోటు కల్పించడంతో పాటు కో-కెప్టెన్‌గా కూడా నియమించింది. హృద్రోగంతో బాధపడుతున్న ఆర్కీ షిల్లర్‌ అనే చిన్నారి కోరిక తీర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఏ ప్రకటించింది. లెగ్‌స్పిన్నరైన ఆర్చీ మిగతా ఆటగాళ్లతో పాటే సాధన చేస్తున్నాడు. ఏడేళ్ల పిల్లాడికి ఆస్ట్రేలియా జట్టులో స్థానమేంటని ఎవ్వరికైనా సందేహం కలుగుతుంది.

లోపంతో బాధపడుతుండటం వల్లే

దాంతో.. ఇప్పటికే క్రిస్మ స్‌ సంబరాల్లో మునిగి తేలుతున్న షిల్లెర్‌ కుటుంబం ఈ వార్తతో ఉబ్బితబ్బిబవుతోంది. ఆర్చికి క్రికెట్‌ అంటే ప్రాణం. అయితే అతడికి మూడు నెలల ప్రాయంలోనే గుండె కవాటాలలో లోపం ఉందని తేలింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ అతడికి పలు గుండె ఆపరేషన్లు జరిగాయి. తాజాగా కూడా ఓ ఆపరేషన్‌ జరిగింది. క్రికెట్‌కు ప్రాణమిచ్చే షిల్లెర్‌.. అనారోగ్యం కారణంగా అందరిలా క్రికెట్‌ ఆడలేడు. కానీ క్రికెటర్‌ కావాలని, ఆసీస్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతోపాటు కెప్టెన్‌ కావాలన్నది అతడి స్వప్నం.

‘మేక్‌ ఏ విష్‌' ఆస్ట్రేలియా ఫౌండేషన్‌ ద్వారా

‘మేక్‌ ఏ విష్‌' ఆస్ట్రేలియా ఫౌండేషన్‌ ద్వారా

ఆర్చీ ఆరోగ్య పరిస్థితి, క్రికెట్‌పట్ల అతడికి గల పిచ్చి అభిమానానికి ఆస్ట్రేలియా క్రికెట్ దిగి వచ్చింది. అతనికి ఏడో పుట్టిన రోజు సందర్భంగా ‘మేక్‌ ఏ విష్‌' ఆస్ట్రేలియా ఫౌండేషన్‌ ద్వారా మరపురాని బహుమతినిచ్చింది. ఆ సందర్భంగానే ఆసీస్‌ కెప్టెన్‌ పైన్‌.. అతడికి ఫోన్‌ చేసి సహ నాయకత్వం విషయం చెప్పాడు. ఆర్చీ అడిలైడ్‌ టెస్టుకు ముందు కూడా ఆసీస్‌ ఆటగాళ్లతో కలిసి సాధన చేశాడు. నాథన్‌ లయన్‌ అంటే అతడికి చాలా ఇష్టమట. టిమ్‌ పైన్‌, కోహ్లితో కలిసి ఆదివారం ఓ కార్యక్రమంలో కూడా పాల్గొన్నాడు.

లెగ్‌ స్పిన్‌‌తో విరాట్‌ కోహ్లీని అవుట్‌ చేస్తా

లెగ్‌ స్పిన్‌‌తో విరాట్‌ కోహ్లీని అవుట్‌ చేస్తా

ఆర్చీకి జట్టులో స్థానం కల్పించిన విషయాన్ని ఆస్ట్రేలియా హెడ్‌ కోచ్‌ జస్టిస్‌ లాంగర్‌ స్వయంగా ఫోన్‌లో తెలిపినప్పుడు అతడి సంతోషానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఆ ఉత్సాహంలో ఆర్చి.. తన లెగ్‌ స్పిన్‌ మాయాజాలంతో విరాట్‌ కోహ్లీని అవుట్‌ చేస్తా అని లాంగర్‌తో చెప్పాడట. ఈ సందర్భంగా ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆసీస్‌, భారత్‌ కెప్టెన్లు టిమ్‌ పైన్‌, కోహ్లీతో కలిసి టెస్ట్‌ సిరీస్‌ ట్రోఫీని పట్టుకొని ఆర్చి మీడియాకు పోజులిచ్చాడు. ఆ తర్వాత ఆస్ర్టేలియా జట్టుతో కలిసి మెల్‌బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ మైదానంలో ప్రాక్టీస్‌ కూడా చేశాడు.

Story first published: Monday, December 24, 2018, 11:10 [IST]
Other articles published on Dec 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X