న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రిస్బేన్‌లో తొలి టీ20: ఫించ్ క్యాచ్‌ని జారవిడిచిన కోహ్లీ (వీడియో)

India Vs Australia 1st T20I, Live Updates: Virat Kohli misses aaron finch catch

హైదరాబాద్: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఇచ్చిన సింపుల్ క్యాచ్‌ని విరాట్ కోహ్లీ జారవిడిచాడు. జస్ప్రీత్ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతిని ఆరోన్ ఫించ్ ఆఫ్ సైడ్ స్టంప్ మీదుగా గాల్లోకి లేపాడు.

దీంతో బంతి నేరుగా అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ చేతుల్లోకి వెళ్లింది. అయితే, కోహ్లీ దానిని ఒడిసిపట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో తనకు వచ్చిన లైఫ్‌తో ఆరోన్ ఫించ్ చెలరేగుతున్నాడు. మరోవైపు భారత బౌలర్లు నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు.

1
43620
5 ఓవర్లకు ఆస్ట్రేలియా 31/5

5 ఓవర్లకు ఆస్ట్రేలియా 31/5

ప్రస్తుతం 5 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది. క్రీజులో ఆరోన్ ఫించ్(19), క్రిస్ లిన్(5) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు పేసర్ ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ తొలి బంతికి ఓపెనర్ డార్సీ షార్ట్(7) కుల్దీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

అంతకముందు టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌ పరిస్థితులు బౌలింగ్‌కే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. మరోవైపు ముందుగా టాస్‌ గెలిస్తే తాము కూడా బౌలింగ్‌ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆసీస్‌ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ అన్నాడు. ఆసీస్ గడ్డపై మొత్తం మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

ఆసీస్ గడ్డపై సుదీర్ఘ పర్యటనకు ఈ మ్యాచ్‌తో శ్రీకారం

ఆసీస్ గడ్డపై సుదీర్ఘ పర్యటనకు ఈ మ్యాచ్‌తో శ్రీకారం

ఈ మ్యాచ్‌తో ఆసీస్ గడ్డపై సుదీర్ఘ పర్యటనకు టీమిండియా శ్రీకారం చుట్టబోతోంది. బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆసీస్ స్టార్ ప్లేయర్లు డేవిడ్ వార్నర్, స్టీవ్‌ స్మిత్ ప్రస్తుతం జట్టులో లేకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు బలహీనంగా కనిపిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు సొంతగడ్డపై భారత్‌కి ఎలా పోటీనిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అద్భుతమైన పామ్‌లో రోహిత్ శర్మ

అద్భుతమైన పామ్‌లో రోహిత్ శర్మ

ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ అద్భుతమైన పామ్‌లో ఉండగా, విండిస్‌తో మూడు టీ20ల సిరిస్‌లో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ చాలా రోజుల తర్వాత టీ20ల్లో ఆడుతున్నాడు. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడిన భారత్ జట్టు ఏకంగా పది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

 ఆసీస్ గడ్డపైన ఇరు జట్లు ఆరు టీ20లు ఆడగా

ఆసీస్ గడ్డపైన ఇరు జట్లు ఆరు టీ20లు ఆడగా

మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఇందులో ఆసీస్ గడ్డపైన ఇరు జట్లు ఆరు టీ20లు ఆడగా.. అందులోనూ నాలుగింట భారత్‌ గెలుపొందింది. టీ20 జరుగుతున్న బ్రిస్బేన్ పిచ్ ఎక్కువగా పేసర్లకి అనుకూలించనున్న నేపథ్యంలో టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.

Story first published: Wednesday, November 21, 2018, 14:12 [IST]
Other articles published on Nov 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X