న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ వన్డే: ఆరోన్ ఫించ్‌కు 100వ వన్డే, ఆస్ట్రేలియా బ్యాటింగ్

India vs Australia 1st ODI Live Cricket Score: Aaron Finch Opts To Bat Against India In Hyderabad

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నగరంలోని ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌కు ఇది 100వ వన్డే కావడం విశేషం.

India vs Australia: హైదరాబాద్‌లో మ్యాక్స్‌వెల్ విధ్వంసానికి కుల్దీప్ చెక్ పెడతాడా?India vs Australia: హైదరాబాద్‌లో మ్యాక్స్‌వెల్ విధ్వంసానికి కుల్దీప్ చెక్ పెడతాడా?

వికెట్ పొడిగా కనిపిస్తోందని, అందుకే మొదట బ్యాటింగ్ చేయాలని అనుకుంటాన్నమని ఫించ్ చెప్పాడు. భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తామని భావిస్తున్నామని అన్నాడు. రిచర్డ్‌సన్‌ స్థానంలో అలెక్స్ కారేను తీసుకున్నట్లు తెలిపాడు. అలాగే, ఈ మ్యాచ్ ద్వారా వెస్టర్ట్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆష్టన్ టర్నర్ ఆరంగేట్రం చేస్తున్నట్లు తెలిపాడు.

బ్యాటింగ్‌కు సహకరిస్తుందన్న కోహ్లీ

బ్యాటింగ్‌కు సహకరిస్తుందన్న కోహ్లీ

నేల చాలా గట్టిగా ఉందని, బ్యాటింగ్ చేయడానికి బాగా సహకరిస్తుందని కోహ్లీ అన్నాడు. న్యూజిలాండ్‌లో ఎలాంటి ఫలితాన్ని రాబట్టామో ఇక్కడ కూడా అదే చేయాలని అనుకుంటున్నామని కోహ్లీ తెలిపాడు. జట్టు సమతూకంగా ఉందని, చాహల్‌కు విశ్రాంతినిచ్చామని కోహ్లీ చెప్పాడు. మణికట్టు స్పిన్నర్లను రొటేట్ చేస్తున్నామని, టాప్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పులు లేవని తెలిపాడు.

పూర్తిస్థాయి ప్రపంచకప్ జట్టు బరిలో

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో పూర్తిస్థాయి ప్రపంచకప్ జట్టు బరిలో దిగుతోంది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై అంచనాలు బాగా నెలకొన్నాయి. సొంతగడ్డపై టీ20 సిరీస్‌ను చేజార్చుకున్న భారత్.. వన్డే సిరీస్‌తో ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని కోహ్లీసేన‌ భావిస్తోంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు.

రెండు వన్డేల్లోనూ ఆస్ట్రేలియాదే విజయం

కాగా, ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌తో ఆడిన రెండు వన్డేల్లోనూ ఆస్ట్రేలియానే గెలిచింది. 2007లో 47 పరుగుల తేడాతో.. 2009లో మూడు పరుగుల తేడాతో భారత్‌ ఓడింది. ఇరుజట్ల మధ్య 131 వన్డేలు జరిగితే ఆసీస్‌ 74 గెలవగా, భారత్‌ 47 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పదింట్లో ఫలితం రాలేదు.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

భారత్‌: రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, ఎంఎస్‌ ధోనీ, రవీంద్ర జడేజా, కుల్దీప్‌, షమి, బుమ్రా.

ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియా:

ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), ఖవాజా, హ్యాండ్స్‌కోంబ్‌, స్టొయినిస్‌, మ్యాక్స్‌వెల్‌, టర్నర్‌, అలెక్స్‌ క్యారీ, ఆడమ్‌ జంపా, కమిన్స్‌, బెహ్రెన్‌డార్ఫ్‌, రిచర్డ్‌సన్‌.

Story first published: Saturday, March 2, 2019, 13:46 [IST]
Other articles published on Mar 2, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X