Sanju samson Dropped For WI Tour: సంజూ శాంసన్‌పై ఎందుకింత కన్నెర్రతనం.. బీసీసీఐపై నెటిజన్ల మండిపాటు

వెస్టీండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత టీ20 జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించిన సంగతి తెలిసిందే. 18మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను చేతన్ శర్మ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ వెల్లడించింది. ఇక సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు ఈ పర్యటన నుంచి విశ్రాంతినిచ్చినట్లు పేర్కొంది. ఈ పర్యటనలో వన్డే జట్టుకు కూడా వీరిద్దరిని సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయలేదు. ఇటీవల గజ్జలో గాయం కారణంగా జర్మనీలో చికిత్స తీసుకుని కోలుకున్న కేఎల్ రాహుల్ మళ్లీ జట్టులోకి అడుగిడబోతున్నాడు. అలాగే చైనామాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సైతం జట్టులోకి తిరిగి రాబోతున్నాడు. ఇకపోతే సెలెక్షన్ కమిటీ మరోసారి సంజూ శాంసన్‌కు అన్యాయం చేసింది.

శ్రేయస్ అయ్యార్‌కు ఎన్నని అవకాశాలిస్తారు?

గత కొన్నేళ్లుగా సంజూ శాంసన్‌ను అడపాదడపా ఆడిస్తున్న బీసీసీఐ అతన్ని రెగ్యులర్ ప్లేయర్‌గా కన్సిడర్ చేయట్లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల కెపాబిలిటీ ఉన్న సంజూను ఎందుకు ఎంపిక చేయట్లేదో మాత్రం అర్థం కావట్లేదు. ఈ కేరళ స్టార్.. తనకు అవకాశం వచ్చినప్పుడల్లా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్నా.. అతనిపై బీసీసీఐ కన్నెర్రతనం మాత్రం పోవట్లేదు. ఇక బీసీసీఐ సెలెక్షన విధానాన్ని నెటిజన్లు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. శ్రేయస్ అయ్యార్‌కు ఎన్నని అవకాశాలిస్తారు.. సంజూకు ఎందుకు ఇవ్వరు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు.

అసలు రీజన్ ఏంటో చెప్పాల్సిందే..?

అతన్ని పదే పదే డ్రాప్ చేయడానికి మీ దగ్గర ఉన్న నిఖార్సైన రీజన్ ఏంటో చెప్పలాంటూ నెటిజన్లు కడిగిపారేస్తున్నారు. ఇక నెట్టింటా సంజూ శాంసన్, డ్రాప్డ్ అనే హ్యాష్ ట్యాగ్‌లు కూడా ట్రెండింగ్లోకి వచ్చాయి. కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్‌పై వేటు పడింది. ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఉమ్రాన్ పేలవ ప్రదర్శన కనబర్చడంతో అతన్ని సెలెక్టర్లు పక్కనపెట్టారు. ఈ నెల 22 నుంచి భారత వెస్టిండీస్ పర్యటన మొదలవ్వనుంది. తొలుత వన్డే సిరీస్ తర్వాత జూలై 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.

పాపం టీ20ల్లో సంజు శాంసన్‌కు దక్కిన అవకాశాలు ఇవే..!

1 మ్యాచ్ : 2015 జూలైలో జింబాబ్వేతో

1 మ్యాచ్ : 2020 జనవరిలో శ్రీలంకతో

2 మ్యాచ్‌లు : 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో

3 మ్యాచ్‌‌లు : 2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో

3 మ్యాచ్‌లు : 2021 జూలైలో శ్రీలంకతో

2 మ్యాచ్‌లు : 2022 ఫిబ్రవరిలో శ్రీలంకతో

1 మ్యాచ్ : 2022 జూన్‌లో ఐర్లాండ్‌తో

అతనికి దాదాపు గత ఎనిమిదేళ్లలో వచ్చిన అవకాశాలు 14మాత్రమే.

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టు..

వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత టీ20 జట్టు..

రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, July 14, 2022, 18:07 [IST]
Other articles published on Jul 14, 2022

Latest Videos

  + More
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X