న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్లిప్‌లో రహానే క్యాచ్‌లు మిస్: అసలు కారణం చెప్పిన ఫీల్డింగ్ కోచ్!

Ajinkya Rahane Dropped The Catch,It Surprised Me Says Fielding Coach Sridhar
India’s fielding coach R Sridhar reveals why Ajinkya Rahane dropped catches at slip in the Bangladesh series

హైదరాబాద్: రహానే స్లిప్‌లో క్యాచ్‌లను జారవిడవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తెలిపారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన చారిత్రాత్మక డే నైట్ టెస్టులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో రహానే స్లిప్‌‌లో క్యాచ్ మిస్ చేసిన సంగతి తెలిసిందే.

గతేడాది ఇంగ్లాండ్ చేతిలో 1-4తో టెస్టు సిరిస్‌ను చేజార్చుకున్న టీమిండియా ఆ తర్వాత టెస్టు క్రికెట్‌లో తన జోరుని కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో ఓడిన టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సిరిస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

క్రికెట్‌లో అరుదైన షాట్.. బ్యాట్‌ను వెనక్కితిప్పి కొడితే సిక్సర్‌ (వీడియో)!!క్రికెట్‌లో అరుదైన షాట్.. బ్యాట్‌ను వెనక్కితిప్పి కొడితే సిక్సర్‌ (వీడియో)!!

విండిస్‌పై 2-0తో సిరిస్ కైవసం

విండిస్‌పై 2-0తో సిరిస్ కైవసం

ఆ తర్వాత కరేబియన్ గడ్డపై వెస్టిండిస్‌పై 2-0తో టెస్టు సిరిస్‌ను గెలిచినప్పటి నుంచి బంగ్లాదేశ్‌తో నిన్నటి డే నైట్ టెస్టు సిరిస్ వరకు టీమిండియా వరుసగా 12 టెస్టుల్లో 11 టెస్టుల్లో విజయం సాధించింది. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో సైతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెస్టు క్రికెట్‌లో టీమిండియా ఇంతలా ఆధిపత్యం చెలాయించడానికి ప్రధాన కారణం బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేయడమే.

మూడు విభాగాల్లో టీమిండియా సత్తా

మూడు విభాగాల్లో టీమిండియా సత్తా

బరిలోకి దిగారంటే అటు బౌలర్లు, ఇటు బ్యాట్స్ మెన్లు సత్తా చాటుతున్నారు. టెస్టు క్రికెట్‌లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించేది స్లిప్ ఫీల్డింగ్. అవును! రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి క్రికెటర్లు స్లిప్‌లో క్యాచ్‌లను అమాంతం ఒడిసి పట్టుకుంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. మోడ్రన్ డే క్రికెట్‌లో అత్యుత్తమ స్లిప్ ఫీల్డర్లలో అజ్యింకె రహానే ఒకడు.

ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్ మాట్లాడుతూ

ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్ మాట్లాడుతూ

అయితే, బంగ్లాదేశ్‌తో కోల్‌కతా వేదికగ జరిగిన చారిత్రాత్మక డే నైట్ టెస్టులో రహానే స్లిప్‌లో రెండు క్యాచ్‌లు జారవిడిచాడు. రహానే స్లిప్‌లో క్యాచ్‌లను జారవిడవడంపై టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్ మాట్లాడుతూ "రహానే స్లిప్‌లో క్యాచ్‌లను జారవిడిచినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యా. ఎందుకంటే ప్రపంచ ఉత్తమ స్లిప్‌ ఫీల్డర్లలో అతను ఒకడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో మరింత అప్రమత్తంగా ఉంటాడు" అని తెలిపాడు.

స్లిప్‌ స్థానం నుంచి కొంచెం ముందు నిలబడ్డ రహానే

స్లిప్‌ స్థానం నుంచి కొంచెం ముందు నిలబడ్డ రహానే

"రహానే ఫీల్డింగ్‌లో లోపాలు కనిపించడానికి పిచ్ కారణం‌. పిచ్‌లో అనూహ్యంగా బౌన్స్‌ లభిస్తుంది. అంతేకాకుండా స్లిప్‌ స్థానం నుంచి కొంచెం ముందు నిలబడ్డాడు. దీంతో బంతి అతడి ఛాతిపైకి వచ్చింది. దీంతో బంతికి తగ్గట్టుగా రహానే స్పందించలేకపోయాడు" అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Friday, November 29, 2019, 14:55 [IST]
Other articles published on Nov 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X