న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్‌ సింగ్‌ను ఇబ్బంది పెట్టిన ఆ ఇద్దరు బౌలర్లు ఎవరంటే!!

Yuvraj Singh Names His Favourite Overseas Cricketers,Toughest Bowlers He Faced !
Indias 2011 World Cup hero, India All Rounder Yuvraj Singh names the ‘toughest’ bowler and overseas batsmen he admired most

రెండు రోజుల క్రితం టీమిండియా ఆల్‌రౌండర్‌, 2011 ప్రపంచకప్‌ హీరో యువరాజ్‌ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా యువరాజ్‌ పేస్, స్పిన్ బాగా ఆడగలడు. ఎటువంటి బంతినైనా అలవోకగా బౌండరీ బాదగలడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌, ఆస్ట్రేలియా పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ల బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డాడని యువరాజ్‌ తెలిపారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

 వారి బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డా:

వారి బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డా:

నేను ఎదుర్కొన్న కష్టమైన బౌలర్లలో మురళీ ధరన్‌ ఒకరు. అతను బౌలింగ్‌లో చాలా ఇబ్బంది పడేవాడిని. ఒక్కోసారి అతను విసిరే దూస్రాలకు నా వద్ద సమాధానం ఉండకపోయేది. గ్లెన్‌మెక్‌ గ్రాత్‌ కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. విదేశీ ఆటగాళ్లలో ఆసీస్ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అంటే ఇష్టం. పాంటింగ్‌ బ్యాటింగ్‌ చాలా ఇష్టం. వెస్టిండీస్‌ యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్‌, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌లతో కలిసి ఆడటాన్ని ఎంతో ఆస్వాదించా' అని యువీ పేర్కొన్నారు.

 గతేడాదే తప్పుకోవాలనుకున్నా:

గతేడాదే తప్పుకోవాలనుకున్నా:

'గతేడాదే ఐపీఎల్‌ నుంచి తప్పుకోవాలనుకున్నా. అది కుదరలేదు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో మరిన్ని అవకాశాలు రాలేదు. జీవితంలో అనుకున్నవన్నీ జరగవు కదా. ఈ ఐపీఎల్‌లో మరిన్ని మ్యాచ్‌లు ఆడింటే ఇంకా సంతోషంగా రిటైరయ్యేవాడిని' అని యువీ తెలిపారు. ఈ ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరపున యువీ నాలుగు మ్యాచ్‌ల్లోనే ఆడాడు. అందులో ఒక అర్ధ శతకం సాధించాడు.

304 వన్డేలు.. 8701 పరుగులు

304 వన్డేలు.. 8701 పరుగులు

యువీ మొత్తం 40 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1900 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 304 వన్డే మ్యాచ్‌ల్లో 8701 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 58 టీ20 మ్యాచ్‌లు ఆడిన యువీ.. 1177 పరుగులు చేశాడు. 8 ఆఫ్ సెంచరీలు నమోదు చేశాడు.

 టీ20 టోర్నీలలో:

టీ20 టోర్నీలలో:

రిటైర్మెంట్‌ ప్రకటించిన యువీ.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్‌, ఐర్లండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సీనియర్ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. 2012లో చివరిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన యువీ.. 2017లో చివరి వన్డే, టీ20 ఆడాడు. ఇక ఐపీఎల్-12లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినా.. పెద్దగా ఆకట్టుకోలేదు. లీగ్ ఆరంభంలో 4 మ్యాచ్‌లలో ఆడి 98 పరుగులు చేసాడు. మొత్తంగా 132 ఐపీఎల్‌ మ్యాచ్‌లాడిన యువీ.. 129.71 స్ట్రైక్‌రేట్‌తో 2750 పరుగులు చేశాడు.

Story first published: Thursday, June 13, 2019, 14:34 [IST]
Other articles published on Jun 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X