న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20లో భారత్ ఓటమికి ప్రధాన కారణం వెల్లడించిన భజ్జీ

India vs Australia 1st T20 : Team India Have Some Problems To Sort Out : Harbhajan Singh | Oneindia
India have a lot of problems that need to be solved: Harbhajan Singh

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా ఓటమికి కారణం సెలక్షన్‌ విధానం, ఆటగాళ్ల తప్పిదాలే ప్రధాన కారణమని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

<strong>కొత్తగా ఇద్దరికి చోటు: తొలి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టిదే</strong>కొత్తగా ఇద్దరికి చోటు: తొలి రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టిదే

చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి జట్టు మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయాలే కారణమని టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను కాదని ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాను జట్టులోకి తీసుకోవడంపై మండిపడ్డాడు.

తొలి టీ20లో కుల్దీప్‌‌కు తోడుగా చాహల్‌ ఉంటే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ మరింత ఇబ్బందులకు గురయ్యేవారని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా పిచ్‌లపై కృనాల్‌ పాండ్యా రాణించలేడని ఈ మాజీ ముంబై ఇండియన్స్‌ ఆటగాడు పేర్కొన్నాడు.

పాండ్యా సరైన స్పిన్నర్‌ కాదు

పాండ్యా సరైన స్పిన్నర్‌ కాదు

"అసలు కృనాల్ పాండ్యా సరైన స్పిన్నర్‌ కాదని, బంతిని స్పిన్‌ చేయలేడని, కేవలం వేగంగా మాత్రమే బంతులు విసురుతాడు. ఇక ఆరోస్థానంలో బ్యాటింగ్‌ కోసం నాణ్యమైన స్పిన్నర్‌ను పక్కకు పెట్టి కృనాల్‌ను జట్టులోకి తీసుకోవడం ఘోర తప్పిదం. కృనాల్‌ను ఏ ఉద్దేశంతో జట్టులోకి తీసుకున్నారో టీమ్‌ మేనేజ్‌మెంట్‌కైనా క్లారిటీ ఉందా? అని" భజ్జీ ప్రశ్నించాడు.

కృనాల్‌ను తప్పించి అతడి స్థానంలో చాహల్‌కు అవాకాశం

కృనాల్‌ను తప్పించి అతడి స్థానంలో చాహల్‌కు అవాకాశం

ఇక, శుక్రవారం జరిగే రెండో టీ20లోనైనా కృనాల్‌ను తప్పించి అతడి స్థానంలో చాహల్‌కు అవాకాశం ఇవ్వాలని భజ్జీ సూచించాడు. "మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగే రెండో టీ20లోనైనా కృనాల్ పాండ్యా స్థానంలో చాహల్‌ను మనం చూడొచ్చని అనుకుంటున్నా" అని హర్భజన్ అన్నాడు.

అసహనం వ్యక్తం చేసిన హర్భజన్ సింగ్

అసహనం వ్యక్తం చేసిన హర్భజన్ సింగ్

ఇక, బ్యాటింగ్‌ మార్పులపై కూడా హర్భజన్ అసహనం వ్యక్తం చేశాడు. తొలి టీ20లో కేఎల్‌ రాహుల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చిందని అన్నాడు. 12 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్

కేఎల్ రాహుల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంతో కెప్టెన్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. నాలుగో స్థానం రాహుల్‌కు తగదనుకుంటే అతడిని పక్కకు పెట్టి అంబటి రాయుడుని జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని హర్భజన్ సింగ్ సూచించాడు.

నాలుగో స్థానానికి అంబటి రాయుడు చక్కగా సెట్‌ అయ్యాడు

నాలుగో స్థానానికి అంబటి రాయుడు చక్కగా సెట్‌ అయ్యాడు

వన్డేల్లో నాలుగో స్థానానికి అంబటి రాయుడు చక్కగా సెట్‌ అయ్యాడని, టీ20ల్లో కూడా ఆ స్థానంలో రాణిస్తాడనే నమ్మకం ఉందని చెప్పాడు. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ దృష్ట్యా స్పిన్నర్లపై సెలక్టర్లు ఓ అభిప్రాయానికి రావాలని సూచనలిచ్చాడు. చాహల్‌ను వరల్డ్ కప్‌లో ఆడించాలనుకుంటే ఆస్ట్రేలియా పర్యటనలో తగినన్ని అవకాశాలివ్వాలని భజ్జీ అన్నాడు.

Story first published: Thursday, November 22, 2018, 12:34 [IST]
Other articles published on Nov 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X