న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లక్ష్యం పోరాటం కాదు.. గెలవడం: కోహ్లీ

India have to learn the art of crossing the line in pressure situations, says Virat Kohli

సౌతాంప్టన్: మూడో టెస్టు విజయం దక్కించుకున్న భారత్‌కు టెస్టు సిరీస్‌పై ఆశలు పుట్టుకొచ్చాయి. మిగిలిన రెండు టెస్టులను విజయంతో ముగిద్దామని ప్రయత్నించిన టీమిండియాకు నిరాశే మిగిలింది. కేవలం 60 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రతిసారీ విజయానికి దగ్గరగా వచ్చి ఆగిపోవడంపై కోహ్లి విస్తుపోయాడు.

విదేశాల్లో గట్టి పోటీ ఇస్తున్నామని చెప్పుకోవడం కాదు.. గెలవడమూ నేర్చుకోవాలని అతను జట్టుకు సూచించాడు. 'ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌లో 60 పరుగుల తేడాతో ఓడిపోయిన ఇండియా.. సిరీస్‌ను 1-3తో చేజార్చుకున్న విషయం తెలిసిందే. మేం మంచి క్రికెట్ ఆడామని తెలుసు. కానీ ప్రతిసారీ మేం పోటీనిచ్చాం అని చెప్పుకోవడం సరికాదు. విజయానికి దగ్గరగా వచ్చినపుడు.. దానిని అందుకోవడం కూడా నేర్చుకోవాలి.'

'మాకు సామర్థ్యం ఉంది. అందుకే ప్రతిసారీ విజయానికి చేరువగా వస్తున్నాం. ఒత్తిడిలో ఎలా ఆడాలన్నదే ఇప్పుడు మేం దృష్టిసారించాల్సిన విషయం. ఇక విదేశాల్లో సిరీస్‌ను దూకుడుగా ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్‌తో మూడో టెస్ట్‌లో అద్భుతంగా ఆడారు. అదే సిరీస్ తొలి టెస్ట్‌లోనే ఆడితే ఫలితం మరోలా ఉంటుంది. సౌతాఫ్రికాలోనూ సిరీస్ కోల్పోయిన తర్వాత మేల్కొన్నాం. ఇక్కడా అదే జరిగింది'

సిరీస్‌లో బ్యాట్స్‌మెన్ వైఫల్యంపైనా అతను స్పందించాడు. సాధ్యమైనంత వరకు బ్యాట్స్‌మెన్ వాళ్ల అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించారని కోహ్లి పిలుపునిచ్చాడు. అయితే ఇంగ్లండ్ విజయం సాధించడం కోసం శ్రమించిన విషయాన్ని గుర్తు చేశాడు. సొంతగడ్డపై ఇండియాకు ఇంత దగ్గరగా వచ్చిన జట్లు లేవు. కానీ మేం విదేశాల్లో ఆ విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నాం. ఇది మాలో కచ్చితంగా ఆత్మవిశ్వాసాన్ని నింపి తీరుతోందనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Monday, September 3, 2018, 18:30 [IST]
Other articles published on Sep 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X