న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌ను ఓడించే సత్తా భారత్‌కు ఉంది: బౌలింగ్ గ్రేట్ జెఫ్ థామ్సన్

India Are Favourites To Steamroll Australia without Steve And Warner Says Jeff Thomson | Oneindia
India favourites to steamroll Australia sans Steve Smith, Warner: Oz bowling great Jeff Thomson

భువనేశ్వర్: ఆసీస్ గడ్డపై జరిగే టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించే సత్తా భారత్‌కు ఉందని ఒకప్పటి ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం జెఫ్ థామ్సన్ అన్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియానే ఫేవరేట్ అని అన్నాడు. అనుభవజ్ఞులు స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌ లేని ఆసీస్‌ను ఓడించడం టీమిండియాకు పెద్ద కష్టమేమీ కాదని చెప్పుకొచ్చాడు.

ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో 13వ స్వర్ణంతో చరిత్ర సృష్టించిన బైల్స్ప్రపంచ జిమ్నాస్టిక్స్‌లో 13వ స్వర్ణంతో చరిత్ర సృష్టించిన బైల్స్

తాజాగా భువనేశ్వర్‌లో ఎకమరా స్పోర్ట్స్ లిటరరీ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ "అనుభవజ్ఞులైన స్మిత్, వార్నర్ లేకపోవడంతో కంగారూల బ్యాటింగ్ బలహీనంగా మారింది. భారత్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. మంచి పేస్ అటాక్ అందుబాటులో ఉంది. చక్కగా ఆడితే ఆసీస్‌లో సిరీస్‌ గెలవొచ్చు. స్మిత్, వార్నర్ లేని ఆసీస్ పెద్దగా ప్రభావం చూపలేదు. వీరిద్దరూ లేని కంగారూ బ్యాటింగ్‌ లైనప్‌ సగటు స్థాయిలోనే ఉంటుంది" అని అన్నాడు.

 ఆసీస్ ఆటగాళ్ల ఫుట్‌వర్క్‌ చూస్తే టెక్నిక్‌ కొరవడింది

ఆసీస్ ఆటగాళ్ల ఫుట్‌వర్క్‌ చూస్తే టెక్నిక్‌ కొరవడింది

"దుబాయిలో పాక్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో ఆసీస్ ఆటగాళ్ల ఫుట్‌వర్క్‌ చూస్తే వారిలో టెక్నిక్‌ కొరవడినట్టు కనిపిస్తుంది. ఎంతసేపూ బంతిని బౌండరీ దాటించాలనే చూస్తున్నారు. టీ20, వన్డేల వల్లే ఇలా ఆడుతున్నారు" అని థామ్సన్ పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన పేసర్‌గా పేరు గడించిన 68 ఏళ్ల థామ్సన్ 1973-85 మధ్యకాలంలో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కేవలం 51 టెస్ట్‌ల్లోనే 200 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

బాల్ టాంపరింగ్ వివాదంపై జెఫ్ థామ్సన్

బాల్ టాంపరింగ్ వివాదంపై జెఫ్ థామ్సన్

బాల్ టాంపరింగ్ వివాదంపై కూడా థామ్సన్ స్పందించాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆసీస్ క్రీడలకు చాలా పెద్ద చెడ్డ పేరు తెచ్చిందని థామ్సన్ చెప్పాడు. "స్మిత్‌, వార్నర్‌ బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడటం తప్పే. అయితే వారిపై 12 నెలల నిషేధం విధించడం మాత్రం సరైంది కాదు. మొదట ఆరు నెలలు మాత్రమే విధిస్తారని వార్తలు వచ్చినా.. ఈ వ్యవహారంతో ఏమాత్రం సంబంధం లేని ఆస్ట్రేలియా ప్రధాని జోక్యంతో శిక్షకాలం పెరిగింది" అని అన్నాడు.

కోహ్లీని సచిన్‌తో పోల్చడంపై

కోహ్లీని సచిన్‌తో పోల్చడంపై

అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లీని క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్‌తో పోల్చడానికి థామ్సన్ సుముఖత వ్యక్తం చేయలేదు. "విరాట్‌ కోహ్లీ దిగ్గజ ఆటగాడిగా ఎదుగుతున్నాడు. అంతకుముందు అతడు భిన్నంగా ఆడేవాడు. ఈ రోజుల్లో బ్యాట్స్‌మెన్‌ రెండు ఓవర్ల పాటు పరుగులు చేయరు. ఆ తర్వాత ఓ బౌండరీ బాదుతారు. వెంటనే ఓ చెత్త షాట్‌కు ఔట్‌ అవుతారు. కోహ్లీలో చాలా మార్పు వచ్చింది. మిగతా ఆటగాళ్లూ అతడి దారి అనుసరించాలి. కఠిన పరిస్థితుల్లో పోరాట స్ఫూర్తిని చూపెట్టాలి. ఆస్ట్రేలియాలో గెలువాలంటే 300, 350 స్కోరు చేయాలి" అని అన్నాడు.

నా బౌలింగ్‌ వేగం గంటకు 175 మైల్స్ ఉంటుంది

నా బౌలింగ్‌ వేగం గంటకు 175 మైల్స్ ఉంటుంది

ఇక, ప్రస్తుత టెక్నాలజీతో చూస్తే నా బౌలింగ్‌ వేగం గంటకు 175 మైల్స్ ఉంటుందని అన్నాడు. అప్పట్లో వాకాలో తాను వేసిన బౌన్సర్ వేస్తే బ్యాట్స్‌మన్‌ను దాటేసి సైడ్ స్క్రీన్‌ను తాకేవని గుర్తు చేశాడు. తాను బౌలింగ్ చేసిన ఐదుగురు టాప్ బ్యాట్స్‌మెన్లలో బ్రియాన్ లారా, వీవీయన్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్, గ్రేగ్ చాపెల్, బ్యారీ రిచర్డ్స్ ఉన్నారని అన్నాడు. డాన్ బ్రాడ్‌మన్, గ్యారీ సోబర్స్‌తో కలిసి ఆడలేదని అందుకే వాళ్లను వదిలేశానని చెప్పాడు.

Story first published: Saturday, November 3, 2018, 13:09 [IST]
Other articles published on Nov 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X