న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: ఒక్క మ్యాచ్‌తో ధోనీ, కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్!!

IND vs BAN 1st T20 : Rohit Surpasses Dhoni To Become India's Most Capped Player In T20Is
India and Bangladesh: Rohit Sharma Surpasses MS Dhoni to Become Indias Most Capped Player In T20Is

ఢిల్లీ: భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ శుభారంభం చేసింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోరర్. లక్ష చేధనలో బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముష్ఫికర్‌ రహీమ్‌ (43 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌), సౌమ్య సర్కార్‌ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) విజయంలో కీలక పాత్ర పోషించారు.

తొలి టీ20లో టీమిండియాకు షాక్‌.. 1000వ టీ20 మ్యాచ్‌లో బంగ్లా విజయం!!తొలి టీ20లో టీమిండియాకు షాక్‌.. 1000వ టీ20 మ్యాచ్‌లో బంగ్లా విజయం!!

 రోహిత్ @ 99:

రోహిత్ @ 99:

తొలి టీ20 మ్యాచ్‌తో టీమిండియా ఓపెనర్/కెప్టెన్ రోహిత్ శర్మ రెండు రెండు రికార్డులు నెలకొల్పాడు. భారత మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ, సారథి విరాట్ కోహ్లీ రికార్డులను రోహిత్ బద్దలు కొట్టాడు. తొలి టీ20 ఆడడంతో.. రోహిత్ శర్మ అత్యధిక టీ20లు ఆడిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 98 టీ20లు ఆడిన ధోనీ ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడా రికార్డును రోహిత్ అధిగమించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20 రోహిత్‌కు 99వది.

అగ్రస్థానంలో మాలిక్:

అగ్రస్థానంలో మాలిక్:

అత్యధిక టీ20లు ఆడిన భారత ఆటగాళ్లలో రోహిత్ అగ్రస్థానంలో, ధోనీ ద్వితీయ స్థానంలో ఉండగా.. 78 టీ20లతో సురేశ్ రైనా మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 72 టీ0లు ఆడాడు. అయితే వరల్డ్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా పాక్ ఆటగాడు షోయబ్ మాలిక్ (111) ఉండగా.. రెండో స్థానంలో మరో పాకిస్థానీ షాహిద్ ఆఫ్రిది (99) ఉన్నాడు. మూడో, నాలుగో స్థానాల్లో రోహిత్, ధోనీ ఉన్నారు.

 టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు:

టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు:

తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్ 9 పరుగులు మాత్రమే చేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. రోహిత్ 9 పరుగులు చేయడంతో.. కోహ్లీని అధిగమించి టీ20 క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో మొదటి స్థానంకు దూసుకొచ్చాడు. 2,452 పరుగులతో రోహిత్ మొదటి స్థానంలో ఉండగా.. 2,450 పరుగులతో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 72 మ్యాచుల్లో 2,450 పరుగులు చేస్తే.. రోహిత్‌ 99 మ్యాచుల్లో 2,452 పరుగులు చేసాడు.

ఓపెనర్‌గా అరంగేట్రం:

ఓపెనర్‌గా అరంగేట్రం:

రోహిత్ శర్మ ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన సిరీస్‌లో టెస్ట్ క్రికెట్‌లో ఓపెనర్‌గా అరంగేట్రం చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో 529 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో టెస్ట్ క్రికెట్‌లో రోహిత్ తన తొలి డబుల్ సెంచరీ సాధించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో నిలిచాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో టాప్-10లో ఉన్న బ్యాట్స్‌మెన్లలలో తన పేరును కూడా లికించుకున్నాడు.

Story first published: Monday, November 4, 2019, 9:16 [IST]
Other articles published on Nov 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X