న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20లో టీమిండియాకు షాక్‌.. 1000వ టీ20 మ్యాచ్‌లో బంగ్లా విజయం!!

IND vs BAN : 1st T20I Highlights : Bangladesh's Maiden T20I Win Over India || Oneindia Telugu
India and Bangladesh: Mushfiqur Rahim stars in Bangalesh’s first win over India in T20Is

ఢిల్లీ: సొంత గడ్డపై వరుస విజయాలతో దూసుకెళుతున్నటీమిండియాను బంగ్లాదేశ్‌ అడ్డుకుంది. ఇప్పటిదాకా ఆడిన ఎనిమిది టీ20ల్లో ఒక్క విజయం సాధించని బంగ్లా టైగర్స్‌ అద్భుతంగా పోరాడారు. తొలుత పటిష్ఠమైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన టీమిండియాను మోస్తరు స్కోరుకే కట్టడి చేయగా.. ఆ తర్వాత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ చివరివరకు క్రీజులో నిలబడి బంగ్లాకు చిరస్మరణీయ విజయం అందించాడు. తీవ్ర వాయు కాలుష్యం నడుమ మందకొడి పిచ్‌పై ఆదివారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లా 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది.

గప్తిల్‌, నీషమ్‌ మెరుపులు.. ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్‌ విజయం.. జోర్డాన్‌ శ్రమ వృథాగప్తిల్‌, నీషమ్‌ మెరుపులు.. ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్‌ విజయం.. జోర్డాన్‌ శ్రమ వృథా

ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

149 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా తొలి ఓవర్లోనే ఓపెనర్ లిటన్‌ దాస్‌ (7) వికెట్‌ కోల్పోయింది. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న నయీమ్‌ (28 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌), సౌమ్య సర్కార్‌ (35 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్సర్లు) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లే ముగిసేసరికి బంగ్లా 45 పరుగులు చేసింది. అయితే స్పిన్నర్ చహల్‌ తన తొలి ఓవర్లోనే నయీమ్‌ను అవుట్‌ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.

ఆదుకున్న సర్కార్‌:

ఆదుకున్న సర్కార్‌:

అనంతరం క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్‌ రహీమ్‌ (43 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి సర్కార్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ముష్ఫికర్‌ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు అవుటయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. ఇక దూకుడుగా ఆడుతున్న సర్కార్‌ను ఖలీల్‌ బౌల్డ్‌ చేయడంతో బంగ్లా మూడో వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో ముష్ఫికర్, మహ్ముదుల్లా (15 నాటౌట్‌) కలిసి జట్టును గెలుపు తీరాలకు చేరువ చేశారు.

ముష్ఫికర్ పోరాటం:

ముష్ఫికర్ పోరాటం:

బంగ్లా విజయానికి 18 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన స్థితిలో బౌండ్రీ వద్ద కృనాల్ క్యాచ్ వదిలేయడంతో ముష్ఫికర్ బతికిపోయాడు. ఆ ఓవర్‌లో బంగ్లా 13 పరుగులు పిండుకుంది. ఆ తర్వాత ఖలీల్ వేసిన ఓవర్లో ముష్ఫికర్ వరుసగా 4 ఫోర్లు బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసాడు. చివరి ఓవర్లో మహ్ముదుల్లా సిక్స్ కొట్టి బంగ్లాకు విజయాన్ని అందించాడు. బంగ్లాదేశ్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసింది.

ఆదిలోనే షాక్:

ఆదిలోనే షాక్:

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే రోహిత్‌ శర్మ (9) వెనుదిరగడం భారత్‌ భారీ స్కోరు అవకాశాలను దెబ్బ తీసింది. శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పరుగులు చేసినా.. అతని బ్యాటింగ్‌ ఏమాత్రం టీ20 స్థాయికి తగినట్లుగా సాగలేదు. ఇక వేగం పెంచే క్రమంలో రిషభ్‌ పంత్‌తో సమన్వయ లోపంతో పెవిలియన్ చేరాడు. లోకేశ్‌ రాహుల్‌ (15) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (13 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్సర్లు), పంత్‌ (26 బంతుల్లో 27; 3 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేదు.

కృనాల్‌, సుందర్‌ మెరుపులు:

కృనాల్‌, సుందర్‌ మెరుపులు:

కెరీర్‌లో తొలి మ్యాచ్‌ శివమ్‌ దూబే (1)కు కలిసి రాలేదు. కృనాల్‌ పాండ్యా (8 బంతుల్లో 15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌), సుందర్‌ (5 బంతుల్లో 14 నాటౌట్‌; 2 సిక్సర్లు) మెరుపుల కారణంగా చివరి 2 ఓవర్లలో భారత్‌ 30 పరుగులు రాబట్టింది. దీంతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ముష్ఫికర్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ గురువారం రాజ్‌కోట్‌లో జరుగనుంది.

 వెయ్యవ టీ20:

వెయ్యవ టీ20:

ఆదివారం భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి టీ20 ఈ ఫార్మాట్‌లో వెయ్యవది కావడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో 2005 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 జరిగింది. టెస్టు, వన్డే ఫార్మాట్‌లలో కూడా ఇప్పటికే వెయ్యి మ్యాచులు పూర్తయ్యాయి. వెయ్యవ టీ20లో బంగ్లా విజయం సాధించి చరిత్రలోకి ఎక్కింది.

Story first published: Monday, November 4, 2019, 8:30 [IST]
Other articles published on Nov 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X