న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: ఢిల్లీలో తీవ్ర పొగమంచు, వాయు కాలుష్యం.. తొలి టీ20 మ్యాచ్‌పై అనుమానాలు?!!

India and Bangladesh: Cricket Fans Worry about First T20I due to Delhi’s Air Pollution

ఢిల్లీ: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరికొన్ని నిమిషాల్లో దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో కాలుష్య తీవ్రత అధికమవ్వడంతో పాటు తీవ్ర స్థాయిలో పొగమంచు అలుముకుంది. దీంతో మ్యాచ్‌ నిర్వహించడానికి సాధ్యపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం తెలుస్తోంది.

<strong>'కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు.. అతడు లేకుంటే టీమిండియా బలహీనపడుతుంది'</strong>'కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు.. అతడు లేకుంటే టీమిండియా బలహీనపడుతుంది'

 తొలి టీ20పై అనుమానాలు:

తొలి టీ20పై అనుమానాలు:

అయితే తొలి టీ20 మ్యాచ్‌ నిర్వహణపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని బీసీసీఐ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 'తొలి టీ20 మ్యాచ్‌ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికి అయితే మ్యాచ్‌ను ఇంకా రద్దు చేయలేదు. మ్యాచ్‌పై తుది నిర్ణయం ప్రకటించడానికి ఇంకా సమయం ఉంది' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వెల్లడించారు. రాత్రి సమయం కాబట్టి మంచు కూడా బాగా ఉందని సమాచారం.

ప్రమాదకర స్థితికి గాలి నాణ్యత:

ప్రమాదకర స్థితికి గాలి నాణ్యత:

ప్రస్తుతం డిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థితికి చేరుకుంది. సాయంత్రం 6.30 తర్వాత మ్యాచ్‌ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పొగమంచు కారణంగా డిల్లీ విమానశ్రయానికి రావాల్సిన విమానాలను వేరే నగరాలకు దారి మళ్లించారు. మరోవైపు పొగమంచుతో మ్యాచ్‌కు వచ్చే అభిమానులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కునే అవకాశం ఉంది. ఆటగాళ్లతో పాటు అభిమానులకు శ్వాసకు సంబందించి అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉంది.

దూబే అరంగేట్రం:

దూబే అరంగేట్రం:

భారత రెగ్యులర్ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ గైర్హాజరీతో జట్టు పగ్గాలు ఓపెనర్ రోహిత్‌ శర్మ తీసుకోనున్నాడు. సీనియర్లతో పాటు పలువురు కుర్రాళ్లు భారత్‌ తరఫున తమ సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. ఆల్‌రౌండర్‌గా శివమ్‌ దూబే అరంగేట్రం చేయడం దాదాపుగా ఖాయమైంది. హార్దిక్‌ పాండ్యా స్థానంలో చోటు దక్కించుకున్నాడు. రిషభ్‌ పంత్‌ను కూడా కొనసాగిస్తారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చింది.

కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా:

కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా:

మరోవైపు కీలక ఆటగాళ్లు లేకుండానే బంగ్లా జట్టు పొట్టి ఫార్మాట్‌కు రెడీ అవుతోంది. ఐసీసీ బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబల్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ సిరీస్‌కు దూరం కావడంతో బంగ్లాదేశ్ జట్టు బలహీనపడింది. అయితే సీనియర్ ఆటగాళ్లు సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, లిటన్ దాస్, మొసద్దిక్ హుస్సేన్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. మ్యాచ్ జరిగితే తొలి టీ20లో బంగ్లా జట్టు ఎలా ఆడనుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

Story first published: Sunday, November 3, 2019, 18:33 [IST]
Other articles published on Nov 3, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X